కాలి మెట్టె.. కాస్త నాజూగ్గా!నగల్లో భారీతనం నేటి అమ్మాయిలకు నప్పడం లేదు. సన్నగా, నాజూగ్గా ఉండేవాటికే వారి ఓటు. మెట్టెలూ అందుకు మినహాయింపు కాదు. అలా చూసే వారికోసమే వస్తున్నాయీ నాజూకైన టో రింగ్స్. సన్నటి తీగకు చిన్న పూసలు, ముత్యాలు, రాళ్లతో సిద్ధమవుతున్నాయిలా. మహిళల మృదువైన పాదాల వేళ్లకు మరింత అందాన్ని తెచ్చేస్తూ బాగున్నాయి కదూ!
బార్లీతో భలేగా!శరీరం చక్కగా ప్రకాశవంతంగా మెరుస్తూ ఉండాలని అందరికీ ఉంటుంది.. కానీ మచ్చలు, మొటిమలు, జిడ్డు చర్మం.. ఇలా ఎన్నో సమస్యలు. ఇలాంటి వాటన్నింటికీ చెక్....
అరచేతుల్లో విరబూసే గోరింట ఆరోగ్యానికీ మంచిదే..!'గోరింట పూసింది కొమ్మ లేకుండా.. మురిపాల అరచేత మొగ్గ తొడిగింది..' అన్న చందంగా మహిళల చేతుల్లో గోరింటాకు విరబూస్తుంది. ఆషాఢమాసం వచ్చిందంటే చాలు.. అతివల చేతులు, కాళ్లు గోరింటాకుతో నిండిపోయి, పండిపోతాయి. ఈ మాసంలో చాలామంది తమ చేతులకు, పాదాలకు గోరింటాకు పెట్టుకోవడం....
యోగా చేస్తున్నది ఏడు శాతమే!గర్భంతో ఉన్నప్పుడు లేదా ప్రసవానంతరం ఏడు శాతం మంది మాత్రమే యోగాకు ప్రాధాన్యం ఇస్తున్నారట. ఈ విషయాన్ని తాజాగా ఓ అధ్యయనం తేల్చి చెప్పింది.అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓ సంస్థ ఆధ్వర్యంలో వివాహిత మహిళల్నీ, తల్లులైన వారినీ కలిపి మొత్తం 6,000 మందిపై సర్వే చేపట్టింది.
పండంటి జీవితానికి పంచ సూత్రావళికథలూ, సినిమాలకు మల్లే నవ్వుతూ తుళ్లుతూ కబుర్లు చెప్పుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ కొన్ని జంటలే అలా అన్యోన్యంగా ఉండగలుగుతున్నాయి. అధికశాతం పిల్లీ ఎలుకల్లా కయ్యానికి కాలు దువ్వుకోవడం, మాట్లాడుకోవడం కంటే పోట్లాడుకోవడమే ఎక్కువ. ఈ నేపథ్యంలో భార్యాభర్తల్లో గొడవకు దారి తీసే అంశాలు ముఖ్యంగా ఐదని, వాటిని తేలిగ్గానే నివారించవచ్చని చెబుతున్నారు ఫ్యామిలీ కౌన్సిలర్లు. అవేంటో మీరూ చూడండి...
పిల్లల్ని వాళ్ల గదిలో ఎప్పుడు పడుకోబెట్టాలి?సాధారణంగా మన దేశంలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు 10-12 ఏళ్లొచ్చేదాకా తమ గదిలోనే పడుకోబెట్టుకుంటారు. ఇలా అలవాటవడం వల్ల ఆ తర్వాత వాళ్లకు ప్రత్యేకంగా గదిని కేటాయించినా ఆ పిల్లలు పడుకోలేరు. ఇది ఇటు దాంపత్య బంధాన్ని....
Miss India Sini Shetty: చిన్నప్పటి నుంచే కలలు కంది.. సాధించింది!అందాల పోటీల గురించి విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. కొంతమంది ఇవి అమ్మాయిల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని అంటే.. మరికొంతమంది మాత్రం ఇవి శరీర సౌందర్యాన్ని ప్రదర్శించడమే అని అంటుంటారు. కానీ, ఈ పోటీల్లో నెగ్గాలంటే కేవలం.....
ప్రియాంకా మాటలే.. కిరీటానికి బాటలుఅందంలోనే కాదు ఆలోచనల్లోనూ భిన్నమైన వ్యక్తిత్వం ఈ కన్నడ కస్తూరిది... ‘ఇరుకు గదిలో ఇబ్బంది పడే కన్నా... ఆ గాజు గోడలని బద్దలు కొట్టుకుని స్వేచ్ఛగా జీవించడమే మేలు..’ అని ప్రియాంకా చోప్రా చెప్పిన మాటల్ని ప్రగాఢంగా విశ్వసించి.. అనుసరించి మిస్ ఇండియా వరల్డ్‌గా ఎదిగిన సినీశెట్టి పంచుకున్న విశేషాలివి..
వర్షాల వేళ వార్డ్రోబ్ జాగ్రత్త!చినుకులు మొదలయ్యాయంటే దుస్తులు త్వరగా ఆరవు. అల్మరల్లోకి తేమ చేరడం, వస్త్రాల నుంచి ఒకలాంటి వాసన వంటివి వస్తుంటాయి. వీటి నుంచి తప్పించుకోవాలా? ఈ చిట్కాలు పాటించేయండి. అలమరాల్లో దట్టంగా వార్తాపత్రికలను పరిచి ఉంచండి. ఇవి తేమను పీల్చేస్తాయి. దుస్తులు పూర్తిగా ఆరాయి అన్న తరువాతే కప్‌బోర్డ్‌లో పెట్టండి. ఎండ లేదనిపిస్తే హెయిర్ డ్రైయర్‌తో ఓసారి ఆరబెట్టాకే....
ఈ మొక్కతో ఇంటికి అందం, ఒంటికి ఆరోగ్యం!ఇంటి అలంకరణలో గార్డెనింగ్ కూడా ఓ భాగమే. ఈ క్రమంలోనే ఇండోర్ ప్లాంట్స్కి ఆదరణ పెరుగుతోంది. అయితే కొంతమంది అటు ఇంటికి అందాన్నిస్తూనే, ఇటు ఆరోగ్యాన్ని పెంపొందించే మొక్కల్ని పెంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ‘సాంసెవిరియా’ మొక్క కూడా ఈ కోవకే....
కొత్త పెళ్లికూతుళ్లు.. వీటి గురించే తెగ వెతికేస్తున్నారట!కొత్తగా పెళ్లై అత్తారింట్లో అడుగుపెట్టిన అమ్మాయి మనసులో ఎన్నో ఆలోచనలు.. కొత్త కోడలిగా అత్తింట్లో ఎలా మసలుకోవాలి? వాళ్ల మనసులు ఎలా గెలుచుకోవాలి? భర్తకు మరింత దగ్గరవడమెలా?.. నవ వధువుల మనసంతా ఇలాంటి విషయాల చుట్టే తిరుగుతుంటుంది. ఇలా వీళ్ల మనసులో ఉన్న ఆలోచనలు తెలుసుకోవడానికే.....
పెదనాన్న ఆస్తి నేను రాయించుకోవచ్చా?నా వయసు 24. మా పెద్దనాన్నగారికి భార్యా, పిల్లలు లేరు. తనకున్న ఇంటి స్థలాన్ని నా పేర రాస్తానంటున్నారు. ఇది వీలునామా ద్వారా రాయించుకోవాలా? రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా? లేదంటే నన్ను ఆయన దత్తత తీసుకోవాలా? భవిష్యత్తులో ఎలాంటి చిక్కులూ లేకుండా మంచి మార్గాన్ని సూచించగలరు....
70ల్లో... 80 పతకాలు!కొంతమందిని చూస్తే వీళ్లు వయసుకి ఎదురీదుతున్నారేమో అనిపిస్తుంది. అలాంటి వారే 76 ఏళ్ల ఈ బామ్మ. కారణం.. 66 ఏళ్లకి క్రీడల్లో అడుగుపెట్టి 80 పతకాలు సాధించారామె. విజయవాడకు చెందిన అమలాపురపు వెంకట సుబ్బలక్ష్మి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఆమేం చెబుతున్నారో చూడండి...
ఆమె నగ... దేశదేశాలా ధగధగమీ కెరియర్ ఏదంటే ఏం చెబుతారు? ఇదేం ప్రశ్న! చదివిన చదువునో లేదూ.. చేస్తున్న ఉద్యోగాన్నో చెబుతాం, అవునా? సరోజ ఎర్రమిల్లి విషయంలో మాత్రం అలా చెప్పలేం. ఆవిడ చదువుకూ, చేసిన ఉద్యోగాలకూ సంబంధమే లేదు. ఆ పద్ధతే తాను వ్యాపారవేత్తగా ఎదగడంలో సాయపడిందనే సరోజ.. నగల వ్యాపారంలో ఓ కొత్త ఒరవడినే సృష్టించారు.