సంబంధిత వార్తలు

కాలేయానికి బిఘాతం!

మన శరీరంలో అత్యంత కీలకమైన అవయాల్లో కాలేయం ప్రధానమైంది. ఇది అలుపెరగకుండా ఒక కర్మాగారం మాదిరిగా పనిచేస్తూ.. శరీర వ్యవస్థలన్నీ సజావుగా సాగేలా చేస్తుంది. ఒకింత మొండిదైనా కాలేయానికి వైరస్‌లు, జబ్బుల ముప్పూ ఎక్కువే. ముఖ్యంగా హెపటైటిస్‌ వైరస్‌లు ఏమాత్రం అవకాశం దొరికినా దాడి చేసేస్తుంటాయి. రకరకాల ఇన్‌ఫెక్షన్లను తెచ్చిపెడతాయి. ముఖ్యంగా హెపటైటిస్‌ బి ఇన్‌ఫెక్షన్‌ చాపకింద నీరులా పాకుతూ.. దీర్ఘకాలం పట్టి పీడిస్తుంది. కాలేయం గట్టిపడటం, కాలేయ క్యాన్సర్‌ వంటి తీవ్ర సమస్యలకూ దారితీస్తుంది. కాబట్టి హెపటైటిస్‌ బి ఇన్‌ఫెక్షన్‌ నిర్లక్ష్యం చేయటానికి వీల్లేదు. ఎప్పటికప్పుడు దీని తీరుతెన్నులను గమనిస్తూ.. జాగ్రత్తగా కనిపెట్టుకోవాల్సి ఉంటుంది. దీంతో చిక్కేంటంటే..

తరువాయి

అమ్మేద్దాం స్మార్ట్‌గా!

ఇంట్లో కూరగాయల నుంచి... వేసుకునే బట్టలు... ధరించే యాక్ససరీస్‌.... అన్నీ ఆన్‌లైన్‌లోనే కొనేస్తున్నాం. అందుకు అనువైన ఆన్‌లైన్‌ స్టోర్‌లకు లెక్కేలేదు. ఆకట్టుకునే ఫొటోలతో ఆన్‌లైన్‌ అంగళ్లు స్మార్ట్‌ ఫోన్‌లోకి వచ్చేసి తెగ వూరించేస్తుంటాయి. మరి, మీరు తయారు చేసే ఉత్పత్తుల్ని అంతే అదిరేలా గ్యాలరీ రూపంలో క్రియేట్‌ చేసి.. వివరాలు జత చేసి... ఆన్‌లైన్‌లో అధికారికంగా అమ్మకం చేపట్టాలంటే? ‘అబ్బో... చాలా ఖర్చుతో కూడుకున్నది. అంతేనా... టెక్నాలజీపై బాగా పట్టుండాలి. మాకున్న మిడిమిడి పరిజ్ఞానంతో అవన్నీ ఎలా సాధ్యం..’ అనే వాళ్లే ఎక్కువ. అలాంటి వారి కోసం క్షణాల్లో ఉచితంగా స్టోర్‌ని క్రియేట్‌ చేసుకుని అమ్మకాలు చేపట్టేలా ‘షాప్‌మాటిక్‌’ ముందుకొచ్చింది. అదీ మీ చేతితో నిత్యం ఒదిగి ఉండే సెల్‌ఫోన్‌లోనే. మీకేమంత టెక్నాలజీ పరిజ్ఞానం కూడా అక్కర్లేదు. మీకు పరిమిత ‘ఆప్‌’ నాలెడ్జ్‌తోనే స్టోర్‌ని మీరే క్రియేట్‌ చేసుకోవచ్చు. మోజు తీరాక అమ్మేసే ‘సెకండ్స్‌’ మార్కెట్‌ కంటే ఒక మెట్టు పైకెక్కి...

తరువాయి

వస్తు రవాణా.. మస్తు కొలువులు

మనం తినే తిండి.. వేసుకునే దుస్తులు, మందులు.. ఉపయోగించే మొబైల్‌, కంప్యూటర్‌.. నడిపే వాహనం.. ఇలా అన్ని రకాల వస్తువులు ఎక్కడో తయారై మన ఊరిలోకి.. అందులోనూ మన వీధిలోకి.. ఇంకా చెప్పాలంటే ఇంటింటికీ ఎలా వచ్చి చేరుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఉత్పత్తి కేంద్రం నుంచి వినియోగదారుడి వరకు వీటిని పాడైపోకుండా సకాలంలో చేర్చడంలో ఎంతోమంది నిపుణులు పని చేస్తుంటారు. నిత్యజీవితంతో ఇంతగా ముడిపడిపోయిన ఈ రంగమే ‘లాజిస్టిక్స్‌’. వచ్చే నాలుగేళ్లలో ఇందులో దాదాపు 30 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని ఒక సర్వేలో తేలింది. మన తెలుగు రాష్ట్రాల్లోనే లక్షల ఉద్యోగాలు లభించబోతున్నాయి. విస్తృతమైన ఈ రంగంలోకి ప్రవేశించి అవకాశాలను అందుకోవాలంటే లాజిస్టిక్స్‌కి సంబంధించి కొన్ని కోర్సులు చేయాలి. టెన్త్‌, ఇంటర్‌, సాధారణ డిగ్రీ అర్హతలతో అవి అందుబాటులో ఉన్నాయి...

తరువాయి