close

వార్తలు / కథనాలు

చూపులేకపోయినా..రూపొందించిన చిత్రాలు అద్భుతం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: చూపు, కాళ్లూ చేతులు లేని వారిని చూస్తే సాధారణంగా ఎవరికైనా జాలి కలుగుతుంది. ‘అయ్యో భగవంతుడా వారికి ఇలాంటి పరిస్థితి కల్పించావేంటి’ అని బాధపడుతుంటాం. కానీ.. వైకల్యాన్ని అధిగమించి కొందరు చేసే అద్భుతాలను చూస్తే వారి జీవితం నుంచి ఎంతో ప్రేరణ పొందుతాం. వైకల్యం వారిని ఎంత వెనక్కి లాగుతున్నా లెక్కచేయకుండా ఎంతో పట్టుదలతో జీవితంలో ముందడుగు వేస్తూ కోట్లాది మందిలో స్ఫూర్తిని రగిలించే వారెందరో మన మధ్యన ఉన్నారు. అంధత్వం కళ్లకే తప్ప మనస్సుకు, మెదడులో రగిలే ఆలోచనలకు, సృజనాత్మకతకు కాదని నిరూపించిన అతికొద్ది మందిలో జార్జ్‌ రెడ్‌హాక్ ఒకరు. ఆయన కళ్లతో చూడలేకపోయినా.. అందరినీ అబ్బుర పరిచేలా చిత్రాలను రూపొందించగలరు. ఆయన తనను తాను ఎప్పుడూ కళాకారుడిగా చెప్పుకోలేదు. కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ సాయంతో ఆయన రూపొందించిన అద్భుతమైన జిఫ్‌ డిజైన్లు ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తున్నాయి. దృష్టి లోపంతో తనలో కలిగిన గందరగోళానికి తన చిత్రాలే ఓ కళాత్మక రూపం అని చెబుతుంటారు అమెరికాకు చెందిన జార్జ్‌ రెడ్‌హాక్‌. పుట్టుకతో ఆయన అంధుడు కాదు.. తన జీవితంలో జరిగిన అనూహ్య ఘటనలో రెడ్‌హాక్‌ చూపును కోల్పోయారు. అయితే, తన మెదడులో నిక్షిప్తమైన చిత్రాలను కంప్యూటర్‌ సాయంతో వాటికి మరింత సృజనాత్మకతను జోడించి అద్భుతంగా రూపొందించిన  యానిమేషన్‌ చిత్రాలు, పెయింటింగ్‌లు మాత్రం ప్రతి ఒక్కరినీ అబ్బురపరచడమే కాదు.. మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి.


Tags :

మరిన్ని