Dear Vasundhara: మా వారి పేరిట ఆస్తి ఉంది... అది నాకు వస్తుందా?

ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. పాప పుట్టి అనారోగ్యంతో చనిపోయింది. ఆ తర్వాత ఏడాదికి మావారు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇప్పుడు నాకే ఆధారమూ లేదు. మావారి పేరిట ఆస్తి ఉంది. అది ఆయన తాతగారిచ్చిన ఆస్తి. అది నాకు వచ్చే అవకాశం ఉందా?

Updated : 03 Mar 2022 17:53 IST

ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. పాప పుట్టి అనారోగ్యంతో చనిపోయింది. ఆ తర్వాత ఏడాదికి మావారు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇప్పుడు నాకే ఆధారమూ లేదు. మావారి పేరిట ఆస్తి ఉంది. అది ఆయన తాతగారిచ్చిన ఆస్తి. అది నాకు వచ్చే అవకాశం ఉందా?

- ఓ సోదరి, హైదరాబాద్‌

ఆస్తి మీ భర్త పేరు మీదుంటే మీకు వస్తుంది. అది ఆయన తాతగారిదైనా భాగాలు పంచి ఉండొచ్చు కదా. ఎలాంటి వీలునామా రాయకుండా చనిపోయిన వ్యక్తి ఆస్తి హిందూ వారసత్వ చట్టం సెక్షన్‌- 8 ప్రకారం క్లాజ్‌-1 వారసుల కింద భార్య, తల్లి, పిల్లలకు చెందుతుంది. అది మీకు, మీ అత్తయ్యకి సమానంగా చెందుతుంది. ఆస్తి తాతగారి పేరు మీదుంటే మాత్రం మీకు రావడం కష్టం. మీవారి పేరు మీద రిజిస్ట్రేషన్‌ అయ్యుంటే మీరు వారసత్వ ధ్రువపత్రాన్ని చూపించి సగభాగం పొందొచ్చు. ఈ పత్రాన్ని మీరు కోర్టు ద్వారా తీసుకోవాలి. మీవారు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ చనిపోయి ఉంటే కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం ఇస్తారు. అది లేదా వారసత్వ ధ్రువపత్రం ఉంటే ముందుగా ఆస్తిని మీ పేరు మీద మార్చమని రెవెన్యూ శాఖకి దరఖాస్తు చేయండి. మీ పెళ్లి పత్రిక, రిజిస్టర్‌ మ్యారేజ్‌ ధ్రువపత్రం, మీవారి మరణ ధ్రువీకరణ పత్రం, ఆస్తి కాగితాలు జత చేయండి. ఎవరూ అభ్యంతరం పెట్టకపోతే మార్పు చేస్తారు. ఎవరైనా అభ్యంతరం పెడితే ఎవరు వారసులో కోర్టులో తేల్చుకుని రమ్మంటారు. కోర్టులో లీగల్‌ హెయిర్‌ డిక్లరేషన్‌ సూట్‌ ఫైల్‌ చేస్తే కోర్టు మిమ్మల్ని వారసురాలిగా గుర్తించే ఆర్డర్‌ పాస్‌ చేస్తుంది. ముందుగా ఆస్తి కాగితాలు సంపాదించి వీలైనంత త్వరగా ప్రయత్నాలు మొదలుపెట్టండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్