close

వార్తలు / కథనాలు

ఈ గుడికి వెళ్లారంటే ‘బంధం’ తెగినట్లే!

దేవాలయాలకు వెళ్తే సాధారణంగా మంచి జీవిత భాగస్వామిని ఇవ్వమని, మంచి ఉద్యోగం లభించేలా చేయమని, అందరితో బంధాలు చక్కగా ఉండేలా చూడమని దేవుళ్లను కోరుకుంటాం. కానీ, జపాన్‌లోని ఓ దేవాలయానికి మాత్రం భర్తతో విడాకులు ఇప్పించమని, బంధాల నుంచి విముక్తి చేయమని కోరుకోవడానికే వెళ్తారట. ఎందుకంటే భక్తులు కోరుకున్న బంధాన్ని తెంచడంలో ఆ ఆలయం సుప్రసిద్ధం. ‘యాసుయ్ కోన్పేగు’ అనే ఈ దేవాలయం జపాన్‌లోని ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన జిల్లా హిగషియమలోని క్యోటో నగరంలో ఉంది.

జీవిత భాగస్వామితో విడిపోవాలనుకున్నా, మరో అమ్మాయి/అబ్బాయితో కొనసాగుతున్న తన జీవిత భాగస్వామి ప్రేమాయణానికి ఫుల్‌స్టాప్‌ పడాలన్నా.. ఒప్పందంతో ఉన్న ఉద్యోగంలో నుంచి తనంతట తానుగా కాకుండా కంపెనీయే సామరస్యంగా బయటకు పంపాలన్నా, వ్యాపార భాగస్వామితో వ్యాపారం ముగించాలన్నా కచ్చితంగా గొడవలు జరుగుతాయి. వాగ్వాదం, ఘర్షణ లాంటి ఘటనలు చోటుచేసుకుంటాయి. కోర్టు కేసులు, ఆర్థిక అడ్డంకులతో ఎన్నో చిక్కులు వచ్చిపడతాయి. ఆ తర్వాత ఒకరి ముఖం మరొకరు చూసుకోలేని పరిస్థితీ ఏర్పడుతుంది. అలాంటివేవీ జరగకుండా ప్రశాంతంగా, స్నేహపూర్వకంగా ఆ బంధాలు తెగిపోవాలంటే ‘యాసుయ్‌ కోన్పేగు’ దేవాలయంలో ప్రార్థనలు చేస్తే సరి. 

ఈ దేవాలయంలో పెద్ద బండరాయి ఉంది. దాని మధ్యలో మనిషి దూరేంత రంధ్రం ఉంటుంది. భక్తులు తాము తెంచుకోవాలనుకుంటున్న బంధం వివరాలను చీటిపై రాసి బండరాయి మధ్యలో ఉన్న రంధ్రం నుంచి రెండు సార్లు వెళ్లొచ్చి బండరాయిపై ఉన్న వస్త్రానికి కట్టాలి. తమ బంధాన్ని దూరం చేయమని ప్రార్థించాలి. అలా చేసిన వారికి కచ్చితంగా మొక్కు తీరుతుందని జపాన్‌ ప్రజలు విశ్వసిస్తున్నారు. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు