సంబంధిత వార్తలు

కోవిడ్‌ను గెలిచిన సిస్టార్‌!

‘సిస్టర్‌.. జాగ్రత్త!’ అన్నారెవరో! ఫర్వాలేదులే అన్నట్టుగా చిన్నగా నవ్విందామె! కొన్నాళ్లకు.. ‘సిస్టర్‌.. జాగ్రత్త!’ అన్నారింకెవరో!! ‘నా ధర్మం నేను నిర్వర్తించాలి. భయపడితే ఎలా?’ అని సమాధానమిచ్చింది. ఇంకొన్నాళ్లకు.. ‘సిస్టర్‌.. జాగ్రత్త!’ అంటూ ఆ రాష్ట్ర మంత్రి ఫోన్‌ చేశారు. ‘ధన్యవాదాలు..’ అని చెప్పి కొత్త శక్తితో మళ్లీ విధుల్లో చేరింది. ఈ మూడు సంఘటనలు ఆమె శక్తిని తెలియజేసేవే! కరోనా బాధితులకు సేవలు చేసి.. తానూ వైరస్‌ బారిన పడి.. కొవిడ్‌పై గెలిచి మళ్లీ విధులకు హాజరవుతున్నారు కేరళ నర్సు రేష్మా మోహన్‌దాస్‌. ఆమెను వసుంధర పలకరించింది.. ఈ నర్సమ్మ అనుభవాలు ఆమె మాటల్లోనే..

తరువాయి

వైరస్‌పై నారి సారించారు

కరోనా కట్టడిలో పురుషాధినేతలు పరేషాన్‌ అవుతున్నారు. పెద్దన్నలు సైతం పెద్దగా ఏం సాధించలేకపోతున్నారు. అదే సమయంలో.. స్త్రీమూర్తులు తమ యుక్తిని చాటుతున్నారు. దేశాధినేతలు కాస్తా తల్లిపాత్ర పోషిస్తున్నారు. పిల్లల మేలుకోరి కొవిడ్‌పై పోరాడుతున్నారు. తైవాన్‌ అధ్యక్షురాలు త్సాయ్‌ఇంగ్‌ కావొచ్చు.. న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ కావొచ్చు.. ఎందరెందరో ఇంతులు.. కరోనా అంతు తేలుస్తున్నారు! మూడు టీలతో ముందడుగు... - ఏంజెలా మెర్కెల్‌, జర్మనీ ఛాన్సెలర్‌ అభివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పే ఐరోపా దేశాలు.. కరోనా ధాటికి విలవిల్లాడిపోతున్నాయి. ఇటలీ, స్పెయిన్‌ వంటి దేశాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. జర్మనీ మాత్రం కరోనాను సమర్థంగా కట్టడి చేయగలిగింది...

తరువాయి

చల్లని తల్లి సాహోదరి..

తెల్లని దుస్తుల్లో చల్లని తల్లి.. ముఖంలో చెరగని చిరునవ్వు.. అశ్వినీ దేవతల దూతగా భువిపైకి వచ్చిందేమో ఆమె! ‘రాత్రి నిద్ర పట్టిందా..’ అని రోగిని పలకరిస్తుంది.. ‘చెప్పినట్టు వింటే రెండు రోజుల్లో ఇంటికి పంపించేస్తాం’ అని నెమ్మదిగా హెచ్చరిస్తుంది! తోబుట్టువులా కుశలం కోరుతుంది.. పేరుకు నర్సే అయినా.. సిస్టర్‌ అంటారంతా! కరోనా కాలంలో ఎన్నడూ లేనంత బిజీ అయిపోయింది సిస్టర్‌! ప్రపంచమంతా భౌతిక దూరానికి దగ్గరైనా.. రోగులను అక్కున చేర్చుకుని అండగా నిలుస్తోంది. అందుకే ప్రధాని నుంచి  సామాన్యుల వరకూ సాహో సహోదరి అని సిస్టర్‌ని కీర్తిస్తున్నారు..

తరువాయి