ఒంటరి ప్రయాణం.. జాగ్రత్త ఎలా?
ఈ మధ్య ప్రమోషన్ వచ్చింది. దీని కోసం చాలా కష్టపడ్డా. సంస్థ నా పనిని గుర్తించినందుకు చాలా ఆనందించా. కొత్త బాధ్యతల్లో దేశంలోని బ్రాంచీలన్నింటికీ వెళ్లాల్సి ఉంటుంది. విమాన టికెట్లు, వసతి అన్నీ సంస్థే చూసుకుంటుంది. కానీ ఒంటరిగా పెద్దగా ప్రయాణించ లేదు. కాస్త భయంగా ఉంది. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
- రాజీ, బెంగళూరు
లగేజీ, హ్యాండ్ బ్యాగు తేలిగ్గా ఉండాలి. తప్పనిసరి డెబిట్, క్రెడిట్ కార్డు మాత్రమే దగ్గరుంచుకోండి. డబ్బులు, కార్డులను రహస్య ప్రదేశాల్లో, చేతి ఖర్చులకు అవసరమైనవి తేలిగ్గా తీసుకునేలా పెట్టుకోవాలి. ఎక్కువ నగదునూ తీసుకెళ్లొద్దు. అపరిచితులతో ఒంటరిగా ప్రయాణిస్తున్నట్లు చెప్పొద్దు. వాళ్లు నిజాయతీగానే అడిగినా మొదటి సారి కాదని అబద్ధమాడండి. ప్రయాణాన్ని, వెళ్లే మార్గాలు సహా ప్లాన్ చేసుకోవాలి. క్యాబ్‌లు, బహిరంగ ప్రదేశాల్లో మాటిమాటికీ గూగుల్ మ్యాప్ తీయొద్దు. కానీ రూట్ మ్యాప్‌ను మాత్రం ట్రాక్ చేసుకోవాలి. విమానం దిగాక తచ్చాడటం, ఏదైనా తినడం, ఫోన్ కాల్, మెసేజ్‌లు చూడ్డంకోసం ఆగడం లాంటివి వద్దు. ఇవన్నీ మోసం చేయాలనుకునే వారి అవకాశాల్లాంటివి. ఖరీదైన, పర్యాటకురాలిగా కనిపించే దుస్తులు వేసుకోవద్దు. ఆభరణాలూ వద్దు. స్థానిక సంప్రదాయాలు, వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని కలిసే ప్రయత్నం చేయండి. భద్రతాపరంగా పేరున్న హోటల్‌నే ఎంచుకోండి. కొన్ని ఒక అంతస్తంతా స్త్రీలకు కేటాయిస్తున్నాయి, పరిశీలించుకోండి. గ్రౌండ్ ఫ్లోర్‌కు పైన, లిఫ్ట్‌కు దగ్గరగా, ఎమర్జెన్సీ మార్గాలు, మెట్లకు దూరంగా ఉండే గదిని ఎంచుకోండి.
హోటల్లోనూ.. సంతకంలో ఇంటిపేరు బదులు మొదటి అక్షరం రాస్తే చాలు. హోటల్ పోస్ట్ కార్డుతోపాటు గది చూపడానికి మహిళా సిబ్బంది సాయం తీసుకోండి. కీ హోల్ ఉన్న దాన్ని ఎంచుకోండి. లోనికి వెళ్లాక మాస్టర్ కీతో తెరవడానికి వీల్లేకుండా డబుల్ లాక్ వేసుకోవాలి. బయట ‘డోంట్ డిస్టర్బ్’ బోర్డుంచాలి. ఇవన్నీ చేసే ముందు గదినోసారి పరిశీలించుకోవాలి. సురక్షితమని నిర్థరించుకున్నాక కిటికీలు సహా అన్నీ మూసేయండి. అనుమానమొస్తే సెక్యూరిటీ సాయం కోరడానికి వెనకాడొద్దు. ఎవరి భద్రత వారి పూర్తి బాధ్యత కదా!
మీ ప్రశ్న అడగండి
మరిన్ని
ఉద్యోగానికి డబ్బులడుగుతోంది!
నాలుగేళ్లకుపైగా ప్రస్తుత హోదాలో పనిచేస్తున్నా. నా సహోద్యోగి మా బ్రాంచి హెచ్ఆర్ విభాగానికి అధిపతి, నాకు మంచి స్నేహితురాలు. కొన్ని ఉద్యోగాలకు ఎంపిక చేసే ముందు డబ్బులు తీసుకుంటుందని కొన్నేళ్లుగా పుకార్లున్నాయి. రుజువులు లేక నేను పట్టించుకోలేదు.తరువాయి
ఆయన్ను మార్చాలంటే..
మావారికి సిగరెట్, మందు లాంటి దురలవాట్లు ఉన్నాయి. రేపు ఆయనకు ఏమైనా జరిగితే.. ఒంటరిదాన్ని అయిపోతానన్న ఊహే నన్ను భయపెడుతోంది. ఎంత చెప్పినా వినట్లేదు. తేలిగ్గా కొట్టిపారేస్తారు. తన మాటే నెగ్గించుకుంటారు. ఆయన్ను మార్చేదెలా?తరువాయి
ఇన్నాళ్లయినా పీరియడ్స్ రావట్లేదు!
నా పెళ్లై నాలుగేళ్లు. ఇద్దరు పాపలు. రెండూ సిజేరియన్ కాన్పులే. మొదటి పాప పుట్టిన ఐదు నెలలకే నాకు పీరియడ్స్ వచ్చేశాయి. మా చిన్న పాపకు ఇప్పుడు పదకొండు నెలలు. ఇప్పటి వరకు నాకు నెలసరి మొదలవలేదు. ఇదేమైనా సమస్యా?తరువాయి
తన భయం..నాకు సమస్య అవుతోంది
నా సహోద్యోగి ఇటీవలే ప్రసూతి సెలవుల నుంచి వచ్చింది. ఆమె తన కొడుకును చూసుకోవడానికి ఓ కేర్‌టేకర్‌ని నియమించుకుంది. మొదటిసారి తల్లి కావడం, పరాయివాళ్ల చేతిలో బిడ్డను ఉంచడంతో చాలా భయపడుతోంది. దీంతో ఆమె తన ఇంట్లోతరువాయి
ఏ సరదాలూ ఉండకూడదంటారు..
మా పెళ్లై రెండేళ్లైంది. మావారు ఎప్పుడూ సీరియస్‌గా, ఏదో కోల్పోయినట్టే ఉంటారు. నాకేమో ఉన్నంతలో సంతోషంగా, సరదాగా ఉండటం ఇష్టం. నేనూ ఉద్యోగం చేస్తున్నాతరువాయి
ఒకటే వాంతులు.. ఏం తినాలి?
నాకిప్పుడు రెండోనెల. అంతా వికారంగా, వాంతి వచ్చినట్లుగా అవుతోంది. ఏమీ తినాలనిపించడం లేదు. చాలా నీరసంగా అనిపిస్తోంది. బిడ్డతోపాటు నేనూ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి? మొదటి మూడు నెలల్లో ఆహార పరిమాణంపై కాకుండా పోషకాలపై దృష్టిపెడితే చాలు. వాంతులవుతున్నాయని తిండి మానేయొద్దు. నిదానంగా జీర్ణమయ్యేవి తీసుకుంటే కడుపు ఉబ్బరంగా ఉండటమో, వాంతులైతరువాయి
పనిలో తేడా లేనప్పుడు జీతంలో ఎందుకు?
పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉండే సేల్స్ టీమ్‌లో పని చేస్తున్నా. మా బృందంలో నేనొక్కదాన్నే అమ్మాయిని. నాలుగేళ్లుగా దీనిలో కొనసాగుతున్నా. పనిలో పోటీ, టార్గెట్లు ఎక్కువ. అయినా ఆస్వాదిస్తూ మగవాళ్లతో సమానంగా పూర్తిచేస్తున్నా. కానీ వాళ్లతో పోలిస్తే నా జీతం తక్కువే. ఇది నన్ను నిరాశపరుస్తోంది. దీన్నెలా ఎదుర్కోవాలి?....తరువాయి
ఏం చేసిన బరువు తగ్గడం లేదు
నాకు 27. సాఫ్ట్వేర్ ఉద్యోగినిని. లావుగా ఉంటాను. రోజూ గంట తప్పనిసరిగా నడుస్తాను. అలాగే డైట్ కూడా పాటిస్తున్నా. అయినప్పటికీ బరువు తగ్గడం లేదు. ఏం చేస్తే బరువు తగ్గుతాను?తరువాయి
నాకు పెళ్లవుతుందా..
పదో తరగతి వరకూ చదివా. సేల్స్‌గర్ల్‌గా చేస్తున్నాను. చెల్లెళ్లిద్దరూ చదుతున్నారు. నాకు 28. నా స్నేహితులందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. నాన్న సంపాదన తాగుడికే సరి. పైగా నా డబ్బులూ దుబారాతరువాయి
ప్రసవం తర్వాత ఇలా...
నా వయసు 28. ప్రసవం తర్వాత జుట్టు బాగా ఊడుతోంది. అంతకుముందు ఈ సమస్య లేదు. ఏం చేయాలి?తరువాయి
అడిగి తప్పు చేశానా?
నిజంగా గమ్మత్తైన పరిస్థితి. సలహా ఇచ్చే ముందు.. ఉద్యోగ మార్పు సమయంలో పాటించాల్సిన సూత్రాల గురించి మాట్లాడు కుందాం. అవసరం తీరాక వంతెనను కాల్చకూడదన్న మాట విన్నారా? అంటే.. వెళ్లే సమయంలో మీ సీనియర్లతో బంధాన్ని చెడ గొట్టుకోవద్దు. ఇది ప్రాథమిక నియమంతరువాయి
నాకిక పిల్లలు పుట్టరేమో...
పెళ్లై ఏడేళ్లయినా పిల్లలు లేరు. డాక్టర్లు ఏ లోపమూ లేదన్నారు. మా మరిదికి పెళ్లైన ఏడాదికే కొడుకు పుట్టాడు. నాకు బాబును ఎత్తుకుని ఆడించాలని ఉంటుంది. కానీ తోడికోడలిని అడగాలంటే ఇబ్బంది.తరువాయి
పెళ్లయిన వాడితో సంబంధం పెట్టుకుంది...
మా అక్క ఐటీ ఉద్యోగి. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ బాధాకరమైన సంగతేమంటే పెళ్లయి, పిల్లలున్న వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడుతున్నారు.తరువాయి
నల్లమచ్చ తగ్గడం లేదు
ముక్కు మీద నల్ల మచ్చలా వచ్చింది. నెమ్మదిగా తగ్గుతుందని చెప్పడంతో చికిత్సేమీ తీసుకోలేదు. ఎన్నాళ్లయినా తగ్గడం లేదు. ఏం చేయాలి?తరువాయి
పేరు మార్చుకోవాలనుకుంటున్నా!
నాకు మా తాతమ్మ పేరే పెట్టారు. అది ఎబ్బెట్టుగా ఉండటంతో...స్కూలు వయసు నుంచీ స్నేహితులు ఆటపట్టిస్తున్నారు. ఇప్పుడు బీటెక్ నాలుగో ఏడాది చదువుతున్నా. భవిష్యత్తులో ఉద్యోగంతరువాయి
ఒంటరి ప్రయాణం..జాగ్రత్త ఎలా?
ఈ మధ్య ప్రమోషన్ వచ్చింది. దీని కోసం చాలా కష్టపడ్డా. సంస్థ నా పనిని గుర్తించినందుకు చాలా ఆనందించా. కొత్త బాధ్యతల్లో దేశంలోని బ్రాంచీలన్నింటికీ వెళ్లాల్సి ఉంటుంది. విమాన టికెట్లు, వసతి అన్నీ సంస్థే చూసుకుంటుంది. కానీ ఒంటరిగా పెద్దగా ప్రయాణించ లేదు. కాస్త భయంగా ఉంది. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?తరువాయి
విటమిన్-డి లోపం తగ్గాలంటే...
