close

వార్తలు / కథనాలు

రెడ్‌ కార్పెట్‌ ముచ్చట్లివి!

దీనికీ ఓ కథ ఉంది

రెడ్‌ కార్పెట్‌ ముచ్చట్లివి!

ఇంటర్నెట్ డెస్క్‌: రెడ్‌ కార్పెట్‌.. ఈ మధ్య దీని గురించి కూడా భారీ చర్చలే జరుగుతున్నాయి. అతిథులకు, ఉన్నతాధికారులకు, ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులను ఎర్ర తివాచీ పరిచి మరీ ఆహ్వానిస్తారు కదా! మరి పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ విషయంలో ఇదెందుకు వివాదాస్పమైంది అనే సందేహం చాలా మందికే వచ్చింది. వారికొచ్చిన సందేహం నిజమే కానీ చిన్న మార్పు. ఏవైనా సమావేశాలు, ప్రారంభోత్సవాలు, వివాహాలు వంటి శుభకార్యాలకు వచ్చిన విశిష్ట అతిథులను ఆహ్వానించడానికి ఎర్ర తివాచీ పరుస్తారు. అమృత్‌సర్‌లో పేలుడు ఘటన తర్వాత గ్రనేడ్‌ దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు అక్కడకు చేరుకున్నఅమరీందర్‌‌ కోసం అధికారులు ఎర్ర తివాచీ పరచడంతో ఈ వివాదం చెలరేగింది. అయితే ఎర్ర తివాచీనే కదా తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. ఎర్ర తివాచీ చాలా సీనుంది.మరదేంటో చూసేద్దాం.

రెడ్‌ కార్పెట్‌ ముచ్చట్లివి!

కార్పెట్‌కు పుట్టినిల్లు మనదేశమే?: ఎర్ర తివాచీకి సంబంధించి ఎన్న కథలు ప్రచారంలో ఉన్నాయి. దీన్ని మనదేశస్థులే తయారు చేశారనే వార్తలూ వినిపిస్తున్నాయి. చాలా ఏళ్ల క్రితం రాజుల కాలంలో చేతితో తయారు చేసిన కార్పెట్లు ఉండేవట. అంతేకాదు వీటిని కానుకలుగా కూడా పంపేవారట. ఎవరు ఎంతపొడవు కార్పెట్‌ తయారు చేసి పంపితే అంత గౌరవంగా భావించే వారట. రాజుల దర్పం చూపించుకోవడానికి ఇదో సాధనంగా ఉపయోగించేవారట. జంతువుల చర్మాలతో తయారు చేసిన కార్పెట్లు, పూసలు, కుందన్లు, జరీ, కలంకారీ కార్పెట్లు ఇలా ఎన్నో రకాల తివాచీలను రాజుల అభిరుచి మేరకు తయారు చేసేవారు. ఇప్పుడు కూడా భారత్‌లో చేతితో తయారు చేసిన కార్పెట్లకు ఎంతో డిమాండ్‌ ఉంది. ఇప్పుడు యంత్రాలు వచ్చినప్పటికీ చేతితో తయారు చేసిన మన తివాచీలకు విదేశాల్లో ఎంతో గిరాకీ ఉంది. ఇక్కడ ఉత్పత్తయ్యే మొత్తం తివాచీలలో 75-80శాతం వరకు భారత్‌ విదేశాలకు ఎగుమతి చేస్తోంది.

రెడ్‌ కార్పెట్‌ ముచ్చట్లివి!

ఎర్ర తివాచీ కథ: కొందరు శాస్త్రవేత్తల సమాచారం ప్రకారం ఎర్ర తివాచీ గ్రీసు దేశంలో పుట్టింది. క్రీ.పూ 458లో ఆగ్మామ్నోన్‌ అనే గ్రీకు రాజు భార్య దీన్ని మొదటి సారి వినియోగించారు. అయితే దీని వెనకోకథ ఉంది. ఆగ్మామ్నోన్‌ ఓ సారి యుద్ధానికి వెళ్లారు.రాజు ఆ యుద్ధంలో గెలిచారు. పరాజయం పాలైన ఆ రాజ్యపు రాణి కసాండ్రాను బదులుగా తీసుకుని స్వరాజ్యం చేరుకున్నాడు. ఈలోగా రాజు భార్య క్లైట్‌మెనెస్ట్రా ఆయన విజయానికి గుర్తుగా వేడుకలను ఏర్పాట్లు చేసింది. ఆయన్ని కాలు కింద పెట్టనివ్వకుండా లోపలికి తీసుకురావాలని ఆలోచనతో ఎర్రటి వస్త్రం కింద పరిచింది. ఎర్రటి వస్త్రం మీద దేవతలు మాత్రమే నడుస్తారనేది గ్రీకు ప్రజల నమ్మకం. అప్పటి నుంచి వారు అత్యున్నత గౌరవం ఇచ్చే వ్యక్తులను ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానించడం పరిపాటి అయింది. ఆ ఎర్రటి వస్త్రం కాస్తా ఇప్పుడు ఎర్ర తివాచీ అయింది. దీంతో ఎర్ర తివాచీ సంప్రదాయం గ్రీసు నుంచి ప్రపంచ దేశాలకు వ్యాపించిందని ప్రతీతి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు