
సంబంధిత వార్తలు

4 సర్జరీలు.. 33 నాట్యరీతులు
శంకరాభరణం... శృతిలయలు... సాగర సంగమం... స్వాతికిరణం తెలుగు నుంచి సోవియట్ భాషలోకి అనువాదమైన ఈ సినిమాలని లిదియా ఎన్నిసార్లు చూసిందో లెక్కేలేదు. నాలుగేళ్లప్పుడు నాట్యం, కళలపై అభిమానంతో ఉక్రెయిన్ నుంచి మనదేశానికి వచ్చి 33 రకాల నాట్యరీతులని అభ్యసించింది. సెలెబ్రినో అనే సంస్థను స్థాపించి హాలీవుడ్, టాలీవుడ్ సినిమాలకు లైన్ప్రొడక్షన్, సెట్ డిజైన్, బాడీ డబులింగ్ వంటి సేవలని అందిస్తోంది లిదియా...తరువాయి

చదువులేని తానూబాయి పరిశ్రమను నడిపిస్తోంది!
ఆమెకు యూనివర్సిటీలిచ్చిన డిగ్రీలు లేవు! ఆ మాటకొస్తే అక్షరంముక్క రాదు..... కేవలం జీవితం నేర్పిన అనుభవంతోనే ఎన్నో పాఠాలు నేర్చుకుంది.. ఆ ఆత్మవిశ్వాసంతోనే లక్షలరూపాయల లావాదేవీలను అవలీలగా చేస్తోంది. దేశంలోనే మొదటిసారి ఆదివాసీ రైతుల ఆధ్వర్యంలో ఏర్పాటైన పత్తి జిన్నింగ్ మిల్లుకు నాయకత్వం వహిస్తోంది .....తరువాయి

దీక్ష.. అక్షితల మేలు మార్గం!
సముద్రపు ఒడ్డున చింతపండు అమ్మితే లాభం... అడవిలో ఉప్పు అమ్మితే లాభం... నగరాల్లో ఈ రెండూ కలిపి ఊరగాయగా విక్రయిస్తే ప్రయోజనం... ఇదో వ్యాపార సూత్రం... హైదరాబాద్‌కి చెందిన ఇద్దరు యువతులు అలాంటి పనే చేశారు. గ్రామాల్లో సరైన ధర దక్కని అల్లాడుతోన్న రైతు ఉత్పత్తులకు నగరంలో ఓ అద్భుతమైన వేదికను ఏర్పాటు చేశారు. మహిళలకు ఉపాధి మార్గం చూపారు. అదేంటో మనమూ తెలుసుకుందామా!తరువాయి

ల్యాబ్ చిక్కులకు.. ఇంటి దినుసులు!
సాధారణంగా శాస్త్రవేత్తలకు ల్యాబ్‌లు... పరిశోధనలు ఇవే లోకమవుతాయి. డాక్టర్ ఫాతిమా బెనజీర్ మాత్రం అక్కడ నుంచి మరో అడుగుముందుకేశారు. ‘అజూకా లైఫ్ సైన్సెస్’ సంస్థను ప్రారంభించి‘టింటో ర్యాంగ్’ పేరుతో ఓ వినూత్నమైన ఆవిష్కరణ చేశారు. ఆరోగ్యరంగంలో విప్లవాత్మకమైన మార్పునకు శ్రీకారం చుట్టే ఆ ఆవిష్కరణ మనకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం....తరువాయి

అంజలి పోరాటం... ఆకలిపై!
లాక్డౌన్ తర్వాత పేదల పరిస్థితి ఎలా ఉంది? అంతకు ముందులాగే అందరికీ పని దొరికిందా? కడుపు నిండుతోందా? ‘లేదు... ఇప్పటికీ నరకం చూస్తున్నాం...’ అటు పని దొరక్క... ఇటు ప్రభుత్వ పథకాలు ఆగిపోయి ఆకలితో అల్లాడుతున్నాం... అంటూ పెదవి దాటిన ఓ పేదరాలి ఆకలిబాధ ఆమె మనసును తాకింది. అంతే... ఆమె పోరాటం మొదలైంది. ఫలితం... లక్షలాదిమంది కడుపు నిండింది. ఇలాంటి పోరాటాలు ఆమెకి కొత్తకావు.. ప్రభుత్వచట్టాలను ప్రజల వద్దకు చేర్చాలనే ఈమె లక్ష్యం..తరువాయి

కొత్త కొలువుకు ఈ నైపుణ్యాలెంతో ముఖ్యం..
రాధిక చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసింది. అంతకన్నా ఉన్నతస్థాయి కొలువులో అడుగుపెట్టాలని ఆలోచిస్తోంది. అయితే మరో చోట చేరాలనుకున్నప్పుడు అదనపు నైపుణ్యాలుంటేనే కోరుకున్న ఉద్యోగాన్ని సాధించొచ్చు అని చెబుతున్నారు కెరీర్ నిపుణులు. అవేంటో కూడా సూచిస్తున్నారు.తరువాయి

అమ్మాయి జాగ్రత్త!
కౌమారం ఎగసిపడే జలపాతంలాంటిది... అందంగా కనిపించే ఆ ప్రవాహంలో సుడులెన్నో ఉంటాయి. అప్రమత్తంగా లేకపోతే పాతాళానికి జారిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆడపిల్లలు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. మరి తల్లిదండ్రులేం చేయాలి? అందుకోసమే ఈ చెక్‌లిస్ట్ అని చెబుతున్నారు మానసిక వైద్యురాలు గౌరీదేవి.తరువాయి

ఉచితంగా న్యాప్కిన్లు!
నెలసరి... ఆ మూడు రోజులూ మహిళలు ఎదుర్కొనే మానసిక, శారీరక ఇబ్బందులు చెప్పతరం కాదు. పంటిబిగువున బాధను బిగబట్టుకుంటారు. ఆ సమయంలో తీసుకోవాల్సిన వ్యక్తిగత శుభ్రత పట్ల చాలామందికి అవగాహన ఉండటం లేదు. ముఖ్యంగా గ్రామీణ స్త్రీలు నెలసరి సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత పట్ల అవగాహన లేమితో అసురక్షిత విధానాలనుతరువాయి

ఔషధి ప్యాడ్స్... కష్టాన్ని తీర్చేందుకే!
నెలలో ‘ఆ మూడు రోజులు’ స్త్రీలందరికీ సాఫీగానే సాగిపోతున్నాయా? లేదు... చాలామంది మహిళలకుఆ రోజులు నరకప్రాయమే! నెలసరి సమయంలో రుతుస్రావాన్ని అదుపు చేసేందుకు ఆకులు, మాసినబట్టలు, చెక్కలు వాడి తమ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు వాళ్లు. ఈ విషయాలని తన అనుభవంలో తెలుసుకున్న శాస్త్రవేత్త రమాదేవితరువాయి

మేయర్ బడిలో ఉత్తీర్ణత 100%
అగ్రరాజ్యంలో పౌరసత్వం.. నెలకు రూ.లక్షల్లో జీతం.. అడిగింది క్షణాల్లో కళ్ల ముందుంచే కుటుంబం.. ఇవేవీ ఆమెకు సంతృప్తినివ్వలేకపోయాయి. పుట్టి పెరిగిన మట్టిపై ప్రేమ.. ఇంటి చుట్టూ ఉన్న బస్తీ జనాల బతుకుల్లో మార్పు తేవాలనే తపన ఆమెను రాజకీయం వైపు అడుగులేయించాయి. ఇందుకోసం అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్న గద్వాల్ విజయలక్ష్మి హైదరాబాద్ నగర మేయర్‌గా ఎన్నికయ్యారు...తరువాయి

ఆ దుస్తుల్లో ఆటలొద్దన్నారు!
సౌమ్య ఏడో తరగతి చదువుతున్నప్పుడు... ఆమె పరుగులో మెరుపువేగాన్ని గుర్తించాడు కోచ్! భవిష్యత్తులో మంచి పుట్‌బాల్ ప్లేయర్ అవుతుందన్నాడు.. ‘ఆ పొట్టిబట్టల్లో ఆడాలా... వద్దేవద్దు!’ అన్న కుటుంబమే ఆమెలోని ఉత్సాహాన్ని చూసి కాదనలేకపోయింది. ఇప్పుడా ఆ అమ్మాయే పాతిక సంవత్సరాల తర్వాతతరువాయి

పసి వయసుకు తేజో మంత్రం!
ఆరేళ్ల బాలికను చిదిమేసిన మృగాడికి సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది.అలాంటి సంఘటనలను రోజూ ఎక్కడోచోట వింటూనే ఉంటున్నాం. ఎన్నెన్నో చూస్తున్నాం... అలాంటి పరిస్థితులకు అడ్డుకట్ట వేసేందుకు చేస్తోన్న ఓ ప్రయత్నమే తేజో భారత్. ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా బాలలపై లైంగికతరువాయి

వ్యాక్సిన్ లెక్క ఈమె తేలుస్తుంది!
టీకాలను ఎక్కడ భద్రపరిచారు... ఏ ఉష్ణోగ్రత వద్ద దాచిపెట్టారు... టీకా బాగానే ఉందా... పాడైందా? ఇలాంటి కీలకాంశాలను తెలుసుకునేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిందో తెలుగమ్మాయి. ఆమే స్టాట్విగ్ సంస్థ సీఓఓ కొత్త కీర్తిరెడ్డి. ‘ఫోర్బ్స్ అండర్-30’ జాబితాలో చోటు దక్కించుకున్న ఆమె వసుంధరతో ముచ్చటించారు.తరువాయి

ఆటిజం పిల్లలకు ఆన్లైన్ అమ్మ!
‘బడులు ఎప్పుడు తెరుస్తారో.. వీళ్ల అల్లరికి ఎప్పుడు చెక్‌పడుతుందో’ అని అనుకోని అమ్మలు లేరేమో! మామూలు పిల్లల విషయంలోనే తల్లులు ఇంతలా విసిగిపోతే మరి ప్రత్యేక అవసరాలుండే స్పెషల్ కిడ్స్ మాటేంటి? అటువంటి పిల్లల అవసరాలని అర్థం చేసుకుని వారికోసం ఆన్లైన్, వాట్సాప్ తరగతులుతరువాయి

ఎర్రంచు తెల్లచీర!
మామూలుగా అయితే బడ్జెట్ సమయంలో వస్త్రధారణ గురించి జరిగే చర్చ అంతంత మాత్రమే. కానీ ఈసారి ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ కట్టుకున్న చీరపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది. ఆ చీర గురించి అనేక విషయాలు వైరల్ అయ్యాయి. సాధారణంగా కాటన్, కోటా డోరియా, ఇకత్ లాంటి చేనేత చీరలతో కనిపించేతరువాయి

రూపాయి రూపాయి దాచి వందల కోట్ల టర్నోవర్ చేసి...
రాజప్రసాదాన్ని తలపిస్తోన్న ఈ భవనం ఓ పాఠశాల. ఇంతే ఆధునికంగా ఓ బ్యాంకు, కార్యాలయ భవనాలు ఓర్వకల్లు మండలంలో కనిపిస్తాయి. అయితే ఇవన్నీ ఏ కార్పొరేట్ సంస్థలవో అనుకుంటే పొరపాటు. రూపాయి రూపాయి దాచి పొదుపు సంఘం మహిళలు చేసిన అద్భుతమిది... కర్నూలు జిల్లా ఓర్వకల్లు పొదుపు ఐక్య సంఘం సాధించిన విజయగాథ ఇది...తరువాయి

ప్రతిభకు పద్మాల మాల!
అద్భుతమైన గానామృతంతో ఒకరు... అచ్చెరువొందే వ్యాపార మెలకువలతో మరొకరు... మనసుని కదిలించే సేవతో ఇంకొకరు... కళ, సేవ, వ్యాపారం... రంగమేదైనా తమదైన ముద్రతో లక్షలాది మందికి చేరువయ్యారు. శెభాష్ అనిపించుకున్నారు.. ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్న వీరికి తాజాగా ప్రకటించిన పద్మపురస్కారాలు మరింత నిండుదనాన్ని, గౌరవాన్ని తీసుకొచ్చాయి.తరువాయి

షిల్కాను ముందుండి నడిపించి...
ఆధునిక రాడార్లు, డిజిటల్ ఫైర్కంట్రోల్ కంప్యూటర్లతో ఆధునికీకరించిన షిల్కా ఆయుధ వ్యవస్థకు తొలిసారిగా ఓ మహిళ నాయకత్వం వహించడం విశేషం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశసైనికదళానికి చెందిన మహిళా కాంటిజెంట్ కమాండర్ కెప్టెన్ ప్రీతీచౌధురి సైనిక కవాతుకు నేతృత్వం వహించింది.తరువాయి

కాళ్లూ చేతులూ లేకున్నా...ఆల్‌రౌండర్ అయ్యింది
క్యాన్సర్‌తో బాధపడుతూ ఆశలన్నీ ఆవిరై.. మరణం అంచుల్లో ఉన్న వాళ్లకి కూడా నూర్ మాటలు వింటే బతుకు మీద ఆశపుడుతుంది. మరణాన్ని జయించాలన్న తపన మొదలవుతుంది. నూర్ బొమ్మ వేసినా, వయెలిన్ వాయించినా, పాటపాడినా అందులో జీవకళ ప్రవహిస్తుంది. పదిహేడేళ్లకే ఓ అమ్మాయి ఇవన్నీ చేయడం, తన సేవతో తోటివారి మనసులని గెల్చుకోవడం గొప్పే. కానీ పుట్టుకతోనే కాళ్లూ, చేతులూ లేని ఓ అమ్మాయి చేయడం ఇంకా గొప్పవిషయం! కాదంటారా...తరువాయి

ప్రాణాలకు తెగించిన సాహసానికి... రాష్ట్రపతి అవార్డు!
నవంబరు 4, 2018.. విశాఖ జిల్లా రేవుపోలవరం బీచ్‌కు 20మందికిపైగా స్కూల్‌పిల్లలు వచ్చారు. వాళ్లంతా ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఆటల్లో మునిగిపోయారు. అంతలో ఊహించని ఘటన జరిగింది. ఆడుకుంటున్న పిల్లల్లో ఇద్దరు సముద్రపునీటిలో కొట్టుకుపోతూ... సాయం కోసం అరుస్తున్నారు. అక్కడే ఉన్న సాహితి వాళ్లని చూసింది.తరువాయి

... అది నా డీఎన్ఏలోనే ఉంది!
జో, జిల్ బైడన్ల ముద్దుల కూతురు ఆష్లే బైడెన్. తండ్రి అందించిన విలువల వారసత్వాన్ని తాను నిలబెడతానని చెప్పే ఆమె...ప్రచారానికి దూరంగా ఉంటారు. అందుకే జో బైడెన్ ఇతర పిల్లల కంటే ఆష్లే పేరు కాస్త తక్కువగానే వినిపిస్తుంది. అలాగని అసలు ప్రజాజీవితంలో కనిపించదనుకుంటే పొరబాటే. సామాజిక కార్యకర్తగా, ఫ్యాషన్ డిజైనర్‌గా ఆమె వివిధ ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో...తరువాయి

నగరాల భవిష్యత్తు.. ఈమె చెబుతుంది!
మనదేశం చాలా మారాలండీ... మన నగరాలు చాలా అభివృద్ధి చెందాలండీ...ఇతర దేశాల్లో చూడండి... ఎలాంటి మార్పులు వస్తున్నాయో... ఇలాంటి కబుర్లు చాలామంది చెబుతారు. కానీ ఫ్యూచరిస్టులు అలా కాదు... ఏం మారాలో చెబుతారు... ఎలా మారాలో చెబుతారు... అందుకు ఏం చేయాలో కూడా చెబుతారు. ప్రపంచంలో జరుగుతున్న మార్పుల ఆధారంగా జరగబోయే పరిణామాలను అంచనా వేసి సమాజాన్ని సిద్ధం చేస్తారు. ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేస్తారు.తరువాయి

అడయారు అమ్మ!
నెల్లూరు నుంచి వచ్చిన లక్ష్మి ఆసుపత్రిలో బెంచిపై కూర్చుంది. క్యాన్సర్ అని చెప్పి డాక్టర్ ఆమెను అక్కడకు పంపించారు. ఇంతలో ఓ వృద్ధురాలు కారిడార్లోకి వస్తోంది. అందరూ చేతులు జోడించి లేచి నిలబడ్డారు. లక్ష్మి కూడా నుంచుంది. నవ్వుతూ దేవతలా ఉన్న ఆమె... డాక్టర్ వి శాంత. లక్ష్మి తన అనారోగ్యం గురించి ఆమెకు చెప్పింది. ‘భయపడకు... అంతా తగ్గిపోతుంది. ధైర్యంగా ఉండు. డబ్బుల్లేవని బాధపడకు....తరువాయి

అమ్మా మొదటిసారి ఓ జెంటిల్మెన్ని చూశా!
అమెరికా ఉపాధ్యక్షుడు, ఆయన కుటుంబ సభ్యులు ఎలా ఉంటారు? ఆర్భాటంగా, అట్టహాసంగా, అత్యంత భద్రంగా... కానీ ఆమె అలా లేరు. ఓ టీచర్‌గా రోజూ స్కూల్కెళ్లి పాఠాలు చెబుతూ ఉన్నారు. ఎందుకిలా అంటే... ‘నేను టీచర్ కాలేదు... టీచర్‌గా పుట్టాను’ అంటారామె. ఇప్పుడు దేశానికే ప్రథమ మహిళ అయినా ‘నేను ఉపాధ్యాయినిగానే కొనసాగుతా’ అంటున్న జిల్ ఎవరో తెలుసా? అమెరికా అధ్యక్షుడి భార్య జిల్ బైడెన్...తరువాయి

గర్వపడండి...గరిమను చూసి!
అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ బృందంలో ఇప్పటికే కీలకపదవులు అందుకున్న భారతీయుల సరసన గరిమా వర్మ చేరారు. ప్రథమ మహిళ జిల్ బృందంలో డిజిటల్ డైరెక్టర్‌గా కీలక స్థానం అందుకున్నారు. ‘ప్రతి ఉత్పత్తికి, ప్రతి చిత్రానికీ ఓ కథ ఉంటుంది. అది బోలెడంత బాధ్యతనూ, మోయలేనంత బరువునీ కలిగి ఉంటుంది.తరువాయి

తాళి కట్టినా...భార్యనని చెప్పడం లేదు!
నేను, నా సహోద్యోగి ప్రేమించుకున్నాం. దేవుడి పటం ముందు తాళి కట్టాడు. వాళ్ల నాన్న అనారోగ్యం వల్ల కొన్నాళ్లు ఆగి చెబుదామని అన్నాడు. అప్పటి నుంచి ఇద్దరం కలిసే ఉంటున్నాం. ఇది జరిగి ఐదేళ్లవుతోంది. నేను అభద్రతకి గురవుతుండటంతో నేను నిన్ను మోసం చేయడం లేదు కాస్త సమయం పడుతుంది అంటున్నాడు.తరువాయి

ప్రకృతితో కొత్తబాటలు...
తలపండిన రైతులే వ్యవసాయం నష్టం అనుకుంటున్న వేళ....ఓ పక్క కాలేజీకి వెళ్తూనే ప్రకృతి వ్యవసాయం చేసి ఎకరాకు 45 బస్తాలు పండిస్తోంది శ్రీవనిత. ‘ప్రకృతి ఒడిలో’పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి నవతరంలో స్ఫూర్తిని నింపుతున్న ఆమె ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అవార్డుని అందుకోవడం విశేషం...తరువాయి

పిండివంటలతో జీవితాన్ని గెలిచింది!
చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చుంటే తలరాత మారిపోదు. చిన్న దీపాన్నైనా వెలిగించే ప్రయత్నం చేస్తే ఆ వెలుగులో దారి దొరుకుతుంది. ఊళ్లో వ్యవసాయం కలిసి రాలేదు. పిల్లల భవిష్యత్తు, కుటుంబ పరిస్థితులు చక్కబడాలంటే తాను ఓ ఉపాధి మార్గం వెతుక్కోవాలనుకుంది జగిత్యాల జిల్లా భీర్పూర్ గ్రామానికి చెందిన సుహాసిని.తరువాయి

