close

వార్తలు / కథనాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వామ్మో... మేకప్‌ వేస్తే మనిషే మారిపోతున్నాడు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మేకప్‌.. ముఖానికి మరింత అందం తెస్తుంది. కానీ యూకేలోని మాంచెస్టర్‌కు చెందిన అలెక్సిస్‌ స్టోన్‌ అనే యువకుడు మేకప్‌ వేసుకుంటే మాత్రం ఉన్న ముఖం మాయమై మరొకరి ముఖం ప్రత్యక్షమవుతోంది. ఆశ్చర్యంగా ఉందా..! అందులో మాయ లేదు.. మంత్రం లేదు. అంతా అలెక్సిస్‌ మేకప్‌ నైపుణ్యం. చాలాకాలంగా మేకప్‌ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న అలెక్సిస్‌.. మేకప్‌తో తన ముఖాన్ని హాలీవుడ్‌ సెలబ్రిటీలు, ప్రముఖులు, సినిమా పాత్రల ముఖంగా మార్చేసి సోషల్ ‌మీడియాలో పోస్టు చేస్తున్నాడు. దీంతో అతడు సోషల్‌ మీడియాలో బాగా పాపులర్‌ అయ్యాడు.

ఇప్పటివరకు అలెక్సిస్‌ తన ముఖాన్ని మేకప్‌ సాయంతో హాలీవుడ్‌ నటులు లియానార్డో డికాప్రియో, జానీ డెప్‌, పాప్‌ సింగర్‌ టేలర్‌ స్విఫ్ట్‌ కిమ్‌ కర్దాషియన్‌, హోం ఎలోన్‌ చిత్రంలోని నటుడు కెవిన్‌, హ్యారీ పోటర్‌ చిత్రంలోని డంబుల్‌డోర్‌, పోప్‌ ఫ్రాన్సిస్‌, జుకర్‌బర్గ్‌ ఇలా అనేక రూపాలుగా మార్చేశాడు. ప్రస్తుతం అలెక్సిస్‌కి ఇన్‌స్టాలో 8 లక్షలకుపైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. మొదట్లో అతడి ఫొటోలు చూసి నెటిజన్లు కంప్యూటర్‌లో మార్ఫింగ్‌ చేస్తున్నాడని భావించారట. ఆ తర్వాత తను మేకప్‌ వేసుకుంటున్న వీడియోలనూ సోషల్‌ మీడియాలో పెడుతుండటంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మీరూ అతడి నైపుణ్యాన్ని ఓ సారి చూడండి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు