close

వార్తలు / కథనాలు

ప్రయాణికులు దాటుతుంటే రైలు ఎదురుచూస్తోంది

వీడియో వైరల్

ప్రయాణికులు దాటుతుంటే రైలు ఎదురుచూస్తోంది

దిల్లీ: అమృత్‌సర్‌లో రావణ దహనం సందర్భంగా రైలు ప్రమాదానికి గురై 62 మంది మరణించిన ఘటన దేశ ప్రజలను తీవ్రంగా కలచివేసింది. దాన్ని చూసైనా ఇకనుంచి రైలు మార్గాల్లో సురక్షితంగా వెళ్లడానికి ప్రయత్నించాలనుకుంటాం. ముఖ్యంగా రైల్వే క్రాసింగ్‌ల వద్ద చాలా అప్రమత్తంగా ఉండాలి. ఒక వేళ రైలు వస్తుంటే తప్పకుండా ఆగడమే మంచిది. కానీ, ఈ వీడియోలోని వారు మనం ఆగడమేంటని అనుకున్నారేమో! అసలు రైలు ప్రమాదాలనేవి జరుగుతాయని తెలీదేమో! అన్నట్లు ఇష్టం వచ్చినట్లు పట్టాలు దాటేస్తున్నారు. ఒక పక్క దారివ్వాలంటూ రైలు హారన్‌ కొడుతోంది, మరోపక్క అక్కడి గార్డ్ వారిని కొద్దిసేపు ఆగండని వారిస్తున్నాడు. కానీ, ఇవేవి వారి చెవికెక్కడం లేదు. అయితే ఈ ఘటన వాస్తవంగా ఎక్కడ జరిగిందో తెలీదు కానీ, దానికి సంబంధించిన వీడియో మాత్రం వైరల్‌గా మారింది. అందులో ప్రజలు ప్రవర్తిస్తోన్న తీరుకు నోరెళ్లబెట్టడం మినహా ఏమీ చేయలేయమనిపిస్తుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు