close

వార్తలు / కథనాలు

కళ్లుచెదిరే గులాబీ పిరమిడ్‌ను చూస్తారా?

దుబాయ్‌ రికార్డును బద్దలుకొట్టబోతోంది‌

కళ్లుచెదిరే గులాబీ పిరమిడ్‌ను చూస్తారా?

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచంలో ఎన్ని రకాల పువ్వులున్నా గులాబీలది ప్రత్యేక స్థానం. అందమైన గులాబీ పువ్వు కనిపిస్తే దాన్ని జడలో అలంకరించుకోవాలని కోరుకోని అమ్మాయిలు ఉండరు. అలాంటిది రంగురంగుల గులాబీలను ఒక్కచోట చేరిస్తే.. ఈక్వెడార్‌లోని పెడ్రో మోంకాయా నగర వాసులకు ఇదే ఆలోచన వచ్చినట్లుంది. అందుకే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5లక్షల గులాబీ పువ్వులతో 30 టన్నుల భారీ పిరమిడ్‌ను రూపొందించారు.

కళ్లుచెదిరే గులాబీ పిరమిడ్‌ను చూస్తారా?

ఆండెస్‌ పర్వతాలకు సమీపంలోని ప్రాంతాల్లో పూసిన గులాబీలతో ఈ పిరమిడ్‌ను రూపొందించారు. ఈ పిరమిడ్‌ 3,600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఉత్తర ఈక్వెడార్‌లోని కోషాస్క్వి ఆర్కియాలజీ పార్క్‌లో దీనిని రూపొందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రోజ్ పిరమిడ్‌గా ఈ శిల్పం‌ గిన్నీస్‌ రికార్డు సృష్టించబోతోంది. జులై 9న పలువురు వాలంటీర్లు పిరమిడ్‌ను రూపొందించడం ప్రారంభించారు. 24 గంటల పాటు కష్టపడి దీనిని రూపొందించారు. జులై 14 నాటికి దీనిని పూర్తిచేశారు. అదే రోజున గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ అధికారులు ఈ అందమైన పిరమిడ్‌ను పరిశీలించారు. మరో వారం రోజుల్లో దీనిని అతిపెద్ద రోజ్‌ పిరమిడ్‌గా గిన్నీస్‌ రికార్డులో పేర్కొనాలా? వద్దా? అన్నది ప్రకటిస్తారు. పర్యాటకులను ఆకర్షించేందుకు, ఈక్వెడార్‌లో పూసే కట్‌ పువ్వుల(బొకేలు, ఫ్లవర్‌వాజ్‌లకు ఉపయోగించేవి) ఎగుమతులను పెంచేందుకే ఈ రోజ్‌ పిరమిడ్‌ను రూపొందించినట్లు రూపకర్తలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కట్‌ పువ్వుల ఎగుమతుల్లో ఈక్వెడార్‌ మూడో స్థానంలో ఉంది.

కళ్లుచెదిరే గులాబీ పిరమిడ్‌ను చూస్తారా?

దుబాయ్‌లోని మిరాకిల్‌ గార్డెన్‌లో కొన్ని వేల గులాబీ పువ్వులతో అతిపెద్ద A380 విమానాన్ని రూపొందించారు. 2016లో రూపొందించిన ఈ గులాబీ విమానం అతిపెద్ద ఫ్లవర్‌ అరేంజ్‌మెంట్‌గా గిన్నీస్‌ రికార్డు సృష్టించింది. తాజాగా ఈక్వెడార్‌లో రూపొందించిన ఈ రోజ్‌ పిరమిడ్‌ త్వరలో దుబాయ్‌ రికార్డును బద్దలుకొట్టబోతోంది.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు