close

వార్తలు / కథనాలు

ఆవు పేడతో చేసిన డ్రెస్సు చూశారా?

నెదర్లాండ్‌ మహిళ ప్రతిభ

ఆవు పేడతో చేసిన డ్రెస్సు చూశారా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు కాలికి లేదా దుస్తులకు కాస్త పేడ అంటుకుందంటే ఎక్కడ లేని చిరాకు వచ్చేస్తుంది. కొందరైతే సబ్బు అరిగిపోయే వరకు డ్రెస్సు చిరిగిపోయే వరకు కడుగుతూనే దాన్ని కడుగుతూనే ఉంటారు! మరి అదే ఆవు పేడతో ఏకంగా దుస్తులు తయారు చేస్తే.. ఊహించడానికే వింతగా ఉంది కదూ!. వృధాగా పారేసే పేడతో ఒక వస్తువు తయారు చేయాలనే ఆలోచన రావడమే గొప్ప. అందులోనూ దానికి 2లక్షల నగదు బహుమతి రావడం అంతకు మించిందే. అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవడంలోనే కదా! అసలు మజా ఉండేది. అదే ప్రయత్నం చేసింది నెదర్లాండ్‌కు చెందిన జలీలా ఎస్సాది. ఓ స్టార్టప్‌ కంపెనీ అధిపతి అయిన ఈమె పర్యావరణ వేత్త కూడా. ఆవు పేడతో డ్రెస్సులు తయారు చేయడానికి ఏకంగా ఓ స్టార్టప్‌ కంపెనీనే నడిపిస్తోంది. మరి వినడానికే ఆశ్చర్యంగా ఉన్న ఈ డ్రెస్సు సంగతేంటి? ఎలా తయారు చేస్తారో చూద్దాం..

ఎలా తయారవుతుంది?.. కొద్ది మొత్తంలో ఆవు పేడను తీసుకుని అందులో దాదాపు 80శాతం నీరు పోసి అందులో ఉన్న సెల్యులోజ్‌ పదార్థాన్ని వేరు చేస్తారు. ఆ సెల్యులోజ్‌ను ఎండబెట్టి పిడకల మాదిరిగా చేస్తారు. దానిలోని సెల్యులోజ్‌ శాతాన్ని గుర్తించేందుకు బాగా నలిపి పొడిగా చేస్తారు. దానికి జిలిటెన్‌ వంటి పదార్ధాన్ని కలుపుతారు. దాన్ని పలుచని ప్లేట్‌లా తయారు చేసి ఇంకొన్ని రసాయనాలు చేర్చి పలుచటి దారాల్లాగా చేస్తారు. సాధారణంగా ఆవుపేడ నుంచి వచ్చే వాసన ఆ సెల్యులోజ్‌కు కూడా ఉంటుంది. అది రాకుండా ఉండేందుకు కొన్ని పరిమళాల ద్రవ్యాలు కలుపుతారు. పూర్తిస్థాయిలో తయారయ్యాక వాటికి కావాల్సిన రంగులను అద్దుతారు. గట్టిగా ఉండటం సెల్యులోజ్‌ సహజ లక్షణం కావడంతో దానితో తయారు చేసిన దుస్తులు కూడా దృఢంగానే ఉంటాయి.

ఆవు పేడతో చేసిన డ్రెస్సు చూశారా?

న్యూజిలాండ్‌లోని దాదాపు 60శాతం నదులు, కాలువలు, కుంటలు పశుసంబంధిత వ్యర్థాల వల్ల కలుషితమై ఉన్నాయి. దీనివల్ల అక్కడి నదుల్లో, కాలవల్లో ఈత కొట్టే వారు అలర్జీల బారిన పడుతున్నారు. ఆ నీటిలోని ఆల్గేలు, నేట్రేటులు, ఫాస్ఫేటులు, బ్యాక్టీరియాల కారణంగా చర్మ సంబంధిత వ్యాధులు అధికమవుతున్నాయి. దీంతో డైరీ పరిశ్రమ ఎక్కువగా ఉండే దేశాలైన న్యూజిలాండ్‌, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో ఈ డైరీ ఉత్పత్తులపై పరిమితి విధించారు. ఈ సమస్యలన్నింటికీ చెక్‌ పెట్టే దిశగా జలీలా వినూత్నంగా ఆలోచించింది. ఆ ఐడియాకు కార్యరూపం దాల్చి డ్రెస్సులు తయారు చేయిస్తోంది. మరి ఇంతటి ప్రతిభ ఉన్నవాళ్లను లోకం గుర్తించకుండా ఉంటుందా??. చివాస్‌ వెంచర్‌, హెచ్‌ అండ్‌ ఎం ఫౌండేషన్‌ ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్‌ ప్రదర్శలనల్లో జలీలా మొదటిసారి తయారు చేసిన డ్రెస్సును ప్రదర్శించగా ఏకంగా 9 అవార్డులతో పాటు రెండు లక్షల డాలర్ల నగదు బహుమతి కూడా అందుకుంది. మరి ఇంతటి సృజనాత్మకత ఉన్న వాళ్లని ఎవరైనా మెచ్చుకోకుండా ఉండగలరా అని తెలిసిన వారు తెగ పొగిడేస్తున్నారు.


Tags :

మరిన్ని