Modified : 19/10/2021 01:57 IST
Facebook Share WhatsApp Share Telegram Share

నాకిక పిల్లలు పుట్టరేమో...

పెళ్లై ఏడేళ్లయినా పిల్లలు లేరు. డాక్టర్లు ఏ లోపమూ లేదన్నారు. మా మరిదికి  పెళ్లైన ఏడాదికే కొడుకు పుట్టాడు. నాకు బాబును ఎత్తుకుని ఆడించాలని ఉంటుంది. కానీ తోడికోడలిని అడగాలంటే ఇబ్బంది. వాళ్లను చూస్తుంటే కాస్త అసూయగానూ ఉంది. ఇలా ఆలోచించడం తప్పేనని తెలుసు. ఈ బాధ నుంచి బయటపడే మార్గం చెప్పండి.

- ఓ సోదరి, మైసూరు

పిల్లలు పుట్టడమన్నది మన బంధువులు, చుట్టు పక్కల వాళ్లలాగే జరగకపోవచ్చు. అది భార్యా భర్తల శరీర తత్త్వం, పరిపక్వత, సెక్సువల్‌ ఆర్గాన్స్‌ డెవలప్‌మెంట్‌, సంతానోత్పత్తి సామర్థ్యం (మెచ్యూరిటీ ఆఫ్‌ రీప్రొడక్టివ్‌ సిస్టమ్‌) మీద ఆధారపడి ఉంటుంది. డాక్టర్లు పరీక్షించి అంతా బాగానే ఉంది అన్నారంటే ఇప్పుడు కాకున్నా కొంతకాలంలో సంతానం కలిగే అవకాశం ఉంది. కొందరికి ముందు, ఇంకొందరికి తర్వాత పుట్టడం సాధారణం.  దాని గురించి మీరు అవమానం చెందాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదు. సంతానోత్పత్తికి ఏ సమయం అనుకూలమో డాక్టర్లు చెప్పేవుంటారు. ఆ సలహా పాటించండి. మానసికంగా ఏ దిగుళ్లూ లేకుండా ఉల్లాసంగా, సంతోషంగా ఉన్నప్పుడు హార్మోన్లు నియంత్రణలో ఉంటాయి. ఆందోళన చెందుతుంటే వాటి గతి తప్పుతుంది. మీరు ఆనందంగా ఉంటే పిల్లలు పుట్టడానికి అనుకూలమైన హార్మోన్లు సవ్యంగా ఉండి సమస్య ఉత్పన్నం కాదు. ఏది ఎలా జరిగినా దాన్ని అంగీకరించే తత్వాన్ని అలవాటు చేసుకోండి. ఆశావహంగా ఆలోచిస్తే నిశ్చింతగా ఉంటుంది. నిరుత్సాహపడకండి... అంతా మంచే జరుగుతుంది.

మీ ప్రశ్న అడగండి

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్