
వార్తలు / కథనాలు
వీటని వాట్సాప్‌లో పంపుకునే వెసులుబాటు
ఇంటర్నెట్‌డెస్క్: ఎక్కువగా ఛాటింగ్ చేసేవాళ్లు స్టిక్కర్లు పంపుకునేందుకు ఇచ్చే ప్రాధాన్యమే వేరు. అందుకే దిగ్గజ మెసేజింగ్ సంస్థ వాట్సాప్ సైతం ఈ ప్రాధాన్యాన్ని గుర్తించి కొద్ది రోజుల క్రితమే స్టిక్కర్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. యాప్‌ను అప్డేట్ చేసుకున్న వారికి ఇది ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. అంతర్గతంగా ఉన్న స్టిక్కర్లే కాకుండా థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా కూడా ఇంపోర్ట్ చేసుకొని పంపుకొనే వెసులుబాటును వాట్సాప్ కల్పించింది. ఈ ఫీచర్ కొద్ది రోజుల్లోనే బాగా ఆదరణ పొందింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఏ ఫోటోలనైనా స్టిక్కర్లుగా మార్చి, వాటిని వాట్సాప్ ద్వారా పంపుకునే ఫీచర్ త్వరలో రానున్నట్లు ఓ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది.
* ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలంటే.. ఏదైనా బ్యాక్‌గ్రౌండ్ ఎరేసర్ యాప్ లేదా స్టిక్కర్ మేకర్ ఫర్ వాట్సాప్ యాప్‌లను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి.
* బ్యాక్‌గ్రౌండ్ ఎరేసర్ యాప్ ద్వారా స్టిక్కర్‌గా మార్చదల్చుకున్న ఫోటోను ఎంపిక చేసుకోవాలి. దానిలో బ్యాక్ గ్రౌండ్ తీసేయాలి. దీన్ని పీఎన్జీ ఫార్మాట్లో సేవ్ చేయాలి. ఈ పద్ధతిని స్టిక్కర్ మేకర్ ఫర్ వాట్సప్ యాప్‌లోనూ చేసుకోవచ్చు.
* ఇప్పుడు స్టిక్కర్ మేకర్ ఫర్ వాట్సాప్ యాప్‌ను తెరిచి అందులో కొత్త స్టిక్కర్ ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు. స్టిక్కర్ ప్యాక్ పేరు, తయారు చేసిన వారిపేరు ఎంటర్ చేసిన అనంతరం అందులో ఇంతకుముందు పీఎన్జీ ఫార్మాట్లో చేసిన స్టిక్కర్లను ఎంపిక చేసుకోవాలి. ఇలా కనీసం మూడు స్టిక్కర్లతో ఒక ప్యాక్ తయారు చేసుకోవచ్చు. చివరికి ‘యాడ్ టు వాట్సాప్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇక ఈ స్టిక్కర్లు వాట్సాప్ ద్వారా ఇతరులకు పంపుకోవచ్చు.