ఎంతో ఊహించుకున్నా..

ఈ ఫిబ్రవరిలో ఫ్యామిలీ ఫ్రెండ్‌ సంస్థలో చేరా. భిన్నంగా ఉంటుందనీ, ఎదిగే వీలుంటుందనీ ఊహించుకున్నా. గత ఉద్యోగంలో నా పనికి మెచ్చో, ఇది వరకు పనిచేసిన క్లయింట్ల సిఫారసు కారణంగా నన్ను తీసుకున్నారనుకున్నా. వచ్చి ఇంతకాలమైనా కనీస శిక్షణ లేదు. పని విషయంలో కమ్యూనికేషన్‌ మరీ పేలవం. ఇక మారదామనుకుంటున్నా. ప్రపంచవ్యాప్త పరిస్థితులను చూస్తే ఇది సరైన సమయమేనా అనిపిస్తోంది. సలహా ఇవ్వండి.

Updated : 06 Nov 2021 23:29 IST

- శ్రావ్య, హైదరాబాద్‌

నిరాశపరిచే పరిస్థితే! కుటుంబ సంబంధాలు దెబ్బతినకూడదని ఉండుంటారు. ఓ పని చేయండి. మీ పై అధికారితో మీ మానసిక పరిస్థితి, మీరేం సాధించగలరన్న విషయాలపై నిజాయతీగా మాట్లాడండి. ఫలితం లేకపోతేనే వేరేదానికి ప్రయత్నించండి. ఉద్యోగ మార్పుకు సరైన సమయమంటూ ఏదీ ఉండదు. కానీ.. కొత్త ప్రయత్నానికి సమయం కేటాయించాలి. ఇది దీర్ఘకాలంలో చాలా సాయపడుతుంది. మీకు కావాల్సిందేదో కచ్చితంగా తెలిస్తే, దాన్ని దక్కించుకునే ప్రణాళికను రూపొందించుకోండి. దీనికీ శ్రమపడాలి. పైగా నిరుద్యోగం ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో కొత్త కొలువంటే టైం పడుతుంది. మీరు గమనించాల్సిన ఇంకో విషయం... మీరు సంస్థలోనే ఉందామనుకున్నా, కొత్తది ఎంచుకున్నా ఈ సమయంలో గమనించిన విషయాలు, అనుభవం రెండూ ఉపయోగపడేవే. కాబట్టి నిరుత్సాహపడకుండా, ఓపిగ్గా ఉండండి. వెళ్లాలని నిర్ణయించుకున్నాక మీ మేనేజర్‌కి విషయాన్ని తెలియజేయండి. కానీ ఆయనతో చర్చించడానికి ముందు నమ్మకం లేనివారితో మాత్రం చిన్న మాట కూడా చెప్పకండి. వేరే వారి ద్వారా విషయం చేరితే కారణాన్ని మీరు సరిగా వివరించలేరు. మీరు చేరబోయే సంస్థ మీపై అభిప్రాయం కోసం ఈ సంస్థను సంప్రదించొచ్చు. కాబట్టి మర్యాదగా, సత్సంబంధాలను కొనసాగిస్తూనే బయట పడండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్