close

వార్తలు / కథనాలు

పాఠశాల కావాలి.. స్వీయరక్షణ శిక్షణశా

పాఠ్య ప్రణాళికలో ‘సెల్ఫ్‌ డిఫెన్స్’‌ చేర్చాలంటూ మహిళ పోరాటం

పాఠశాల కావాలి.. స్వీయరక్షణ శిక్షణశా

ఇంటర్నెట్‌డెస్క్‌: నలుగురు ఆకతాయిలు కలిసి అల్లరి చేస్తే ఏ మహిళ అయినా, యువతి అయినా భయపడిపోవాల్సిందేనా? కాదు.. కాకూడదు.. అంటోంది ఓ మహిళ. ఎవడైనా తమను ఏడిపిస్తే, మండు వేసంగి వాడి గొంతులో దిగాలి... మచ్చలపులి వాడి ముఖం మీద గాండ్రించినట్లు ఉండాలి.. మట్టి తుపాను వాడి చెవిలో మోగాలి.. ఆడది అంటే అబల కాదు.. ఆకతాయి వీపు విమానం మోత మోగించే సబలగా ముందుకు దూకాలని అంటోంది ఆ మహిళ. అలా మారాలంటే పాఠశాల స్థాయి నుంచే ప్రతి చిన్నారీ స్వీయ రక్షణలో రాటుదేలాలని, అప్పుడు మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్టపడుతుందని అంటోంది. అంతేకాదు, ఆ దిశగా తనవంతు కృషి చేసేందుకు నడుంబిగించింది మహారాష్ట్రకు చెందిన నేహా శ్రీమాల్.

ఆడపిల్లలకు తమను తాము కాపాడుకునే శక్తి ఉంటే ఇటువంటి అకృత్యాలు కొంతమేర అయినా తగ్గుముఖం పడతాయనేది నేహా అభిప్రాయం. అందుకోసం ప్రతి పాఠశాలలో చిన్నారులకు స్వీయ రక్షణ తరగతులు నిర్వహించాలని కోరుతూ ఓ పిటిషన్‌ దాఖలు చేసింది. తైక్వాండోలో బ్లాక్‌బెల్డ్‌ పొందిన నెహా పలువురుకి సెల్ఫ్‌ డిఫెన్స్‌(ఆత్మరక్షణ)లో మెలకువలు నేర్పిస్తోంది. పాఠశాల పాఠ్య ప్రణాళికలో సెల్ఫ్‌ డిఫెన్స్‌ను చేర్పించాల్సిందిగా ఓ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీన్ని తప్పనిసరిగా అమలు చేయాల్సిందిగా కోరుతూ మహారాష్ట్ర విద్య, క్రీడా శాఖకు విన్నవించింది. నేహాకు ఏడేళ్ల పాప కూడా ఉంది.

‘‘జనవరి 2018- హరియాణాలోని జింద్‌ ప్రాంతంలో 15ఏళ్ల బాలికపై దారుణంగా అత్యాచారం చేశారు. మార్చి 2018- పశ్చిమ్‌బంగా‌లోని బిర్‌భూమ్‌లో 18ఏళ్ల యువతిపై ముగ్గురు ఆకతాయిలు వేధింపులకు పాల్పడ్డారు. కానీ, ఆమె మాత్రం వాళ్లను చితక్కొట్టి పోలీసులకు స్వయంగా అప్పగించింది. ఎందుకంటే బిర్‌భూమ్‌లోని ఆకతాయిలతో ఫైట్‌ చేసిన యువతి గత 10 నెలలుగా మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకుంది. ఆ విద్యనే వారి మీద ఉపయోగించి.. వారి ఆటకట్టించింది. ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు యువతులు తమపై తాము నమ్మకంగా ఉండాలి. తమను కాపాడుకోగలిగేంత శక్తి వారికి ఉందనే విషయాన్ని గ్రహించాలి. అందుకోసం వారికి స్వీయ రక్షణ నేర్పించాలి. అప్పుడే ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయగలుగుతాం. లేదంటే భయపడిపోయి.. నిస్సహాయులుగా ఉండిపోయి బాధితులుగా మిగులుతారు’’

‘‘భారతదేశంలో దాదాపు 53శాతం మంది చిన్నారులు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. వేధింపులు ఎదురైనప్పుడు సహాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఆ పరిస్థితుల్ని సమర్థంగా ఎదుర్కోగలమనే నమ్మకం ఆడపిల్లలో ఉంటుందని వాళ్లు గ్రహించలేకపోతున్నారు. అందుకే ప్రతీ ఆడపిల్ల తప్పనిసరిగా సెల్ఫ్‌ డిఫెన్స్‌ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వాళ్లని వాళ్లు కాపాడుకోవడమే కాదు.. చుట్టుపక్కల ఎవరైనా ఆపదలో ఉన్నా కాపాడగలుగుతారు. అందుకే పాఠ్య ప్రణాళికలో సెల్ఫ్‌ డిఫెన్స్‌ను తప్పనిసరి చేయాలి’’

‘‘బెంగాల్‌ ప్రభుత్వం ఇప్పటికే ఏడాదిలో మూడు వారాల పాటు అండర్ ‌గ్రాడ్యుయేట్‌ కళాశాలల్లో విద్యార్థులకు సెల్ఫ్‌ డిఫెన్స్‌ శిక్షణ ఇస్తోంది. పుణెలోని ఓ కళాశాల తమ పాఠ్య ప్రణాళికలో సెల్ఫ్‌ డిఫెన్స్‌ను చేర్చింది. ఇప్పుడు మన వంతు. ప్రతీ ఆడపిల్లా తనను తాను కాపాడుకోగలుతుందనే ఓ నమ్మకాన్ని మనం వారిలో కల్పించాలి. మన చిన్నారులకు వాళ్లను వాళ్లే బాడీగార్డులుగా మార్చుకునేలా చేయాలి’ అంటూ నేహ తన పిటిషన్‌లో పేర్కొంది. change.org ద్వారా తన పిటిషన్‌కు మద్దతు కోరింది. ఇప్పటి వరకు ఆమె పిటిషన్‌కు 1,09,803 మంది మద్దతు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు