జడ మెలి తిరిగిపోతోంది!
నా వయసు 23. ఆరోగ్య సమస్యలేమీ లేవు. ఇటీవలి కాలంలో చిన్న అనారోగ్యానికీ గురవలేదు. ఏ మందులూ వాడట్లేదు. అయినా జుట్టు విపరీతంగా ఊడుతోంది. జడ వేసుకుంటోంటే మెలి తిరిగిపోతోంది. చాలా దిగులుగా ఉంటోంది. ఏం చేయాలి?
నా వయసు 23. ఆరోగ్య సమస్యలేమీ లేవు. ఇటీవలి కాలంలో చిన్న అనారోగ్యానికీ గురవలేదు. ఏ మందులూ వాడట్లేదు. అయినా జుట్టు విపరీతంగా ఊడుతోంది. జడ వేసుకుంటోంటే మెలి తిరిగిపోతోంది. చాలా దిగులుగా ఉంటోంది. ఏం చేయాలి?
- ఓ సోదరి
ఈ వయసులో ఎండోక్రైన్ అంటే పురుష హార్మోన్లు పెరగడం, హార్మోన్ల అసమతౌల్యత జుట్టు ఊడటానికి కారణమవొచ్చు. హెయిర్ స్టైల్స్, ఐరనింగ్, స్ట్రెయిటనింగ్, బ్లోయర్లు వాడటం, గట్టిగా లాగి జడలు, పోనీ వేయడంతోపాటు విటమిన్, ఐరన్ లోపం, ఎనీమియా, ఒత్తిడీ కారణమే. 50-100 వరకూ వెంట్రుకలు ఊడటం సాధారణమే. అంతకన్నా ఎక్కువ ఉంటేనే కంగారు పడాలి. థైరాయిడ్, డీహెచ్ఈఏ, టెస్టోస్టిరాన్, ప్రొలాక్టిన్, ఎఫ్ఎస్హెచ్, సీబీపీలతోపాటు ఐరన్, సీరమ్ ఫెరటిన్ లెవెల్స్ చెక్ చేయించుకోండి.
వీటిల్లో ఏవైనా లోపాలుంటే మందులతో సరిచేసుకోవచ్చు. డైటింగ్ లాంటివి పక్కన పెట్టి విటమిన్లు ఎ, బి, సి, డి, ఇ, జింక్ ఎక్కువ ఉండే ఆహారాన్ని తగినంతగా తీసుకోవాలి. చిలగడదుంప, గుడ్డు, పాలు, పాలకూర, గుమ్మడి, తాజా పండ్లు, చిరుధాన్యాలు, చేప, ఆకుకూరలు, మష్రూమ్, బాదం, పొద్దుతిరుగుడు, గుమ్మడి గింజల్ని రోజూ తీసుకోవాలి. శారీరక, మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటానికి యోగా, ప్రాణాయామం వంటివి చేయాలి. ఈ కాలంలో మాడు మీద చర్మం పొడిబారి కూడా జుట్టు ఊడుతుంది. తలస్నానానికి గోరు వెచ్చని నీటినే వాడాలి. గాఢత తక్కువున్న షాంపూ, కండిషనర్ ఉపయోగించాలి. వైద్యుల సూచనతో మల్టీవిటమిన్, బయోటిన్ సప్లిమెంట్లు తీసుకోవచ్చు. ప్రొటీన్ రిచ్ ప్లాస్మా థెరపీ, లేజర్ కోంబ్స్ వంటివీ చేస్తారు. అదీ వైద్యుని సూచన మేరకే. సహజంగా అంటే.. మందార ఆకుల్ని కొబ్బరినూనెలో మరగబెట్టి రాసుకోండి. గుంటగలగరాకును నూనె, పేస్ట్ రూపంలో రాసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- పొడవైన శిరోజాలతో... గిన్నిస్‌బుక్‌లో..!
- తారలు మెచ్చిన ‘ఫుల్కారీ’ ఫ్యాషన్.. ఈ స్టైలిష్ ట్రెండ్ గురించి తెలుసా?
- ఈ ఆహారంతో జుట్టు ఆరోగ్యంగా..!
- మెడ చుట్టూ నల్లగా అవుతోందా?
- గోళ్లు విరుగుతున్నాయా?
ఆరోగ్యమస్తు
- మెనోపాజా... వ్యాయామం చేయండి!
- ఎండకో గొడుగు..!
- చనుబాలు ఎక్కువగా వస్తున్నాయి.. తగ్గేదెలా?
- హార్మోన్లు సమతులంగా ఉండాలంటే..!
- ఎలక్ట్రోలైట్స్... తాగుతున్నారా?
అనుబంధం
- బద్ధకపు భర్తతో వేగలేకపోతున్నారా?
- లవ్ మ్యారేజ్.. అయినా సంప్రదాయాల పేరిట టార్చర్ చేస్తున్నాడు..!
- దాంపత్య బంధానికీ.. ఇవ్వాలి కాస్త విశ్రాంతి!
- బాస్ వివాహేతర సంబంధం.. అతడితో చెప్పాలా? వద్దా?
- నైపుణ్యాలకు సానపెట్టండిలా..
యూత్ కార్నర్
- వేసవి కథ!
- 29 బాటిళ్లతో ఒక స్విమ్‌సూట్.. విదేశాల్లోనూ పాపులర్!
- Prachi Nigam: స్టేట్ ఫస్ట్.. అయినా బాడీ షేమింగ్ తప్పలేదు!
- ప్రాణం కోసం... ‘సూర్య నాయక్’
- Janhvi Kapoor : నచ్చిందే పదే పదే తింటుంటా!
'స్వీట్' హోం
- రాత్రివేళకి... సుగంధాల రాణి!
- ఈ డ్రింక్‌తో వేసవి వేడిని తరిమేయండి!
- చెత్తబుట్ట నుంచి దుర్వాసన రాకుండా..!
- తేలిగ్గా వండేద్దాం..!
- ప్రకృతికి కోపం తెప్పిస్తున్నారా?
వర్క్ & లైఫ్
- గర్ల్ గ్యాంగ్‌తో వెకేషనా? అందాల ‘బాలి’ వెళ్లాల్సిందే!
- రంగులు తెలిసేలా!
- విజయానికి అందం అడ్డయ్యింది!
- భరణం ఇవ్వాల్సొస్తుందని ఉద్యోగం మానేశాడు!
- నేను బాగా పనిచేయడం లేదు!