close

వార్తలు / కథనాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
టర్కీలో గతంలో Q,W,X లను నిషేధించారు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా అత్యధికమంది మాట్లాడే భాషల్లో ఇంగ్లీష్ ఒకటి. కొన్ని దేశాల్లో భాష వేరైనా లిపిని దాదాపుగా లాటిన్‌ ఇంగ్లీష్‌లోనే రాస్తుంటారు. టర్కీలో కూడా లాటిన్‌ ఇంగ్లీష్‌ అక్షరాలు రాసినా, వాటికి అదనంగా మరికొన్ని అక్షరాలూ ఉంటాయి. గతంలో ఈ భాషలోని Q, W, X అక్షరాలను టర్కీ ప్రభుత్వం నిషేధించింది. అక్కడి ప్రజల పేర్లలో ఈ అక్షరాలు ఉన్నా.. పలికినా జరిమానా, శిక్షలు విధించేవారట. కొన్నేళ్ల పాటు కొనసాగిన ఈ నిషేధం 2013లో ఎత్తివేశారు. అసలు ఎందుకు ఈ నిషేధం విధించారు? ఎందుకు ఎత్తివేశారో తెలుసుకుందాం పదండి..

టర్కీలో 75 శాతానికిపైగా టర్కీవాసులు, 20శాతం మంది కుర్దులు ఉన్నారు. దీంతో టర్కీ అధికారిక భాష టర్కీష్‌తోపాటు కుర్దిష్‌ భాష వాడుకలో ఉంది. రెండు భాషల లిపి ఇంగ్లిష్‌లో రాస్తే దాదాపు ఒకేలా ఉంటాయి. అయితే, ఈ కుర్దులపై ఒకప్పుడు టర్కీ ప్రభుత్వం బాగా వివక్ష చూపించేదట. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు కుర్దిష్‌ భాషను దెబ్బతీయాలని టర్కీ ప్రభుత్వం ప్రయ్నతించేది. టర్కీలో కుర్దిష్‌ మాట్లాడటం నేరంగా ప్రకటించింది. దీంతో కుర్దులు కూడా అధికారిక భాష టర్కీష్‌లోనే మాట్లాడాల్సి వచ్చేది. అంతేకాదు, కుర్దిష్‌ను అణచివేయాలని టర్కీ సర్కార్‌ అధికారిక భాష టర్కీష్‌ లిపిని మార్చింది. కుర్దిష్‌లో ఎక్కువగా కనిపించే Q, W, X అక్షరాలను టర్కీష్‌ నుంచి తొలగించింది. ఎవరైనా సరే తమ పేర్లలో, లేఖల్లో, ప్రచారంలో ఈ మూడు అక్షరాలను ఉపయోగిస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేసింది. దీంతో అక్కడి ప్రజల గుర్తింపు కార్డుల్లో, ఇతర పత్రాల్లో పేర్లలోని ఆ మూడు అక్షరాలను తొలగించుకున్నారు. టీవీల్లో, ప్రచార చిత్రాల్లో, నేమ్‌ బోర్డుల్లో ఎక్కడా ఆ అక్షరాలు లేకుండా చేశారు. అందుకే టర్కీలో టాక్సీలకు taxi అని కాకుండా taksi అని రాసి ఉంటుంది. ఈ నిర్ణయంతో కుర్దులు కాస్త ఇబ్బంది పడ్డా అలవాటు చేసుకోవాల్సి వచ్చింది. 

2007లో ఒక మేయర్‌ ప్రజలకు నూతన సంవత్సరం(నవ్రుజ్‌) శుభాకాంక్షలు చెప్పడం కోసం ప్రజలకు పంపిన గ్రీటింగ్‌ కార్డుల్లో nowruz అని రాశారు. నిజానికి Q, W, X నిషేధం కారణంగా nevruz అని రాయాలి. నిషేధించిన అక్షరం ఉపయోగించడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. అధికారంలో ఉన్నారు కాబట్టి శిక్ష నుంచి తప్పించుకున్నారు. ఇలాంటి ఘటనలో అనేకం చోటుచేసుకొని చాలా మంది ప్రజలు శిక్షలు అనుభవించారు. అయితే, కాలంతోపాటు టర్కీ ప్రభుత్వంలోనూ మార్పులు వచ్చాయి. ఫలితంగా 2009లో కుర్దిష్‌ భాషలో టీవీ, రేడియో నెట్‌వర్క్‌లు వచ్చాయి. 2013లో Q, W, X అక్షరాలపై నిషేధాన్ని ఎత్తివేశారు. అయినా దేశవ్యాప్తంగా కుర్దులపై వివక్ష.. అక్షరాల నిషేధం కొనసాగుతూనే ఉండటం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు