close

వార్తలు / కథనాలు

‘పానీ’పూరీ ప్రియులూ.. జాగ్రత్త

తయారీదారుల నిర్లక్ష్యం.. వినియోగదారుల ఆరోగ్యం పాలిట శాపం

పానీ పూరీ ఇష్టపడని వారు ఎవరుంటారు? చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ఇష్టంగా తింటారు. రోడ్ల పక్కన, మాల్స్‌ వద్ద ఎక్కడపడితే అక్కడ కనిపించే ఈ పానీ పూరీ స్టాల్స్‌ వద్ద క్యూ కట్టి మరి తినేస్తుంటారు పానీ పూరీ ప్రియులు. అయితే రుచిగా ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు అనుకుంటే చాలా పొరపాటు. ఎందుకంటే పానీ పూరీ తయారుచేసే విధానం ఎంతో ముఖ్యం. పానీపూరీ కోసం వాడే నీటి విషయంలో అమ్మకందార్లు ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పానీపూరీలో మంచినీటిని కాకుండా సాధారణ నీటిని వాడుతూ.. అపరిశుభ్రమైన ప్రాంతాల్లో పదార్థాలను తయారు చేసి వినియోగదారుల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. ఇలా పానీపూరీ మిశ్రమాన్ని తయారు చేసే ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే వీడియోలో జరిగిన సంఘటన ఎక్కడో మాత్రం తెలియరాలేదు. అన్ని చోట్లా ఇలానే ఉంటుందని మాత్రం కాదు.. పానీ పూరీ కోసం వాడే పానీని ఎలా తయారు చేస్తున్నారో మీరే చూడండి..

  పానీ పూరీ గురించి గతంలో తెలుగు ప్రవచనాలు చెప్పే ఓ పెద్దాయన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం.. పానీ పూరీ అనేది బ్రహ్మాండమైన పదార్థం.. అందులో పానీ బ్రహ్మాండం.. పూరీ బ్రహ్మాండం.. పరిసరాలు బ్రహ్మాండం.. వడ్డించేవాడి చేయి అత్యంత శుద్ధం.. పాత్ర శుద్ధం.. రుచి అమోఘం.. శుచి మాత్రం ఘోరం అంటూ సాగే ఆయన మాటలు సరదాగా ఉన్నా ఆలోజింపజేస్తాయి. 

ఇంటర్నెట్‌ డెస్క్

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు