నేను పెళ్లి చేసుకుంటే... నా చిట్టితల్లి ఏమవుతుందో!
పెళ్లైన ఏడాదికే నా భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అప్పటికి గర్భవతిని. ఇప్పుడు పాపకు మూడేళ్లు. ఈ దిగులుతో అమ్మా చనిపోయింది. ఈమధ్యే నాన్న ఓ సంబంధం చూశారు. అతనికో బాబు. ఆ బాబుకి తల్లిని కాగలను. కానీ నా కూతురికి అతను తండ్రి కాగలడా? లేదంటే నా చిట్టితల్లి భవిష్యత్తు ఏమవుతుంది? తేల్చుకోలేక పోతున్నాను....
పెళ్లైన ఏడాదికే నా భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అప్పటికి గర్భవతిని. ఇప్పుడు పాపకు మూడేళ్లు. ఈ దిగులుతో అమ్మా చనిపోయింది. ఈమధ్యే నాన్న ఓ సంబంధం చూశారు. అతనికో బాబు. ఆ బాబుకి తల్లిని కాగలను. కానీ నా కూతురికి అతను తండ్రి కాగలడా? లేదంటే నా చిట్టితల్లి భవిష్యత్తు ఏమవుతుంది? తేల్చుకోలేక పోతున్నాను.
- ఓ సోదరి, కాకినాడ
ఈ పెళ్ల్లి మీకు ఇష్టం లేకుండా మీ నాన్నగారు బలవంతంగా కుదిరిస్తే మాత్రం మరోసారి ఆలోచించండి. మీరు అతని బాబుని మీ బాబుగా అనుకుంటున్నప్పుడు అతనూ మీ పాపను తన పాపలా అంగీకరించాలని ముందే మాట్లాడండి. తారతమ్యం చూపకూడదు. తోబుట్టువుల్లా ఉండేలా పిల్లలిద్దర్నీ ముందుగానే సిద్ధం చేయాలి. ఇద్దరూ ఇద్దరికీ తల్లిదండ్రుల్లా వ్యవహరించాలనే నియమం ఉంటేనే పెళ్లి చేసుకోండి. పిల్లలకి స్నేహభావం కలిగేలా మీ నలుగురూ అప్పుడప్పుడూ కలుస్తూ ఉండండి. అనుబంధం తృప్తిగా ఉంది అనిపిస్తేనే పెళ్లి చేసుకోండి. చేసుకున్నాక సరి పడకపోవడం, విడిపోవడం లాంటివి జరక్కూడదు. నలుగురూ మానసికంగా సిద్ధం అవ్వడం చాలా ముఖ్యం. ఒకరితో ఒకరు స్నేహంగా, సంతృప్తిగా ఉండగలరు అనిపించాలి. రెండువైపులా సర్దుబాటు అవుతుంది అని నమ్మకం కలగాలి. మీ ఇద్దరూ విశాల దృక్పథంతో పిల్లల్ని సమానంగా చూడగలమనుకుంటే సంసారం సజావుగా సాగిపోతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- పొడవైన శిరోజాలతో... గిన్నిస్‌బుక్‌లో..!
- తారలు మెచ్చిన ‘ఫుల్కారీ’ ఫ్యాషన్.. ఈ స్టైలిష్ ట్రెండ్ గురించి తెలుసా?
- ఈ ఆహారంతో జుట్టు ఆరోగ్యంగా..!
- మెడ చుట్టూ నల్లగా అవుతోందా?
- గోళ్లు విరుగుతున్నాయా?
ఆరోగ్యమస్తు
- మెనోపాజా... వ్యాయామం చేయండి!
- ఎండకో గొడుగు..!
- చనుబాలు ఎక్కువగా వస్తున్నాయి.. తగ్గేదెలా?
- హార్మోన్లు సమతులంగా ఉండాలంటే..!
- ఎలక్ట్రోలైట్స్... తాగుతున్నారా?
అనుబంధం
- బద్ధకపు భర్తతో వేగలేకపోతున్నారా?
- లవ్ మ్యారేజ్.. అయినా సంప్రదాయాల పేరిట టార్చర్ చేస్తున్నాడు..!
- దాంపత్య బంధానికీ.. ఇవ్వాలి కాస్త విశ్రాంతి!
- బాస్ వివాహేతర సంబంధం.. అతడితో చెప్పాలా? వద్దా?
- నైపుణ్యాలకు సానపెట్టండిలా..
యూత్ కార్నర్
- వేసవి కథ!
- 29 బాటిళ్లతో ఒక స్విమ్‌సూట్.. విదేశాల్లోనూ పాపులర్!
- Prachi Nigam: స్టేట్ ఫస్ట్.. అయినా బాడీ షేమింగ్ తప్పలేదు!
- ప్రాణం కోసం... ‘సూర్య నాయక్’
- Janhvi Kapoor : నచ్చిందే పదే పదే తింటుంటా!
'స్వీట్' హోం
- రాత్రివేళకి... సుగంధాల రాణి!
- ఈ డ్రింక్‌తో వేసవి వేడిని తరిమేయండి!
- చెత్తబుట్ట నుంచి దుర్వాసన రాకుండా..!
- తేలిగ్గా వండేద్దాం..!
- ప్రకృతికి కోపం తెప్పిస్తున్నారా?
వర్క్ & లైఫ్
- గర్ల్ గ్యాంగ్‌తో వెకేషనా? అందాల ‘బాలి’ వెళ్లాల్సిందే!
- రంగులు తెలిసేలా!
- విజయానికి అందం అడ్డయ్యింది!
- భరణం ఇవ్వాల్సొస్తుందని ఉద్యోగం మానేశాడు!
- నేను బాగా పనిచేయడం లేదు!