నాకు 56 ఏళ్లు. ఈ మధ్య విపరీతంగా నడుము నొప్పి వస్తోంది. కాళ్లూ చేతులు బాగా లాగుతున్నాయి. వైద్యులను సంప్రదిస్తే విటమిన్-డి లోపమన్నారు. సప్లిమెంట్స్ వాడుతున్నా. వీటితోపాటు ఆహారంలో ఎలాంటి మార్పులు...తరువాయి
ఆ ప్రాంతం పొడి బారుతోంది!
ఈ వయసులో అండాశయాల నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు తగ్గుముఖం పడతాయి. ఈ దశను ‘మెనోపాజ్ ట్రాన్సిషన్’ అంటారు. అంటే పునరుత్పత్తి వయసు నుంచి నెలసరి పూర్తిగా ఆగిపోయే వరకు పట్టే సమయం అన్నమాట. అండాశయాల నుంచి వచ్చే హార్మోన్లు తగ్గిపోవడంతో మెదడులోని పిట్యూటరీ గ్రంథి ఫాలికిల్ స్టిమ్యులేటింగ్....తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- పొడారిన అధరాలకు...
- కాలర్ ఎగరేస్తున్న నయా ఫ్యాషన్..
- Kareena Kapoor : అప్పుడు జుట్టు బాగా రాలేది.. ఇలా కంట్రోలైంది!
- మీ కళ్లు చిన్నవా..?
- చర్మ సౌందర్యానికి ‘గుడ్డు’..!
ఆరోగ్యమస్తు
- వ్యాయామం విసుగొస్తోందా?
- ఫిట్స్ ఉన్న వారు గర్భం దాల్చచ్చా?!
- అది ఆకలి కాదేమో!
- సిస్టులుంటే పిల్లలు పుట్టరా?
- ఈ రంగురంగుల టీలతో ఆరోగ్యాన్ని పెంచుకుందాం!
అనుబంధం
- అంతమందిని చూస్తే భయం...
- Parenting Tips : ఫ్యామిలీ టెన్షన్స్ పిల్లల దాకా రాకుండా..!
- ఈ బద్ధకపు భర్తతో వేగేదెలా?!
- సానుకూలం.. సామరస్యం..
- Besties Forever: ఇదే మా గర్ల్ గ్యాంగ్!
యూత్ కార్నర్
- పశువులు మేపి.. సైనికాధికారి అయ్యింది!
- మనమూ కనొచ్చు...కెమెరా కలలు!
- అమ్మకు ఉపాధి.. ఆమె వ్యాపారం!
- మన జీవితాలే... రోజుకొక కథగా!
- వరుస గాయాలు.. ఆమెను ఆపలేకపోయాయి..
'స్వీట్' హోం
- వాళ్లు ఇప్పుడే అర్థమయ్యారు!
- వంటిల్లు సర్దుతున్నారా?
- ఇంట్లోనే డాగ్ వాష్ తయారుచేద్దాం..!
- గాజు... తోటలు!
- వంటింటి వ్యర్థాలు క్షణాల్లో ఎరువుగా..
వర్క్ & లైఫ్
- ఆ ఆలోచనతో శ్రద్ధగా పనిచేయలేకపోతున్నా.. ఏం చేయను?!
- నాయకురాలు అవుతారా?
- కొత్తగా ఉద్యోగంలో చేరాక..!
- మొదటి ప్రశ్నకు సిద్ధమేనా?
- Work Life Balance : మా ఎమోషన్స్ మీరెందుకు అర్థం చేసుకోరు?!
సూపర్ విమెన్
- చందమామ మట్టిలో మొలకెత్తించారు!...
- ఆక్సిజన్ సపోర్ట్ లేకుండానే పర్వతాలు ఎక్కేస్తోంది!
- అత్త మరణం నన్ను మార్చేసింది!
- ఈ లడ్డూ గర్భిణుల ప్రత్యేకం...
- బాల్య వివాహాన్ని తప్పించుకొని.. ‘గ్లోబల్ నర్స్’గా ఎదిగింది..!