Latest Telugu News, Headlines - EENADU
close

వార్తలు / కథనాలు

అందరి నోటా సవ్యసాచి మాట

పెళ్లి వస్త్రాలకు పెట్టింది పేరు

అందరి నోటా సవ్యసాచి మాట

ఇంటర్నెట్‌ డెస్క్‌: పండుగ సీజన్‌ ముగిసిందో లేదో పెళ్లిళ్ల సీజన్‌ మొదలైంది. పెళ్లిలో మిగతా పనుల సంగతి పక్కన పెడితే దుస్తులు, నగలు ఎంపికదే పెద్ద ఘట్టం. ఈ పని పూర్తయితే పెళ్లి పనులన్నీ దాదాపుగా పూర్తయినట్లే. సాధారణ పండగలకే వైవిధ్య వస్త్రధారణలో మెరిసే యువత..పెళ్లి వస్త్రాల ఎంపికలో పెద్ద కసరత్తే చేస్తారు. అందులోనూ సెలబ్రిటీ పెళ్లిళ్లయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఫలానా సెలబ్రిటీ వివాహం చేసుకోనున్నారని వార్తలు రావడమే ఆలస్యం నిశ్చితార్థానికి ఎలాంటి దుస్తులు, నగలు వేసుకుంటారు. వాటిని ఎవరు డిజైన్‌ చేస్తారు. పెళ్లికెలాంటి వస్త్రాలు ఎంపిక చేసుకుంటారు. ఏ నగలు పెట్టుకుంటారు.. ఇలా బోలెడన్ని ప్రశ్నలు వారి అభిమానుల్లో మెదులుతూ ఉంటాయి. కేవలం అభిమానులకే కాదు ఇతర ప్రజలకూ ఆలాంటి ఆలోచనలు వస్తుంటాయి. అయితే ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల పెళ్లిళ్లలో ప్రధానంగా వినిపిస్తున్న మాట సవ్యసాచి కలెక్షన్స్‌. రెండేళ్ల క్రితం జరిగిన సోహా అలీఖాన్‌ వివాహం దగ్గర్నించి మొన్న దీప్‌వీర్‌ జంట పెళ్లి వరకూ అందరికీ డిజైనర్‌ ఒకరే.సవ్యసాచి కేవలం బాలీవుడ్‌ ప్రముఖుల వివాహాలకే పరిమితం కాలేదు. టాలీవుడ్‌ ప్రేమజంట నాగచైతన్య-సమంతల పెళ్లికీ దుస్తులు డిజైన్‌ చేసింది వీళ్లే. వీరితో పాటు పెళ్లివస్త్రాల స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న సవ్యసాచి కలెక్షన్స్‌లో మెరిసిన మన తారలెవరో చూద్దాం.

అందరి నోటా సవ్యసాచి మాట

నాగ చైతన్య- సమంత: టాలీవుడ్‌ ప్రేమ జంట నాగచైతన్య, సమంత వివాహం గతేడాది జరిగిన విషయం తెలిసిందే. ఈ జంటకు పెళ్లి వస్త్రాలను ప్రత్యేకంగా సవ్యసాచి కలెక్షన్స్‌ నుంచే తెప్పించారు. మన తెలుగు సంప్రదాయపు తెలుపు రంగు చీర, ఎరుపు రంగు బ్లౌజ్‌కు తగినట్లు లేత గులాబీ రంగులో ఉన్న నగలు పెళ్లి కూతురు సమంత కోసం డిజైన్‌ చేశారు.

అందరి నోటా సవ్యసాచి మాట

విరాట్‌ కోహ్లీ- అనుష్క శర్మ: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ- బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శర్మ కూడా గతేడాది డిసెంబరులో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని టస్కనీ వేదికగా వీరి పెళ్లి జరిగింది. ఈ వేడుకలో వధువు అనుష్కా లేత గులాబి రంగు, క్రీమ్‌ రంగు పెళ్లి వస్త్రాల్లో మెరిసిపోయారు. వధువుకు కాంబినేషన్‌గా వరుడు విరాట్‌కు సైతం ముదురు గోధుమ రంగు వస్త్రాలను డిజైన్‌ చేశారు.

అందరి నోటా సవ్యసాచి మాట

దీపికా పదుకొణె- రణ్‌వీర్‌ సింగ్‌: బాలీవుడ్‌ ప్రేమ పక్షులు దీపికా పదుకొణె, రణ్‌వీర్‌సింగ్‌ల వివాహం కొద్ది రోజుల క్రితం జరిగిన విషయం తెలిసిందే. ఇటలీలోని లేక్‌ కోమో వేదికగా వీరి వివాహం జరిగింది. సింధీ, కొంకణి సంప్రదాయ వస్త్రాల్లో నవ వధూవరులు మెరిసిపోయారు. సింధీ సంప్రదాయంలో జరిగిన వివాహంలో దీపిక పదుకొణె హైలెట్‌గా నిలిచింది. ఇందులో ఆమె ధరించిన ఓణీ చుట్టూ ‘సౌభాగ్యవతి భవ’ అని రాయడం ప్రధానాకర్షణగా నిలిచింది.

అందరి నోటా సవ్యసాచి మాట

సోహాఅలీఖాన్‌: బాలీవుడ్ నటి సోహా అలీఖాన్‌ వివాహ వస్త్రాలను కూడా సవ్యసాచి కలెక్షన్‌ నుంచే తెప్పించారు. సోహా అభిరుచి మేరకు ముదురు గోధుమ రంగు లెహంగాను డిజైనర్లు ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు.

అందరి నోటా సవ్యసాచి మాట

వీరితో పాటు బాలీవుడ్‌ నటీమణులు అసిన్‌, బిపాసా బసు, కరీనా కపూర్‌ తదితరులు సైతం సవ్యసాచి వస్త్రాల్లో మెరిసిన వాళ్లే. గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంకకు, ఈశా అంబానీకి వీరే పెళ్లి వస్త్రాలు డిజైన్‌ చేస్తారని సమాచారం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు