
వార్తలు / కథనాలు
తక్కువ ఛార్జీతో సౌకర్యవంతంగా సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే ప్రయాణ సాధనం రైలు. దేశంలోనే అతి పెద్ద ప్రజా రవాణా వ్యవస్థగా భారతీయ రైల్వేస్‌కు పేరుంది. కొంతకాలం కిందట ‘వందే భారత్’ పేరుతో అత్యంత వేగవంతమైన రైలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ రైలు గంటకు 180కి.మీ(సర్వీసులో మాత్రం గంటకు 130కి.మీ)వేగంతో ప్రయాణిస్తోంది. రాబోయే రోజుల్లో దేశంలోని ప్రధాన నగరాల్లో బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టాలని కేంద్ర భావిస్తోంది. గంటకు వందల కి.మీ వేగంతో దూసుకెళ్లే ఈ రైళ్లు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం మరింత తగ్గిపోనుంది. ఇప్పటికే ఇలాంటి అత్యంత వేగంతో వెళ్లే బుల్లెట్ రైళ్లు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఆసియా, యూరప్ ఖండాల్లోనే ఇవి ఎక్కువగా పరుగులు పెడుతున్నాయి. మరి ఆ టాప్ రైళ్లు ఏవో చూద్దామా..!
షాంఘై మగ్లెవ్(431kmph)
దేశం: చైనా
రైలు పేరు: షాంఘై మగ్లెవ్
వేగం: గంటకు 431కి.మీ
సర్వీస్: లాంగ్యాంగ్ రోడ్-షాంఘై పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం
హార్మొని సీఆర్‌హెచ్(380kmph)
దేశం: చైనా
రైలు పేరు: హార్మొని సీఆర్‌హెచ్ 380ఏ
వేగం: గంటకు 380 కి.మీ
సర్వీస్: బీజింగ్-షాంఘై
ఏజీవీ ఇటలో(360kmph)
దేశం: ఇటలీ
రైలు పేరు: ఏజీవీ ఇటలో
వేగం: గంటకు 360కి.మీ
సర్వీస్: నాపొలి-మిలానో కారిడార్
సీమెన్స్ వెలరో(350kmph)
దేశం: స్పెయిన్
రైలు పేరు: సీమెన్స్ వెలరో
వేగం: గంటకు 350కి.మీ
సర్వీస్: బార్సిలోనా-మాడ్రిడ్
టాల్గో 350(350kmph)
దేశం: స్పెయిన్
రైలు పేరు: టాల్గో 350
వేగం: గంటకు 350కి.మీ
సర్వీస్: మాడ్రిడ్-బార్సిలోనా
షింకాన్సెన్ హయాబుసా(320kmph)
దేశం: జపాన్
రైలు పేరు: ఈ 5 సిరీస్ షింకాన్సెన్ హయాబుసా
వేగం: గంటకు 320 కి.మీ
సర్వీస్: టోక్యో-ఆమోరి
ఆల్స్టొమ్ యూరో డూప్లెక్స్(320kmph)
దేశం: యూకే
రైలు పేరు: ఆల్స్టొమ్ యూరోడూప్లెక్స్
వేగం: గంటకు 320 కి.మీ
సర్వీస్: ఫ్రాన్స్, జర్మన్, స్విట్జర్లాండ్, సహా.. యూరప్ దేశాల్లో..
కేటీఎక్స్-శాంచియన్(305kmph)
దేశం: దక్షిణ కొరియా
రైలు పేరు: కేటీఎక్స్-శాంచియన్
వేగం: గంటకు 305 కి.మీ
సర్వీస్: సియోల్-బుసన్
ఈటీఆర్-500(300kmph)
దేశం: ఇటలీ
రైలు పేరు: ఈటీఆర్-500
వేగం: గంటకు 300 కి.మీ
సర్వీస్: మిలాన్-రోమ్-నాపిల్స్
టీహెచ్ఎస్ఆర్ 700టీ(300kmph)
దేశం: తైవాన్
రైలు పేరు: టీహెచ్ఎస్ఆర్ 700టీ
వేగం: గంటకు 300కి.మీ
సర్వీస్: తైపీ-కావోషింగ్
తాలీస్ టీజీవీ(300kmph)
దేశం: బెల్జియం
పేరు: తాలీస్ టీజీవీ
వేగం: గంటకు 300కి.మీ
సర్వీస్: ప్రధాన నగరాల్లో..
ఐసీఈ-3(300kmph)
దేశం: జర్మనీ
రైలు పేరు: ఐసీఈ-3
వేగం: గంటకు 300కి.మీ
సర్వీస్: మున్షెన్-లైప్జింగ్, ఫ్రాంక్ఫుర్ట్-కొలిన్
వీటితోపాటు సౌదీ అరేబియాకు చెందిన టాల్గో-350.. నెదర్లాండ్స్‌కు చెందిన తాలీస్, ఐసీఈ, యూరోస్టార్ గంటకు 300కి.మీ వేగంతో పరుగులు తీస్తున్నాయి. అలాగే టర్కీలో టీసీడీడీ హెచ్‌టీ80000, రష్యాకు చెందిన పెరెగ్రిన్ ఫాల్కన్, స్విట్జర్లాండ్‌కు చెందిన పెండోలినొ ఆస్టోరో, హాంకాంగ్‌కు చెందిన విబ్రాంట్ ఎక్స్‌ప్రెస్ గంటకు 250కి.మీ వేగంతో వెళ్తున్నాయి. ఇక అమెరికాలో ఆమ్ట్రిక్ ఎసెలా ఎక్స్‌ప్రెస్(241kmph), ఉజ్బెకిస్థాన్‌లో టాల్గో -250(230kmph), ఆస్ట్రియాలో వియాగ్గియో కంఫర్ట్(230kmph), పోర్చుగల్‌లో ఆల్ఫా పెండ్యులర్(220kmph), ఫిన్లాండ్లో ఆల్స్టోమ్ ఎస్ఎమ్3 అండ్ 6(220kmph), నార్వేలో బీఎం71 ఫ్లైటోగెట్, ఎన్సీబీ క్లాస్ 73(210kmph), స్వీడెన్‌లో ఎక్స్ సిరీస్ రైళ్లు(205kmph),పోలాండ్‌లో పెండిలినో ఈడీ250(200kmph)రైళ్లు అత్యంత వేగంగా దూసుకెళ్తున్నాయి. మన దేశంలో వందేభారత్ రైలు గంటకు 180 కి.మీ వెళ్లేలా తయారు చేసినా ప్రస్తుతం గంటకు 130 కి.మీ వేగంతోనే ప్రయాణిస్తోంది.
- ఇంటర్నెట్ డెస్క్