పెళ్లి తర్వాత ఉద్యోగం మానేయాలనుకుంటున్నా...
నా వయసు 25. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నా. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పెళ్లి తర్వాత ఉద్యోగం మానేయాలనుకుంటున్నా. నా స్నేహితుల్లో చాలామంది పెళ్లి, ఉద్యోగం... రెంటినీ బ్యాలెన్స్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతుండటం చూశాక ఈ నిర్ణయానికి వచ్చా. కొన్నాళ్లపాటు బ్రేక్ తీసుకోవడం మంచి ఆలోచనేనా?తరువాయి

పల్లెకు పోదాం.. పంటను చూద్దాం!
ఐఏఎస్‌ల శిక్షణ గురించి తెలుసు... ఐపీఎస్‌లదీ తెలుసు. కానీ గ్రామీణ భారతానికి వెలుగులు తెచ్చే వ్యవసాయ శాస్త్రవేత్తల శిక్షణ గురించి ఎప్పుడైనా విన్నారా? కృత్రిమమేధ, జన్యుపరిజ్ఞానం.. ఈ-మార్కెటింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలను రైతు ముంగిటకు తెచ్చేందుకు నార్మ్(నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్) శాస్త్రవేత్తలకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. ఈసారి శిక్షణ తీసుకున్నవారిలో 16 మంది మహిళా శాస్త్రవేత్తలు ఉండటం విశేషం...తరువాయి

అమ్మ..పిల్లలు..ఓ రోబో!
పిల్లల అవసరాలని అమ్మకంటే బాగా ఎవరు అర్థం చేసుకుంటారు? టెక్నాలజీని అమితంగా ప్రేమించే తన కొడుక్కి పాఠాలు చెబుతున్నప్పుడు డింపుల్ వర్మ మదిలో మెదిలిన ఆలోచనే ‘విజ్రోబో’.. రోబోటిక్ ల్యాబులు, క్లబ్‌లు, కిట్స్ సాయంతో రేపటి తరం పిల్లలకు అవసరం అయిన కృత్రిమమేథ, ఐవోటీ పాఠాలను తేలిగ్గా చెప్పేస్తున్నారీమె...తరువాయి

చెల్లెళ్ల సుసాగు!
ఇంట్లో ఒక్క ఆడపిల్ల ఉంటేనే మహాలక్ష్మి అని మురిసిపోతాం.. మరి దాదాపు వెయ్యిమంది అక్కాచెల్లెళ్లు కలిసి ఉంటే? అవును ఈ ‘చిరుధాన్యాల చెల్లెళ్లు’ రెండువేల ఎకరాల భూమిలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ సంపదని సృష్టిస్తున్నారు.. సుసాగు పేరుతో కొత్త పుంతలు తొక్కుతూ శెభాష్ అనిపించుకుంటున్నారు...తరువాయి

ఫియట్ ఆమె చెబితేనే రైట్ రైట్!
కోఠి ఉమెన్స్ కాలేజీలో బీఏ చదివిన ఆ యువతి... ఇప్పుడు ‘ఫియట్ క్రైష్లర్ ఆటోమొబైల్స్’కి చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. హైదరాబాద్‌లో స్కూల్‌కి నడిచి వెళ్లిన ఆ అమ్మాయి ఫియట్ని ఆధునిక కార్ల తయారీవైపు నడిపిస్తోంది. ఆ సంస్థ అమెరికా, ఆసియా-పసిఫిక్ వ్యవహారాలకు ఆమె రథ సారథి. ఆ అరుదైన ఘనత సాధించిన తెలుగు వనిత... మమత చామర్తి. ఆమె ప్రస్థానమిది..తరువాయి

సంపదల అంకాపూర్ వారి చలవే!
ఈమె పేరు లక్ష్మి ఇరవైఏళ్ల కిందట ఆమె ఎదురుగా రెండే దారులున్నాయి... మొదటిది... భర్త చేసిన రూ.5 లక్షల అప్పుని తీర్చేందుకు ఉన్న భూమినంతా అమ్ముకోవడం.. లేదా ఆ భూమిలోనే బంగారం పండించడం. రెండోదారినే ఎంచుకుందామె. ఆమె శ్రమ వృథాపోలేదు. స్వేదానికి బదులుగా ఆ భూమి సిరులని కురిపించింది. అలా ఒకరిద్దరితో మొదలైన మహిళా వ్యవసాయ విప్లవం ఈ రోజు ఊరుఊరంతా పాకింది.తరువాయి

ఆ తల్లీకూతుళ్లది.. అనంత సంస్కారం
అయిన వాళ్లందరూ ఉంటే చావుకూడా పెళ్లిలా ఘనంగా జరుగుతుంది. మరి ఎవరూలేని అనాథల సంగతేంటి? అలాంటి వారి కోసమే మేమున్నాం అంటున్నారు నెల్లూరుకు చెందిన తల్లీకూతుళ్లు మునిరత్నమ్మ, శ్వేతాపరిమళ. ఉద్యోగబాధ్యతలు, చదువులో క్షణం తీరికలేకపోయినా అనాథల కోసం ఓ ఫౌండేషన్ స్థాపించి ఎవరూ లేనివారికి ఆసరాగా నిలుస్తున్నారు...తరువాయి

మేయర్ ఆర్య!
ఆర్య తండ్రి రాజేంద్రన్ ఎలక్ట్రీషియన్. తల్లి శ్రీలత ఎల్ఐసీ ఏజెంట్. ఆరేళ్ల వయసులోనే కమ్యూనిస్టుపార్టీ ఆధ్వర్యంలో నడిచే ‘బాలసంఘం’లో చేరింది ఆర్య. ఆసియాలోనే అత్యధికమంది బాలలు సభ్యులుగా ఉన్న సంస్థ ఇది. సుమారు పదిలక్షలమంది పిల్లలు ఇందులో సభ్యులుగా ఉన్నారు. పిల్లలని స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఆలోచించేలా చేయడమే ఈ సంస్థ లక్ష్యం. బాల సంఘం ఇచ్చిన శిక్షణ ఆర్యలో స్వతంత్రంగా ఆలోచించే గుణాన్ని పెంచింది.తరువాయి

కళ్లు లేకున్నా.. కాళ్లు లేకున్నా.. కలత లేకుండా!
ఇద్దరు పిల్లలున్న లక్ష్మి బధిరురాలు. తాను సంపాదిస్తేనే ఇల్లు గడిచేది. కానీ వైకల్యం ఉన్న ఆమెకి పని ఎవరు ఇస్తారు? మూర్తి... మూడడుగులు మరుగుజ్జు. దాంతో అతడికి ఎక్కడా పని దొరకలేదు. రంజిత్ మానసిక దివ్యాంగుడు.. కీర్తి చేతులతో ఏ వస్తువునూ సరిగ్గా పట్టుకోలేదు, నడవలేదు.తరువాయి

కోడళ్లు తెచ్చిన సిరి సంపదలు!
కోడళ్ల రాకతో ఇంటికి లక్ష్మీకళ వస్తుందని నమ్ముతారు... కానీ ఈ కోడళ్లు చిరుధాన్యాలతో ఊళ్లకే సిరిసంపదలు తెచ్చిపెట్టారు. అంతరించిపోతున్న పల్లె సంపదలను భద్రపరిచి జీవవైవిధ్యానికి ప్రాణం పోస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని 23 గ్రామాలకు చెందిన 700 మంది కోడళ్లు సాధించిన విజయాలు చాలా ఉన్నాయి...తరువాయి

కూరగాయల తోటల్లో... శ్రీ మహాలక్ష్ములు
ఒక ఊళ్లో కూరగాయలు పండించడం మనకు తెలుసు. కానీ ఒక ఊరే కూరగాయల తోటగా మారితే... అది రామభద్రపురం. విజయనగరం జిల్లాలోని ఈ గ్రామానికి ఇంతటి ప్రత్యేకత తెచ్చిపెట్టింది అక్కడి మహిళలే. ఆ ఊళ్లోని దాదాపు ప్రతి గడపనుంచి కూరగాయలు పండించే మహిళలు కనిపిస్తారు. వీళ్లే గ్రామానికితరువాయి

ఆ పరిశోధనలకు మేమే ఆయువుపట్టు!
ఔషధాలు, వ్యాక్సిన్ల అభివృద్ధికి విస్తృతస్థాయి పరిశోధనలు జరగాలి. అందుకు వివిధ వ్యాధులకు సంబంధించిన ‘జీవ నమూనాలు’ కావాలి. భారత్‌లో వాటిని సేకరించే బయో బ్యాంకు ఒక్కటీ లేదని గుర్తించిన శాస్త్రవేత్త జుగ్నూ జైన్... అమెరికా వదిలి హైదరాబాద్‌లో మొదటి బయో బ్యాంక్‌ను ప్రారంభించారు. క్యాన్సర్ మొదలు కరోనా వరకూ ఎన్నో వ్యాధుల పరిశోధనలకు ఈమె ప్రారంభించిన ‘సేపియన్ బయోసైన్సెస్’ కీలకంగా నిలుస్తోంది.తరువాయి

కొడుకులాంటి కూతురి కథ!
ఆ ఆటో డ్రైవర్‌ను చూస్తే అబ్బాయే అనుకుంటారు. మాట్లాడితేగానీ అర్థంకాదు... అతడు కాదు ఆమె అని. ఆమె ఆటో డ్రైవర్‌గా బతకడం వెనక, ఆహార్యం మార్చుకుని ఉండడం వెనక ఓ బాధ్యత ఉంది. అసాధారణ బతుకు పోరాటం ఉంది. ‘ఎందుకు బిడ్డా ఇక్కడ కష్టంగా ఉంది, నువ్వు అక్కడే ఉండకపోయావా’... ఇది ఓ తండ్రి కూతురితో అన్న మాటలు.తరువాయి

కన్నీళ్లు నింపిన నేలలోనే.. సిరులని పండిస్తోంది!
భర్త.. మామ..మరిది.. సాగు మిగిల్చిన కష్టాల కారణంగా ఆరేళ్ల వ్యవధిలో ఇంట్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. మరో ఒంటరి స్త్రీ అయితే ఆ పరిస్థితుల నుంచి పారిపోయేదే! జ్యోతి అలా చేయలేదు. కన్నీళ్లు నింపిన నేలలోనే సిరులని పండించింది. ఆదర్శరైతుగా నిలిచి... ఎంతోమంది ఒంటరి స్త్రీలల్లో స్ఫూర్తినీ, రైతుల్లో ధైర్యాన్నీ నింపుతోంది...తరువాయి

వైరస్‌లను పసిగట్టేలా... వ్యాధుల పనిపట్టేలా!
వాతావరణ కాలుష్యం, బ్యాక్టీరియా, వైరస్‌లను మనం ధరించే దుస్తులే ముందుగా పసిగడితే... వాటిని నిరోధిస్తే..! ఇప్పుడు అలాంటి వస్త్రానికి రూపకల్పన చేసింది హైదరాబాద్‌కు చెందిన దీప్తి నత్తల. వ్యాధి నిరోధకశక్తి ఉండే వస్త్రాన్ని రూపొందించి శభాష్ అనిపించుకుంది.తరువాయి

అయినవారు పొమ్మన్నా... అందరి బంధువైంది!
రద్దీగా ఉండే ఓ బస్టాండు.. సమీపంలో చిరిగిన దుస్తులతో స్పృహ లేని స్థితిలో ఓ వ్యక్తి... ఓ రైల్వేస్టేషన్ సమీపంలో బురద మధ్య ఒళ్లంతా గాయాలతో కదల్లేని స్థితిలో ఒక వృద్ధుడు... మరో చోట మానసిక స్థితి సరిగ్గాలేని దివ్యాంగురాలు... ఆ పక్క నుంచి నడిచివెళ్లేవారే తప్ప ఏ ఒక్కరూ ఆ వైపు అడుగులేయలేదు. అయితే 24 ఏళ్ల మనీషా మాత్రం అక్కడికెళు తుంది. దిక్కులేకుండా పడి ఉన్న ఆ అనాథలను దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంటుంది. వారికి ఆహారాన్ని అందించి పునరావాసకేంద్రానికి తరలిస్తుంది....తరువాయి

ఏడు కోట్ల మంది మెచ్చిన డిజిటల్ టీచరమ్మ!
ఆ టీచరమ్మ వయసు 21... కాలేజీ విద్యార్థుల దగ్గర ఆరిందాలా కనిపించేందుకు చీరకట్టుకుని వెళ్లి మరీ క్లాస్చెప్పింది.. ఏదో సరదాకి చెప్పిన ఆ క్లాస్ ఆమె జీవితాన్ని ఎంతగా మార్చేసిందంటే ఇండియాలోని టాప్-100 ధనిక కుటుంబాల్లో ఆమె కుటుంబాన్ని కూడా చేర్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎడ్యుటెక్ కంపెనీకి డైరెక్టర్ని చేసింది.. ఆమె మరెవరో కాదు ‘బైజూస్ లెర్నింగ్ యాప్’కి కో-ఫౌండర్ అయిన దివ్యగోకుల్‌నాథ్... విద్యార్థుల మనసుకు హత్తుకుపోయేలా పాఠాలు చెప్పే టీచరమ్మ ఆమె. మరోవైపు ఇరవైరెండువేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని విస్తరించి ఫోర్బ్స్, ఫార్చ్యూన్ వంటితరువాయి

వారి ఆలోచనే నన్ను బతికించింది!
ఎదుటివారికి మన గురించి చెప్పేటప్పుడు గతంలో చేదు జ్ఞాపకాలు ఉంటే వాటిని అలాగే మనసు పొరల్లో పాతరేసి తక్కిన విషయాల గురించి మాత్రమే చెబుతాం. కానీ అవని అలా చేయలేదు. తన కథని అలాగే చెప్పడానికి ఇష్టపడుతుంది..అంతేకాదు ఎంతోమంది బాలికలకు, యువతులకు ధైర్యం నూరిపోస్తుంది. తన జీవితాన్నే పాఠాలుగా మార్చి బోధిస్తోంది. సామాజిక సమస్యలను ఎదుర్కొనే సైనికులుగా మారుస్తోంది...తరువాయి

అప్పుడు... అమెరికన్లా మారిపోవాలనుకున్నా!
పసివయసులో ఎదుర్కొన్న వివక్ష ఎదిగేకొద్దీ ఆ అమ్మాయిలో పరిణతి తెచ్చిపెట్టింది. చదువుల్లో ప్రతిభ చూపుతూనే...మరొపక్క అలాంటి వివక్ష మరెవరూ ఎదుర్కోకూడదని నడుం కట్టింది. స్వచ్ఛంద సంస్థలతో కలిసి అడుగులు వేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది.ఆమె వేసిన అడుగులే ఈ రోజు ప్రతిష్ఠాత్మక ‘రోడ్స్’ అందించే ఉపకార వేతనాన్ని అందుకునేలా చేశాయి....తరువాయి

వ్యాధికారక కణాలపై దేవి రణం
కొత్తగూడెంలో స్కూల్‌కి వెళ్లే దారిలో కుష్టు, పోలియో వ్యాధిగ్రస్తుల్ని చూసి చలించిపోయిన ఓ అమ్మాయి... ఆ వ్యాధులకు కారణమేంటో తెలుసుకుని నివారించాలనీ, వారిలా ఇంకెవరూ బాధ పడకూడదనీ గట్టిగా నిర్ణయించుకుంది. పెద్దయ్యాకా తన లక్ష్యాన్ని మర్చిపోకుండా శాస్త్రవేత్త అయ్యింది. ఆ దిశగా ఎన్నో పరిశోధనలూ చేసింది...తరువాయి

