తప్పు చేశా... బాధపడుతున్నా...

మా బావ నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటానంటే... తను నాలా చదువుకోలేదన్న కారణంతో కాదన్నాను. తర్వాత నేను బాగా చదువుకున్న వ్యక్తినే చేసుకున్నా. కానీ అతడికి అన్ని రకాల దురలవాట్లూ ఉన్నాయి. బావ లాంటి మంచి మనిషిని బాధ పెట్టినందుకే నాకు ఇలా...

Updated : 29 Feb 2024 18:56 IST

మా బావ నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటానంటే... తను నాలా చదువుకోలేదన్న కారణంతో కాదన్నాను. తర్వాత నేను బాగా చదువుకున్న వ్యక్తినే చేసుకున్నా. కానీ అతడికి అన్ని రకాల దురలవాట్లూ ఉన్నాయి. బావ లాంటి మంచి మనిషిని బాధ పెట్టినందుకే నాకు ఇలా జరిగిందేమో అనిపిస్తోంది. ఈ ఆలోచనలతో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను.

- ఓ సోదరి, హైదరాబాద్‌

కొన్ని సందర్భాల్లో ఆచితూచి, ఆలోచించే నిర్ణయం తీసుకున్నాం అనిపించినా తర్వాత అది సరికాదనిపిస్తుంది. యుక్త వయసులో ఉన్నప్పుడు మీ స్నేహితులు లేదా తెలిసిన వాళ్లందరూ తమకంటే ఎక్కువ చదువుకున్న వాళ్లని చేసుకోవడం చూడటాన సమాజంలో ఇదే సహజం. ఆడపిల్లలు తమ కంటే పెద్ద చదువు, హోదా ఉన్నవాళ్లనే చేసుకుంటారనే ఆలోచన స్థిరపడుతుంది. దాంతో ఇష్టపడిన వ్యక్తిని కాదని ఇతన్ని చేసుకుని ఉంటారు. ఆ వయసులో విలువలు, ప్రేమ, స్నేహం కంటే అందచందాలు, ఆస్తిపాస్తులే ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మీరూ అదే చేశారు. నిజానికి పెళ్లి చేసుకునేటప్పుడు ఎవరికీ తెలీదు తమ సంబంధం ఎలా ఉంటుందనేది. ముఖ్యంగా బయటి సంబంధాలు చేసుకునేటప్పుడు అసలే తెలీదు. సాధారణంగా పెళ్లి అనేసరికి ఆ వ్యక్తిలో మంచి విషయాలే చెబుతారు కానీ చెడు సంగతులను ప్రస్తావించరు. మీరు కూడా అతని గురించి విన్నవి నచ్చి చేసుకున్నారు. అసలు గుణగణాలేంటో తెలీదు. కానీ ఒకసారి నిర్ణయం తీసుకున్నాక దానికి కట్టుబడి ఉండి జీవితాన్ని సాగించాలి. మీరు గుర్తించాల్సింది ఏమంటే ఇతన్ని చేసుకోవడానికీ అతన్ని వద్దనుకోవడానికీ ఎలాంటి సంబంధం లేదు. ఎవర్నో బాధపెట్టడం వల్ల ఇలా అయ్యిందనే ఆలోచన మనసు లోంచి తీసేయండి. ఇప్పుడు భర్తనెలా మార్చుకోవాలి, ఎలా సర్దుకుపోవాలి, సంతోషంగా గడపటమెలా అనే అంశాల గురించి ఆలోచించండి. మంచి పుస్తకాలు చదవండి. జీవితాన్ని సానుకూలంగా చూడండి. తప్పు చేశానేమో అనే భావన ఎంత మాత్రం అవసరం లేదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్