సంబంధిత వార్తలు

CM KCR: కేంద్రం అవినీతిని బయటపెడతా

గత ఎనిమిదేళ్ల పాలనలో దేశంలో ఏ వర్గానికీ మేలు జరగలేదని, ఈ దేశాన్ని భాజపా సర్వనాశనం చేసిందని సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంలో జరిగే అవినీతి బాగోతాల చిట్టా తన దగ్గరకు వచ్చిందని, ఇంకొన్ని పద్దులు   వస్తున్నాయని.. త్వరలోనే అన్నీ బయటపెడతానన్నారు. దేశ రాజకీయాల్లో మొలిచిన కుక్కమూతి పిందె భాజపా అని.. దీన్ని  ఎంత తొందరగా వదిలించుకుంటే దేశానికి అంత మంచి జరుగుతుందని వ్యాఖ్యానించారు. భాజపాకు మతపిచ్చి ముదిరి దేశంలో పిచ్చిపిచ్చి చట్టాలు తీసుకువస్తోందని మండిపడ్డారు. యాదాద్రిలో వీవీఐపీల కోసం నిర్మించిన ప్రెసిడెన్షియల్‌ సూట్లతో పాటు భువనగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని శనివారం సీఎం ప్రారంభించారు.

తరువాయి

PM Modi: అవమానకరంగా ఆంధ్రా విభజన

కేంద్రంలో అధికారంలో కూర్చోవడానికి ప్రధాన కారణమైన ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్‌ పార్టీ అవమానకర రీతిలో విభజించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ధ్వజమెత్తారు. అహంకారంతో కూడిన అధికార మత్తులో చేసిన రాష్ట్రవిభజన ఇప్పటికీ రెండు రాష్ట్రాలకు నష్టం చేకూరుస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు బదులిస్తూ మంగళవారం ఉదయం రాజ్యసభలో ఆయన గంటన్నరపాటు ప్రసంగించారు. ఇందులో ప్రధాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పలుసార్లు గుర్తు చేసుకున్నారు. అంజయ్యకు జరిగిన అవమానం, ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి జరిగిన ప్రయత్నం,....

తరువాయి

CM KCR: ఏ పార్టీ వారైనా వదలొద్దు

మాదకద్రవ్యాల నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. నేరస్థులను కాపాడేందుకు ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసినా, నిర్ద్వంద్వంగా తిరస్కరించాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏ పార్టీకి చెందినవారినైనా సరే వదలొద్దని ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయి తదితర మాదకద్రవ్యాల వినియోగాన్ని కూకటివేళ్లతో పెకలించాలనే లక్ష్యంతో ప్రగతిభవన్‌లో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర పోలీసు, ఎక్సైజ్‌ అధికారుల సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘మాదకద్రవ్యాల వాడకం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న దుర్వ్యసనం. దీన్ని తెలంగాణలో సమూలంగా నిర్మూలించడానికి పోలీసు అధికారులు బాధ్యతతో కృషి చేయాలి.

తరువాయి

Indian Railway: రైల్వే రెడ్‌ సిగ్నల్‌!

దేశవ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్‌ 66,687 రూట్‌ కిలోమీటర్లు ఉంటే.. అందులో రాష్ట్రంలో ఉన్నది కేవలం 1,737 రూట్‌ కిలోమీటర్లే. అంటే 2.8 శాతం. రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణ 14వ స్థానంలో ఉంది. బిహార్‌తో పోల్చిచూస్తే ఇక్కడ అందులో సగం కూడా లేవు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక కూడా కొత్త రైల్వే లైన్ల మంజూరు, డబ్లింగ్‌లోనూ ప్రాధాన్యం లభించట్లేదు. ఏళ్ల క్రితం మంజూరైన ప్రాజెక్టులకూ దిక్కులేదు. ఉదాహరణకు మంజూరై నాలుగేళ్లు దాటినా యాదాద్రి ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. పగిడిపల్లి(బీబీనగర్‌)-నల్లపాడు మధ్య రెండోలైనుకు తుది సర్వే పూర్తయినా నిధులు మంజూరు చేయట్లేదు. సికింద్రాబాద్‌-కాజీపేట మూడో లైను సర్వే పూర్తయినా రైల్వే బోర్డు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

తరువాయి

Science City:రాజధానికి విజ్ఞాన సిరి

తెలంగాణకు మరో ప్రతిష్ఠాత్మక అవకాశం తలుపు తట్టింది. హైదరాబాద్‌లో సైన్స్‌ సిటీ ఏర్పాటు ప్రతిపాదన తాజాగా తెరపైకి వచ్చింది. శాస్త్ర, సాంకేతిక రంగాలపై యువతకు అభిరుచిని కలిగించి.. పరిశోధనలపై ఆసక్తిని పెంచుతుంది సైన్స్‌ సిటీ. దేశవిదేశాల నుంచి పరిశోధకులను, శాస్త్రవేత్తలను ఆకర్షించే శాస్త్రనగరి అది. కేంద్ర సాంకేతిక, పర్యాటక అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని సైన్స్‌ మ్యూజియాల జాతీయ మండలి (నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ మ్యూజియమ్స్‌) దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పలు నగరాల్లో సైన్స్‌ సిటీలు, సైన్స్‌ సెంటర్‌లు, ఇన్నోవేషన్‌ హబ్‌లు, డిజిటల్‌ ప్లానెటోరియాలను ఏర్పాటు చేస్తుంటుంది.

తరువాయి