close

వార్తలు / కథనాలు

గున్నను రక్షించినందుకు తల్లి ఏనుగు కృతజ్ఞత

వైరల్‌ అవుతున్న వీడియో

ఇంటర్నెట్‌ డెస్క్‌: కృతజ్ఞత మనిషి లక్షణం అంటారు. కానీ జంతువులు కూడా ఈ స్వభావాన్ని కలిగి ఉంటాయని తెలిపే ఘటనే ఇది. తన పిల్లను రక్షించిన వారికి కృతజ్ఞతలు చూపడానికి వెనక్కి వచ్చిన ఒక ఏనుగు వీడియో ఇప్పుడు అంతర్జాలంలో వైరల్‌ అవుతోంది. ఎలాపడిందో ఏమో గానీ.. ఒక గున్న ఏనుగు చిన్న గోతిలో పడిపోయింది. బయటపడటానికి ఎంత ప్రయత్నించినా జారుతున్న మట్టి వల్ల సాధ్యం కాలేదు. దానిని కాపాడటానికి తల్లి, గుంపులో ఉన్న ఇతర ఏనుగులు చేసిన ప్రయత్నాలూ ఫలించలేదు. ఈ ఘటనను చూసిన స్థానికులు స్పందించారు. పొక్లేనర్‌తో కొందరు ప్రయత్నించడంతో బయటపడిన గున్న ఏనుగు ఒక్క ఉదుటన తల్లి దగ్గరకు పరుగుతీసింది. ఇక్కడే మనసున్న ప్రతి ఒక్కరినీ కదిలించే సంఘటన జరిగింది. కుటుంబంతో సహా అడవిలోకి తిరుగుముఖం పట్టిన తల్లి ఏనుగు వెనక్కి తిరిగి.. కాసేపు తొండాన్ని ఎత్తి తన పిల్లను రక్షించినందుకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ వీడియోను ఓ అటవీ అధికారి ట్విటర్‌లో షేర్‌ చేయగా ఇప్పటికే 36 వేల మందికి పైగా చూశారు, 11 వేల మంది రీట్వీట్‌ చేశారు.



Tags :

మరిన్ని