ఈ వయసులో సెక్స్ మంచిదేనా!
మెనోపాజ్ వచ్చాక వేడి ఆవిర్లు, అరికాళ్ల మంటలు లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా. సెక్స్‌లో తరచూ పాల్గొంటే ఇలాంటి అనారోగ్యాలేవీ రావంటున్నారు మా వారు. నాకేమో ఇంకేం ఇబ్బందులు వస్తాయోనని భయం. ఈ సమయంలో సెక్స్‌లో పాల్గొనొచ్చా?
మెనోపాజ్ వచ్చాక వేడి ఆవిర్లు, అరికాళ్ల మంటలు లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా. సెక్స్‌లో తరచూ పాల్గొంటే ఇలాంటి అనారోగ్యాలేవీ రావంటున్నారు మా వారు. నాకేమో ఇంకేం ఇబ్బందులు వస్తాయోనని భయం. ఈ సమయంలో సెక్స్‌లో పాల్గొనొచ్చా?
- ఓ సోదరి, హైదరాబాద్
మెనోపాజ్ దశలో వేడిగా అనిపించడం, చెమటలు లాంటివి తరచుగా కనిపిస్తాయి. ఆరోగ్య సమస్యలు, విటమిన్ లోపాలుంటే ఈ ఇబ్బందులు మరికాస్త ఎక్కువగా అనిపించవచ్చు. కాబట్టి ఈ దశలో తప్పనిసరిగా ఏడాదికొకసారి గైనకాలజిస్ట్‌తో పరీక్షలు చేయించుకోవాలి. వారి సూచనల మేరకు విటమిన్, క్యాల్షియం సప్లిమెంట్లు వేసుకుంటూ, సమతుల ఆహారం, చక్కటి జీవనశైలితో చాలావరకు సమస్యను అధిగమించవచ్చు.
శారీరక, మానసిక ఆరోగ్యం... ఈ వయసు (మెనోపాజ్ దశ)లో తరచూ శృంగారంలో పాల్గొనవచ్చా అని అడిగారు. ఒక జంట ఎంత తరచుగా, ఏ వయసు వరకు కలయికలో పాల్గొంటారు అనేది వారి అలవాట్లు, ఇష్టాయిష్టాలు, వారి ఆరోగ్య స్థితిగతులను బట్టి ఉంటుంది. కచ్చితంగా ఫలానా వయసు వచ్చేసరికి దూరంగా ఉండాలనే నియమాలేవీ లేవు. మీవారు చెప్పినట్లుగా ఈ వయసులో శృంగారం కొనసాగించడం వల్ల కొన్ని లాభాలున్నాయి. ఇదొక వ్యాయామంతో సమానం కాబట్టి కెలొరీలు ఖర్చవుతాయి. దాంతో బరువు పెరగరు. ఈ సమయంలో ఎన్నో కండరాలు కదలికలు జరిగి వాటి పటుత్వం పెరిగి, పనితీరు మెరుగవుతుంది. సెక్స్‌లో పాల్గొన్నప్పుడు శరీరానికి మేలు చేసే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మానసిక ఆరోగ్యానికి దోహదపడతాయి. ఆలుమగల మధ్య మరింత దృఢమైన అనుబంధానికి, వారి జీవితకాలం పెరగడానికి సంభోగం కొనసాగింపు దోహదపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇబ్బందులూ ఉన్నాయి.. ఈ వయసులో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురు కావొచ్చు. ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయులు తగ్గిపోవడంతో... వెజైనా పొడి బారడం, కలయికలో నొప్పి, మంట, ఇబ్బందిగా అనిపించడం జరుగుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి వెజైనల్ మ్యూకస్ మెమ్బ్రేన్ (యోని పొర) పొడిబారకుండా ఉండటానికి ఈస్ట్రోజెన్ క్రీములు వాడమని సూచిస్తారు వైద్యులు. అలాగే కలయిక సమయంలో ల్యూబ్రికేటింగ్ జెల్లీలు వాడితే మంట, నొప్పి కూడా ఉండవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- పొడవైన శిరోజాలతో... గిన్నిస్‌బుక్‌లో..!
- తారలు మెచ్చిన ‘ఫుల్కారీ’ ఫ్యాషన్.. ఈ స్టైలిష్ ట్రెండ్ గురించి తెలుసా?
- ఈ ఆహారంతో జుట్టు ఆరోగ్యంగా..!
- మెడ చుట్టూ నల్లగా అవుతోందా?
- గోళ్లు విరుగుతున్నాయా?
ఆరోగ్యమస్తు
- మెనోపాజా... వ్యాయామం చేయండి!
- ఎండకో గొడుగు..!
- చనుబాలు ఎక్కువగా వస్తున్నాయి.. తగ్గేదెలా?
- హార్మోన్లు సమతులంగా ఉండాలంటే..!
- ఎలక్ట్రోలైట్స్... తాగుతున్నారా?
అనుబంధం
- బద్ధకపు భర్తతో వేగలేకపోతున్నారా?
- లవ్ మ్యారేజ్.. అయినా సంప్రదాయాల పేరిట టార్చర్ చేస్తున్నాడు..!
- దాంపత్య బంధానికీ.. ఇవ్వాలి కాస్త విశ్రాంతి!
- బాస్ వివాహేతర సంబంధం.. అతడితో చెప్పాలా? వద్దా?
- నైపుణ్యాలకు సానపెట్టండిలా..
యూత్ కార్నర్
- వేసవి కథ!
- 29 బాటిళ్లతో ఒక స్విమ్‌సూట్.. విదేశాల్లోనూ పాపులర్!
- Prachi Nigam: స్టేట్ ఫస్ట్.. అయినా బాడీ షేమింగ్ తప్పలేదు!
- ప్రాణం కోసం... ‘సూర్య నాయక్’
- Janhvi Kapoor : నచ్చిందే పదే పదే తింటుంటా!
'స్వీట్' హోం
- రాత్రివేళకి... సుగంధాల రాణి!
- ఈ డ్రింక్‌తో వేసవి వేడిని తరిమేయండి!
- చెత్తబుట్ట నుంచి దుర్వాసన రాకుండా..!
- తేలిగ్గా వండేద్దాం..!
- ప్రకృతికి కోపం తెప్పిస్తున్నారా?
వర్క్ & లైఫ్
- గర్ల్ గ్యాంగ్‌తో వెకేషనా? అందాల ‘బాలి’ వెళ్లాల్సిందే!
- రంగులు తెలిసేలా!
- విజయానికి అందం అడ్డయ్యింది!
- భరణం ఇవ్వాల్సొస్తుందని ఉద్యోగం మానేశాడు!
- నేను బాగా పనిచేయడం లేదు!