close

వార్తలు / కథనాలు

ప్రజల్లో ఒత్తిడి స్థాయి అధికంగా ఉంది!

వాషింగ్టన్‌ (అమెరికా): ప్రపంచవ్యాప్తంగా చాలా మందిలో ఆగ్రహం, ఒత్తిడి, మానసిక బాధ వంటి లక్షణాలు పెరిగిపోతున్నాయని ఓ సర్వేలో వెల్లడైంది. దాదాపు 140 దేశాల్లోని 1,50,000 మంది నుంచి అభిప్రాయాలను తీసుకున్న గల్లప్‌ సంస్థ పరిశోధకులు తాజాగా ఫలితాలను వెల్లడించారు. ప్రజల సానుకూల, ప్రతికూల అనుభవాలను గురించి పరిశోధకులు అడిగి తెలుసుకున్నారు. ఇందులో పాల్గొన్న వారిలో మూడు వంతుల మంది ప్రజలు తాము ఒత్తిడికి గురవుతున్నామని చెప్పారు. ప్రతి ఐదుగురిలో ఒకరు బాధ, ఆగ్రహానికి గురవుతున్నట్లు తేలింది. 

అత్యంత ప్రతికూల మానసిక పరిస్థితులను ఎదుర్కొంటున్న దేశాల్లో నాయిజర్‌, చాద్‌ దేశాలు ముందున్నాయి. అత్యంత సానుకూల మానసిక పరిస్థితులను ఎదుర్కొంటున్న దేశాల్లో పరాగ్వే మొదటి స్థానంలో ఉంది. సర్వేలో పాల్గొంటున్న ప్రజలు అంతకు ముందు రోజు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారన్న అంశం ఆధారంగా ఈ ఫలితాలను వెల్లడించారు. మీరు నిన్న చిరునవ్వులు చిందించారా? లేదా గట్టిగా నవ్వారా? సమాజం మిమ్మల్ని గౌరవిస్తోందా? వంటి ప్రశ్నలు అడిగి ఈ ఫలితాలు తెలిపారు.

* సర్వేలో పాల్గొన్న వారిలో 71 శాతం మంది అంతకు ముందురోజు సంతోషంగా ఉన్నామని తెలిపారు. 

* ప్రజల్లో ఒత్తిడి స్థాయి అధికంగా ఉందని పరిశోధకులు వెల్లడించారు. తాము మానసిక బాధను అనుభవించామని 39 శాతం మంది చెప్పారు. తాము ఒత్తిడికి గురయ్యామని 35 శాతం మంది పేర్కొన్నారు. ప్రతిరోజు ఈ దేశాల్లోని ప్రజలు సానుకూల భావోద్వేగాలను అనుభవిస్తున్నారు.

* సానుకూల మానసిక పరిస్థితితో ప్రజలు ఉన్న దేశాల్లో మొదటి వరసలో పరాగ్వే, పనామా, స్వాటెమాలా, మెక్సికో, అల్‌ సాల్వాడోర్ ఉన్నాయి.
* ప్రతికూల మానసిక పరిస్థితులు ఉన్న ప్రజలు అత్యధికంగా ఉన్న దేశాల్లో టాప్‌ 5లో చాద్‌, నాయిజెర్‌, సియేరా లియోన్‌, ఇరాక్‌, ఇరాన్‌ ఉన్నాయి. చాద్‌లో 10 మంది ఏడుగురు తాము చాలా బాధలను అనుభవిస్తున్నామని చెప్పారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న