close

వార్తలు / కథనాలు

29 సెకన్లలో 29రాష్ట్రాల పేర్లు నేర్చుకుంటారా

29 సెకన్లలో 29రాష్ట్రాల పేర్లు నేర్చుకుంటారా

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలోని రాష్ట్రాల పేర్లు టకాటకా చెప్పమంటే సాధారణంగా ఎవరైనా ఎంత సమయం తీసుకుంటారు? ఓ ఐదు నిమిషాలు పడుతుంది కదా! అనుభవజ్ఞులైతే ఓ రెండు, మూడు నిమిషాల్లో చెప్పగలరు. మరి కేవలం 29సెకన్లలో దేశంలోని 29రాష్ట్రాల పేర్లు చెప్పేయగలరా? అవన్నీ గుర్తు చేసుకోవడానికే నిమిషం కంటే ఎక్కువ సమయం పడుతుంది కదా! మరి ఆ టీచర్‌కి అది సాధ్యపడుతుంది. కేవలం చెప్పడానికే కాదండోయ్‌.. పిల్లలకు నేర్పడానికి కూడా కేవలం 29సెక్లను మాత్రమే పడుతుంది. అంతకంటే ఒక్క సెకను కూడా ఎక్కువ టైం తీసుకోడట.

దిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలకు ఈ టీచర్‌ నేర్పిస్తున్న తీరు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దేశ రాజధానిలోని పేదపిల్లలకు కార్పొరేట్‌ బడుల్లో కూడా చెప్పని విధంగా సులభంగా 29 సెకన్లలో 29రాష్ట్రాలు నేర్పించిన తీరు అటు విద్యార్థులనే కాదు ఇటు నెటిజన్లనూ ఆకట్టుకుంటోంది. ఇలాంటి మాస్టారును మెచ్చుకోకుండా ఎవరైనా ఉంటారా? మరి ఆ పాఠాన్ని ఈ మాస్టారు ఎలా చెప్పారో చూసేయండి!

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు