
వార్తలు / కథనాలు
ఎందరో వీరులు.. ఎన్నెన్నో సిద్ధాంతాలు.. అన్నీ స్వేచ్ఛ కోసమే
ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజు మనం పీల్చుకుంటున్న స్వేచ్ఛా వాయువులు వారి పోరాట భిక్ష! ఈ రోజు మనం అనుభవిస్తున్న సుఖ సంతోషాలు వారి త్యాగ ఫలం! ఒకనాడు విశ్వగురువుగా విలసిల్లిన భారతావని బానిస రాజ్యంగా మారిపోతే భరతమాత దాస్య శృంఖలాలను బద్దలు కొట్టేందుకు ప్రాణాలు అర్పించిన అమరులు ఎందరో.
కొందరివి గెరిల్లా పోరాటాలు. మరికొందరివి సమరసతా సిద్ధాంతాలు. బాల గంగాధర్ తిలక్, భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి వీరులు ప్రాణత్యాగాలకైనా సిద్ధమన్నారు. విజయమో వీరస్వర్గమో అని ప్రవచించారు. ‘నాకు మీ రక్తాన్నివ్వండి. నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను’ అని నేతాజీ పిలుపునిచ్చారు. చివరికి ‘అహింసా పరమో ధర్మః’ అని గాంధీ మహాత్ముడు బానిస బతుకులకు విముక్తి ప్రసాదించారు.
ఎందరో వీరులు.. ఎన్నెన్నో సిద్ధాంతాలు. అన్నీ స్వేచ్ఛ కోసమే. 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వారిని తలుచుకొని, స్మరించుకోవడం కనీస ధర్మం. అందుకోసమే అందిస్తున్నాం ఈ చిత్ర నీరాజనం.