close

వార్తలు / కథనాలు

‘సర్కార్‌’ ప్రభావం..ఆ పదం గురించే వెతుకుతున్నారట!

గూగుల్‌ ట్రెండింగ్‌లోనూ ఇదే టాప్‌

‘సర్కార్‌’ ప్రభావం..ఆ పదం గురించే వెతుకుతున్నారట!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఐ యామ్‌ ఏ కార్పొరేట్ క్రిమినల్‌’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ హీరో విజయ్‌ అదరగొడుతున్నారు. మురుగదాస్‌ దర్శకత్వంలో విజయ్‌ నటించిన ‘సర్కార్‌’ చిత్రంలోనిదీ డైలాగ్‌. ఓటుహక్కు, రాజకీయాల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే చిత్రంలో చర్చించిన సెక్షన్‌ 49పీ సినిమాలలోనే కాదు గూగుల్‌లోనూ సంచలనం సృష్టిస్తోంది. ఇందులో చెప్పినట్టు ఈ సెక్షన్‌ ఒకటంటూ ఉందని చాలామందికి తెలీదు.

‘సర్కార్‌’ ప్రభావం..ఆ పదం గురించే వెతుకుతున్నారట!

ఈ సెక్షన్‌ ప్రకారం..ఒక వ్యక్తికి సంబంధించిన ఓటును అతను కాకుండా ఇంకెవరైనా దొంగఓటు వేస్తే సదరు ఓటరుకు ఆ ఓటును తిరిగి తెచ్చుకునే హక్కు ఉంది. బాలెట్‌ విధానం ద్వారా అతనికి మళ్లీ ఓటు హక్కు కల్పించాలి. ఇంతకు ముందు అతడి పేరిట వేసిన ఓటును రద్దు చేయాలనే విషయాన్ని ‘సర్కార్‌’ చిత్రంలో కూలంకషంగా చర్చించారు. అయితే ఇంతవరకు చాలా మందికి తెలియని ఈ సెక్షన్‌ గురించి ప్రస్తుతం ప్రజలు తెగ వెతికేస్తున్నారట. సెక్షన్‌ 49పీ అంటే ఏమిటి?, ఇందులో ఏయే అంశాలను గురించి చర్చించారు? దీన్ని ఉపయోగించి ఓటరు ఎలాంటి హక్కులను పొందవచ్చు?’ అని నెటిజన్లు వెతుకుతున్నారు. ఈ మేరకు ట్రెండింగ్‌లో ఉన్న ఫొటోను ‘సర్కార్‌’ చిత్ర నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ ట్వీటర్‌లో పోస్ట్‌ చేసింది.

ఈ చిత్రంలో విజయ్‌ సరసన కీర్తీ సురేశ్‌ నటించింది. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ ప్రతినాయిక పాత్రలో కనిపించింది. ఎన్నో అంచనాల మధ్య దీపావళి సందర్భంగా మంగళవారం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు కురిపిస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు