close

వార్తలు / కథనాలు

ఈ దోసకాయ పొడవెంతో తెలుసా..

ఈ దోసకాయ పొడవెంతో తెలుసా..

లండన్: ఈ ఫొటోను చూసి పొట్లకాయ అనుకుంటే మీరు పొరబడినట్లే.. ఎందుకంటే ఇది దోసకాయ. నమ్మడం లేదు కదూ.. కానీ, ఇది దోసకాయంత పొడవైన నిజం. భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత పొడవైన దోసకాయను పండించారు. దీని పొడవు 129.54 సెంటీమీటర్లు. ప్రార్థనలు చేయడం వల్లే ఈ దోసకాయ ఇంత పొడవుగా పండిందని ఆయన చెప్పడం విశేషం.

భారత్‌కు చెందిన రఘ్‌బీర్‌ సింగ్‌ సంఘేరా 1991లో యూకే వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. డెర్బీ నగరంలోని ఓ గురుద్వారాలో మతగురువుగా పనిచేస్తున్నారు. యూకేకు వెళ్లేముందు రఘ్‌బీర్ వ్యవసాయం చేసేవారు. ఆ మక్కువతోనే అక్కడికి వెళ్లిన తర్వాత కూడా తన ఇంటి ప్రాంగణంలో చిన్నచిన్న మొక్కలు పెంచడం ఆరంభించారు. అలా ఇటీవల ఆయన పెరట్లోని ఓ దోస తీగకు అతి పొడవైన దోసకాయ పండింది. దీని పొడవు 129.54 సెంటీమీటర్లు(51 అంగుళాలు).

ఈ దోసకాయ పొడవెంతో తెలుసా..

ఇప్పటివరకు 2011లో వేల్స్‌ ప్రాంతంలో పండిన 107 సెంటీమీటర్ల (42.13 అంగుళాలు) దోసకాయే ప్రపంచంలోనే అతిపొడవైన దోసకాయగా గిన్నిస్‌ రికార్డు సాధించింది. తాజాగా ఆ రికార్డును రఘ్‌బీర్‌ బద్దలుకొట్టారు. ఈ సందర్భంగా ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దోసకాయ పొడవు పెరగాలని తాను రోజూ ప్రార్థనలు చేశానని.. దాన్ని వల్లే ఇది సాధించగలిగాని చెబుతున్నారు రఘ్‌బీర్‌.

‘గత సంవత్సరం 39 అంగుళాల దోసకాయను పండించాను. ఈసారి కూడా అలాంటి రకం విత్తనాన్నే నాటి మరింత పొడవుగా పండించాలనుకున్నాను. అందుకోసం రోజూ దోస తీగ వద్ద కూర్చుని ప్రార్థనలు చేశాను’ అని రఘ్‌బీర్‌ చెబుతున్నారు. త్వరలోనే ఈ దోసకాయతో గిన్నిస్‌ బుక్‌ రికార్డుకు దరఖాస్తు చేయనున్నట్లు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు