సంబంధిత వార్తలు

Ukraine Crisis: ఆగని బాంబుల జడి

ఉక్రెయిన్‌లోని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలనే కాకుండా పౌరులనివాసాలు, ఆసుపత్రులు, బడులపైనా రష్యా సేనలు విరుచుకుపడుతున్నాయి. ఆదివారం మేరియుపొల్‌లోని ఓ ఆర్ట్‌ స్కూల్‌పై బాంబులతో దాడిచేశాయి. దానిలో దాదాపు 400 మంది తలదాచుకున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శిథిలాల కింద అనేకమంది చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. ఇలాంటివన్నీ యుద్ధ నేరాలేనని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. ఇవన్నీ రాబోయే కొన్ని శతాబ్దాల పాటు పీడకలలా మనల్ని వెంటాడతాయని చెప్పారు. రష్యాతో చర్చలు విఫలమైతే అది మూడో ప్రపంచ యుద్ధానికే దారి తీస్తుందని హెచ్చరించారు.

తరువాయి