Latest Telugu News, Headlines - EENADU
close

వార్తలు / కథనాలు

భారీ క్యాబేజ్‌ను పండించిన బాలిక

రూ.70వేలు రివార్డు

పెన్సిల్వేనియా: ఓ తొమ్మిదేళ్ల బాలిక భారీ క్యాబేజ్‌ను పండించి 32వేల మంది పిల్లల్లో విజేతగా నిలిచింది. అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన లిల్లీ రీస్‌ అనే బాలిక స్థానిక ఎలిమెంటరీ పాఠశాలలో చదువుకుంటోంది. అక్కడ ఏటా జరిగే నేషనల్‌ బోన్నీ ప్లాంట్స్‌ క్యాబేజ్‌ ప్రోగ్రామ్‌లో లిల్లీతో పాటు మరో 32 వేల మంది పిల్లలు పాల్గొన్నారు. లిల్లీ తన తల్లి సాయంతో క్యాబేజ్‌ మొక్కను పెంచడం మొదలుపెట్టింది.

అయితే సాధారణ క్యాబేజ్‌లా కాకుండా అది ఇంతకింతకు పెరుగుతూ ఓ పెద్ద పువ్వులా తయారైంది. ఈ క్యాబేజ్‌ను ప్రోగ్రామ్‌ అధికారులకు చూపించగా ఆశ్చర్యపోవడం వారి వంతైంది. అంతేకాదు లిల్లీకి వెయ్యి డాలర్లు (దాదాపు రూ.70వేలు) నగదును బహుమతిగా అందించారు. అయితే ఈ క్యాబేజ్‌తో లిల్లీ తల్లి సలాడ్‌ తయారుచేసింది. ఇంటిల్లిపాది తిన్నా ఆ సలాడ్‌ పూర్తికాలేదు. దాంతో తమ గార్డెన్‌లో పెంచుకుంటున్న కుందేళ్లకు ఆహారంగా పెట్టినట్లు లిల్లీ తెలిపింది. ఏదేమైనా ఈ క్యాబేజ్‌ ఫొటో మాత్రం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు