close

వార్తలు / కథనాలు

అరచేతిలో అబ్బురపరిచే వంతె

స్వర్గలోకానికి ఏమాత్రం తీసిపోదు

అరచేతిలో అబ్బురపరిచే వంతె

వియత్నాం: ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన చారిత్రక కట్టడాలు ఉన్నాయి. కొన్నింటిని చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. మరికొన్నింటిని చూస్తే అవి ఉన్న ప్రదేశానికి వెళ్లి ఆ అందాలను తనివితీరా ఆస్వాదించాలనిపిస్తుంది. అలాంటి కట్టడాల్లో ‘కౌ వాంగ్’ వంతెన ఒకటి. వియత్నాంలో ఉంది ఈ అద్భుతమైన కట్టడం. దీనిని గోల్డెన్‌ బ్రిడ్జ్‌ అని కూడా పిలుస్తారు. ఇంతకీ ఇందులో అంత అద్భుతమైన విషయం ఏముందంటారా? ఈ వంతెనను రెండు అరచేతులు పట్టుకున్నట్లుగా రూపొందించారు. దూరం నుంచి చూస్తే ఆ రెండు చేతులే ఈ వంతెనను పడిపోకుండా పట్టుకున్నాయా? అనిపించేంత అద్భుతంగా దీనిని కట్టారు.

డానాంగ్‌ ప్రాంతంలోని బానా హిల్స్‌ రిసార్ట్‌లో ఈ వంతెనను నిర్మించారు. సముద్రానికి 1400 అడుగుల ఎత్తులో ఈ వంతెనను నిర్మించారు. ఈ వంతెనపై నిలబడి చూస్తే భూమిపైనే స్వర్గలోకం ఉన్నట్లు అనిపిస్తుంది. జూన్‌లో ఈ వంతెనను సందర్శన నిమిత్తం తెరిచారు. వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం థైన్‌ థాయ్‌ గార్డెన్‌కు వెళ్లేవారు ఈ వంతనను కచ్చితంగా వీక్షించేందుకు వెళ్తారు. వంతెనకు అటు ఇటు పర్పుల్‌ రంగులో ఉండే లోబిలియా చామంతి పూల మొక్కలను నాటారు. వియత్నాంకు వచ్చే పర్యాటకులను ఆకర్షించేందుకే రెండు బిలియన్‌ డాలర్ల ఖరీదైన ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ వంతెనను నిర్మించారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న