సంబంధిత వార్తలు

Ukraine Crisis: ఆగని బాంబుల జడి

ఉక్రెయిన్‌లోని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలనే కాకుండా పౌరులనివాసాలు, ఆసుపత్రులు, బడులపైనా రష్యా సేనలు విరుచుకుపడుతున్నాయి. ఆదివారం మేరియుపొల్‌లోని ఓ ఆర్ట్‌ స్కూల్‌పై బాంబులతో దాడిచేశాయి. దానిలో దాదాపు 400 మంది తలదాచుకున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శిథిలాల కింద అనేకమంది చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. ఇలాంటివన్నీ యుద్ధ నేరాలేనని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. ఇవన్నీ రాబోయే కొన్ని శతాబ్దాల పాటు పీడకలలా మనల్ని వెంటాడతాయని చెప్పారు. రష్యాతో చర్చలు విఫలమైతే అది మూడో ప్రపంచ యుద్ధానికే దారి తీస్తుందని హెచ్చరించారు.

తరువాయి

Ukraine Crisis: విధ్వంసం

తీవ్రతలో ఒక్కోరోజు కాస్త హెచ్చుతగ్గులు ఉంటున్నా.. ఉక్రెయిన్‌పై నిప్పుల వానను రష్యా కొనసాగిస్తోంది. కీవ్‌, ఖర్కివ్‌ నగరాలపై, ముఖ్యంగా జనసమ్మర్ద ప్రాంతాలపై బుధవారం వరసగా ఏడోరోజు కూడా రష్యా రాకెట్లు, క్షిపణులు దూసుకువెళ్లి విధ్వంసం సృష్టించాయి. ఏకబిగిన చోటుచేసుకుంటున్న పేలుళ్ల శబ్దాల షాక్‌ నుంచి ప్రజలు వెంటనే తేరుకోలేకపోతున్నారు. ఎక్కడికక్కడ తునాతునకలైన భవంతులు చూసినవారికి గుండె గుభేల్‌మంటోంది. తమ చెంతనే బాంబులు పడిన దృశ్యాలు మది నుంచి చెదిరిపోక భీతిల్లుతున్నారు. మరిన్ని చర్చలకు సన్నద్ధంగా ఉన్నట్లు చెబుతూనే దురాక్రమణ యత్నాలను రష్యా కొనసాగిస్తుండడాన్ని అమెరికా సహా ప్రపంచ దేశాలు....

తరువాయి

Ukraine Crisis: పుతిన్‌ పిడుగు

ఊహించిందే జరిగింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. అనుకున్నది చేశారు. ఉక్రెయిన్‌ సార్వభౌమత్వానికి పెను సవాలు విసిరారు. తూర్పు ఉక్రెయిన్‌లోని దొనెట్స్క్‌, లుహాన్స్క్‌ వేర్పాటువాద భూభాగాలను స్వయం ప్రతిపత్తి ఉన్న ప్రాంతాలుగా గుర్తిస్తూ సోమవారం రాత్రి పొద్దుపోయాక ఉత్తర్వులు జారీ చేశారు. 2014లో ఈ ప్రాంతాలు స్వతంత్రత ప్రకటించుకున్నప్పుడు నిర్ణయించుకున్న సరిహద్దులే వాటికి ఉంటాయని ప్రకటించారు. నాటోలో సభ్యత్వం పొందకుండా, ఆయుధాలను ఇతర దేశాల నుంచి పొందకుండా ఉక్రెయిన్‌ను అడ్డుకునేందుకు ఈ దిశగా అడుగువేశారు. ఉక్రెయిన్‌ ప్రభుత్వంతో, పాలనతో ఇకపై ఈ ప్రాంతాలకు ఎలాంటి సంబంధాలు ఉండవని తెలిపారు.

తరువాయి

సెల్ఫీ కావొద్దు కిల్ఫీ

‘ఒరేయ్‌.. ఆ ప్రవీణ్‌ డేర్‌డెవిల్‌ సెల్ఫీకి ఫేస్‌బుక్‌లో ఎన్ని లైక్‌లు వచ్చాయో చూశావా’ ‘జూలో దూరంగా నిల్చుని సింహంతో సెల్ఫీ దిగడం గొప్ప కాదులేరా..’ ‘నువ్వు కూడా ఏదో ఒకటి చేసి.. వానికంటే ఎక్కువ లైక్‌లు కొట్టకపోతే క్రేజ్‌ ఏముంటుంది?’ ‘అవున్రా.. అందర్నీ ఫిదా చేస్తా..’ ‘అదేదో చేస్తే నువ్వే చేయాల్రా! మావల్ల కాదు!’ ‘రేప్పొద్దున వూరవతల రైల్వేలైన్‌ దగ్గర కలుద్దాం. మీరంతా అక్కడికి రండి. ఆ ప్రవీణ్‌కు ఎలా జలఖ్‌ ఇస్తానో చూద్దురు’ ఇరవైవేల విద్యుత్‌ వోల్టుల తీగల కింద.. వంద కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది రైలు. పదిమంది కుర్రాళ్లు చేతుల్లో సెల్‌ఫోన్లు పట్టుకుని.....

తరువాయి

మనసున్న వైద్యులు...సామాజిక సేవకులు!

కార్పొరేటు ఆసుపత్రుల్లో ఉద్యోగం... బాధ్యతాయుతమైన హోదా... వూపిరి సలపనంత పని... ఖాళీ దొరికేది వారాంతాల్లో... ఆ సమయాన్నే సామాజికసేవకు వినియోగిస్తోంది ఓ వైద్యబృందం... మూరుమూల పల్లెల్లో అవగాహన సదస్సులు... క్యాన్సర్‌ ఉచిత రోగ నిర్ధరణ పరీక్షలు... ఇదీ వారి బాట... తెలుగు రాష్ట్రాలు దాటి కర్నాటక, తమిళనాడుల్లోనూ సేవలు పరుగులు పెట్టిస్తున్నారు... ఇప్పటికే రెండులక్షలమంది నాడి పట్టారు... అతిపెద్ద వైద్య శిబిరం నిర్వహించి ప్రపంచ రికార్డు సైతం నెలకొల్పారు... సమాజానికి తిరిగిస్తే వచ్చే కిక్కే వేరప్పా అంటున్న ఆ యువబృందంతో మాట కలిపింది ఈతరం.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

మంచిమాట


'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్