హెయిర్‌ సీరమ్‌ తప్పనిసరా?

నా వయసు 20 ఏళ్లు. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కండిషనర్‌తోపాటు సీరమ్‌నూ తప్పనిసరిగా వాడాలంటున్నారు. నిజమేనా? ఏది ఎంచుకోవాలి? సీరమ్‌ కేశాలకు తేమనందించడం వల్ల మెరుపు కనిపిస్తుంది. కాబట్టి, వాడొచ్చు. అంతేకానీ జుట్టు పెరుగుతుందనో, మందంగా అవుతుందనో మాత్రం అనుకోవద్దు. ఆరోగ్యంగా కనిపించేలా చేయడమే కాకుండా చివర్లు చిక్కులు పడటం, చిట్లిపోవడం వంటి ఇబ్బందులూ రాకుండా చేస్తుంది...

Published : 28 Sep 2021 01:18 IST

నా వయసు 20 ఏళ్లు. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కండిషనర్‌తోపాటు సీరమ్‌నూ తప్పనిసరిగా వాడాలంటున్నారు. నిజమేనా? ఏది ఎంచుకోవాలి?

- రమ్య, గాజువాక


సీరమ్‌ కేశాలకు తేమనందించడం వల్ల మెరుపు కనిపిస్తుంది. కాబట్టి, వాడొచ్చు. అంతేకానీ జుట్టు పెరుగుతుందనో, మందంగా అవుతుందనో మాత్రం అనుకోవద్దు. ఆరోగ్యంగా కనిపించేలా చేయడమే కాకుండా చివర్లు చిక్కులు పడటం, చిట్లిపోవడం వంటి ఇబ్బందులూ రాకుండా చేస్తుంది. కాబట్టి, పరోక్షంగా జుట్టు పెరిగేలా చేస్తుంది. వీటిలో ఎక్కువగా ఆర్గాన్‌, కాస్టర్‌, రోజ్‌మెరీ ఎక్స్‌ట్రాక్ట్‌లు ఉంటాయి. అయితే వీలైనంతవరకూ రసాయనాలు లేని, సిలికాన్‌ రహితమైన వాటిని ఎంచుకోండి. లేదంటే కురులు డ్యామేజ్‌ అవుతాయి. కేవలం కనిపించడమే కాదు.. నిజంగా ఆరోగ్యంగా పెరగాలంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్టయిలింగ్‌, హీట్‌ టూల్స్‌, హెయిర్‌ డైలను వీలైనంత తక్కువగా వాడాలి. తలస్నానం చేశాక దువ్వెనతో కాకుండా వేళ్లతో చిక్కులు తీసుకోవాలి. లేదంటే వెడల్పాటి పళ్లున్న చెక్క దువ్వెననైనా వాడాలి. వెంట్రుకలు తడిగా ఉన్నప్పుడు గట్టిగా జడ వేసుకోవడం, ముడేయడం వంటివి చేయొద్దు. పూర్తిగా ఆరేవరకూ వదిలేయాలి. కెమికల్స్‌ లేని షాంపూ, కండిషనర్‌ను వాడాలి. డ్రై హెయిర్‌ ఉన్నవారు రసాయనాలు లేని గాఢత తక్కువ ఉండే షాంపూను వాడాలి. ఎసెన్షియల్‌ ఫ్యాట్స్‌, విటమిన్లు, మినరల్స్‌ ఉండే చేపలు, గుడ్లు, నట్స్‌ను రోజూ తప్పక తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్