close

వార్తలు / కథనాలు

సంపన్నుల సౌధాల గురించి తెలుసా?

ఒక్కో ఇంటికి ఒక్కో ప్రత్యేకత

ఏటా ఫోర్బ్స్‌ ప్రపంచంలోనే ధనవంతుల జాబితా విడుదల చేస్తూ ఉంటుంది. వారి ఆస్తి ఎంత, గతేడాదికి.. ఈ ఏడాదికి తేడా ఎంత? అంటూ వివరాలు ఇస్తుంటారు. ఈ ఏడాది కూడా ఆ జాబితా వచ్చింది.  ఈ నేపథ్యంలో ఫోర్బ్స్ జాబితాలో మొదటి ఆరు స్థానాల్లో నిలిచిన దిగ్గజాలు ఎక్కడ ఉంటున్నారు, వారి ఇళ్ల ధర లాంటి విషయాలు తెలుసుకుందామా!


 

రూ. 1206 కోట్ల ఇంటిలో... 

ఫోర్బ్స్‌ ప్రకటించిన 400 మంది సంపన్నుల జాబితాలో బిల్ గేట్స్‌ మొదటి స్థానంలో నిలిచారు. గత 23 సంవత్సరాలుగా ఈయనే మొదటి స్థానంలో కొనసాగుతుండటం విశేషం. బిల్‌ గేట్స్‌ ఆస్తి విలువ సుమారు రూ. 5,75,000 కోట్లు (81 బిలియన్ డాలర్లు). ఈయన వాషింగ్టన్‌లోని మెడినా ప్రాంతంలో నివసిస్తున్నారు. 1988లో సుమారు రూ. 447 కోట్లు (63 బిలియన్‌ డాలర్లు) ఖర్చు పెట్టి విలాసవంతమైన ఇంటిని నిర్మించుకున్నారు.  ప్రస్తుతం ఆ ఇంటి విలువ రూ. 1206 కోట్లు 170మిలియన్‌ డాలర్లు).


5.35 ఎకరాల్లో... 

ఫోర్బ్స్ జాబితాలో అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్ బీజోస్‌ రెండో స్థానంలో ఉన్నారు. 15 ఏళ్ల పాటు రెండో స్థానంలో ఉన్న వారెన్ బఫెట్‌ని బీజోస్‌ వెనక్కినెట్టారు. బీజోస్‌ ఆస్తి విలువ సుమారు రూ.4,75,674 కోట్లు (67 బిలియన్‌ డాలర్లు). వాషింగ్టన్‌లోని మెడినా ప్రాంతంలో సుమారు 5.35 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత సుందరంగా భవనం నిర్మించారు. ఈ భవనం వాషింగ్టన్‌లోని అమెజాన్‌ ప్రధాన కార్యాలయానికి దగ్గరగా ఉంటుంది.


1958లో కొని... 

ఫోర్బ్స్ జాబితాలో వరుసగా 15 ఏళ్లపాటు వరుసగా రెండో స్థానంలో ఉన్న వారెన్‌ బఫెట్... ప్రస్తుతం మూడో స్థానంలో నిలిచారు. బఫెట్‌ ఆస్తి విలువ సుమారు రూ.4,65,025కోట్లు (65.5 బిలియన్‌ డాలర్లు). ఈయన నెబ్రస్కాలోని ఒమహ ప్రాంతంలో నివసిస్తున్నారు. 1958లో సుమారు రూ. 25 లక్షలు (35వేల డాలర్లు)తో 1921లో నిర్మించిన భవనాన్ని కొనుగోలు చేసి అందులో ఉంటున్నారు.  ఈ ఇంటిని కొన్నాక ఆయన మనసుకు నచ్చినట్లు మార్పులు చేసుకున్నారట.


మొత్తం ఐదు ఇళ్లు

ఫోర్బ్స్ జాబితాలో అతి చిన్న వయసున్న సంపన్నుడు మార్క్ జుకర్‌బర్గ్‌. ఈయన రూ.3,94,029 కోట్ల (55.5 బిలియన్‌ డాలర్లు)తో నాలుగో స్థానంలో నిలిచాడు. 2011లో రూ.50 కోట్లు (7 మిలియన్‌ డాలర్లు)తో ఓ ఇల్లు కొనుక్కున్నారు. దీంతోపాటు వ్యక్తిగత స్వేచ్ఛ కోసం ఆ భవనం చుట్టూ ఉన్న నాలుగు భవనాలను సుమారు రూ.311 కోట్లు (43.8 మిలియన్‌ డాలర్లు) వెచ్చించి కొన్నాడు. త్వరలో ఆ భవనాలను కూల్చి కొత్త ఇంటిని నిర్మించాలనే ఆలోచనతో ఉన్నాడట మార్క్. 


జపనీస్‌ ఆర్కిటెక్చర్‌తో

ఫోర్బ్స్‌ వెల్లడించిన జాబితాలో ఒరాకిల్ సంస్థ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్‌ ఐదో స్థానంలో ఉన్నారు. ఈయన ఆస్తి విలువ సుమారు రూ.3,50,011 కోట్లు. బీచ్‌వుడ్‌లోని మాలిబు ప్రాంతంలో దాదాపు రూ.497 కోట్లు (70 మిలియన్‌ డాలర్లు) వెచ్చించి ఓ బంగ్లా కొనుగోలు చేశారు. 2012లో హవావీలోని ఆరో అతిపెద్ద లాండ్‌ ఆఫ్ లానై దీవిలో 98 శాతాన్ని సుమారు రూ.3,550 కోట్లు(500 మిలియన్ డాలర్లు)కు కొనుక్కున్నారు. కాలిఫోర్నియాలో ఉడ్‌సైడ్‌లో జపనీస్‌ ఆర్కిటెక్చర్‌తో 2.3ఎకరాల్లో ఉన్న భవనాన్ని సుమారు రూ.780 కోట్ల (110 మిలియన్‌ డాలర్ల)తో కొన్నారు. 


- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

మరిన్ని