close

వార్తలు / కథనాలు

ఒళ్లు గగుర్పొడిచే విన్యాసం.. పట్టుతప్పి క్షణాల్లో! 

ఒళ్లు గగుర్పొడిచే విన్యాసం.. పట్టుతప్పి క్షణాల్లో! 

ఇంటర్నెట్‌డెస్క్‌: స్టంట్‌ షోల్లో చేసే విన్యాసాలు చూస్తుంటే మనకు ఒళ్లు గగుర్పొడుస్తూ ఉంటుంది. ఎక్కడ పడిపోతారో.. వారికేమైనా అవుతుందేమోనని చూసే వాళ్లు కంగారుపడిపోతుంటారు. అమెరికాలో ప్రసారమయ్యే ఓ టీవీ షోలోనూ ఓ జంట ఇలాంటి డేరింగ్‌, డ్యాషింగ్‌ స్టంట్‌ చేసింది. అయితే ఈ క్రమంలో అబ్బాయి చేయి పట్టుతప్పడంతో అమ్మాయి కింద పడిపోయింది. అసలేం జరిగిందంటే..

అమెరికాస్‌ గాట్‌ ట్యాలెంట్’‌ మంగళవారం ఎడిషన్‌లో టైసీ నీల్సన్‌, మేరీ వోల్ఫీ నీల్సన్‌ దంపతులు ట్రపెజె విన్యాసాలు చేశారు. ట్రపెజె అంటే తాళ్లతో వేలాడదీసిన ఓ కర్రపై విన్యాసాలు చేయడం. వీరి విన్యాసాలు చూసి అక్కడున్న న్యాయ నిర్ణేతలు, ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ ప్రోత్సహించారు. అంతా బాగానే ఉంది అనుకునేలోపు వోల్ఫీ పట్టుతప్పి కిందపడిపోయింది. విన్యాసంలో భాగంగా టైసీ.. వోల్ఫీ నీల్సన్‌ను కిందకు జారవిడిచి ఆమె చేతులు పట్టుకోవాలి. అయితే ఆ సమయంలో టైసీ పట్టు కోల్పోవడంతో వోల్ఫీ కిందపడిపోయింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఆమెకు ఏమైందోనని గట్టిగా అరిచారు. అదృష్టమేంటంటే.. కింద మెత్తని పరుపు ఉండటంతో వోల్ఫీకి ఎలాంటి గాయాలు కాలేదు.

కాగా.. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన వారంతా ఖవామ్మో.. జస్ట్‌ మిస్‌.. అదృష్టం బాగుంది..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 


Tags :

మరిన్ని