అనాథ పిల్లలతో ఆటలు.. ప్రిన్స్ ఛార్సెస్తో మాటలు!
‘వోగ్’ కవర్‌పేజీపై అందంగా ఒదిగిపోయినా.. ప్రిన్స్ ఛార్లెస్‌తో కలిసి భోజనం చేసినా.. అదంతా సేవలో భాగంగానే అంటుంది నటాషా పూనావాలా. వ్యాక్సిన్ తయారీరంగంలో అగ్రగామి సంస్థ ‘సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ బాధ్యతల్లో కీలకంగా వ్యవహరించడంతోపాటూ... ‘విల్లూ పూనావాలా ఫౌండేషన్’ వేదికగా సేవారంగంలో తనదైన ముద్ర వేస్తోందీ బహుముఖ ప్రజ్ఞాశాలి. ...తరువాయి

ఆ సాహసం చేసింది ఐష్ కాదు... నేనే!
అప్పటికే అంత ఎత్తైన కొండలమీద నుంచి కింద ఉన్న నీటి ప్రవాహంలోకి 13 సార్లు దూకింది సనోబార్. మరొకరైతే అంతెత్తు నుంచి కిందకు చూడ్డానికే భయపడతారు. ఆమెకి మాత్రం ఇదో సాధారణ విషయం. ఎందుకంటే ఆమె వృత్తే సాహసాలు చేయడం కాబట్టి. స్టంట్ ఉమెన్ సనోబార్ ‘విలన్’ సినిమాలో ఐశ్వర్యారాయ్ కోసం చేసిన సాహసం ఇది....తరువాయి

అమ్మకు అన్నీ చెబుతుంది!
అమ్మ కడుపులో పడ్డ నలుసుకి అడుగడుగునా గండాలే! నగరాల్లో, పట్టణాల్లో ఉన్న తల్లులకు ఈ గండాలు దాటడం కాస్తయినా తేలికవుతుందేమోకానీ... పల్లెలూ, గిరిజనప్రాంతాల్లో ఉండేవారి పరిస్థితి ఏంటి? అలాంటి వారిని కూడా ఈ తొమ్మిది నెలల ప్రయాణాన్ని సునాయాసంగా దాటించాలన్న ఓ మహిళ ప్రయత్నానికి ప్రతిరూపమే ‘క్రియ’.తరువాయి

లక్ష్మీనివాసం... ఇలా ఉంటుంది!
‘మా నట్టింట అడుగు పెట్టమ్మా’ అంటూ అందరూ ఆమెను ఆహ్వానిస్తారు... ‘నీ కడగంటి చూపు చాలు మాకు’ అంటూ ఆమె అనుగ్రహం కోసం పరితపిస్తారు... ‘మా ఇంట సిరులు పొంగించవమ్మా’ అని అందరూ ఆమెను ప్రార్థిస్తారు... ‘నువ్వు కాలుపెట్టిన నేల బంగారమాయెగా’ అంటూ పాటలు కట్టి పాడుకుంటారు. కానీ ఆమె మాత్రం ‘నేను రావాలంటే’... అని షరతులు పెడుతుంది... ‘నేను కొలువుండాలంటే’... నిబంధనలు వర్తిస్తాయంటుంది. ధనం, ధాన్యం, సంతానం, ఆరోగ్యం, విద్య, సంస్కారం... అన్నిట్లో తానున్నానంటుంది... అన్నీ తానై ఉన్నానంటుంది... ఇంతకీ ఆమె ఎవరు? ఎక్కడుంటుంది?...తరువాయి

యువరాణి మెచ్చింది... మా సైట్ క్రాష్ అయ్యింది!
ముంబయిలో పుట్టి పెరిగిన అనితా డోంగ్రే... అదే నగరం నుంచి కార్పొరేట్, వ్యాపార, సినీ రంగాల్లో రాణిస్తున్న మహిళల గురించి విన్నప్పుడల్లా తానూ వాళ్లలా ఎందుకు కాకూడదనుకునేది. కానీ, అంతలోనే ఆమెకు తన కుటుంబం గుర్తొచ్చేది. సింధీ మహిళలు బయటకు వెళ్లి పనిచేసే సంప్రదాయం లేదు. కానీ అనిత ఆకాంక్ష ముందు ఆ ఆంక్షలు నిలువలేకపోయాయి.తరువాయి

అమ్మాయిలూ.... ఐఎఫ్ఎస్... మీరూ చెప్పొచ్చు ఎస్!
దట్టమైన అడవుల్లో తిరగాలి... శారీరక శ్రమ ఎక్కువ! ఇంకో ప్రయత్నం చేస్తే ఐపీఎస్ కొట్టేస్తావ్ అంటూ చాలా మంది సలహాలు ఇచ్చారు. అయినా తనకిష్టమైన ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) శిక్షణని ఎన్నో సవాళ్ల మధ్య పూర్తిచేసుకుంది మహారాష్ట్ర క్యాడర్‌కి చెందిన శ్వేతా బొడ్ఢు శిక్షణలో తాను చేసిన సాహసాలని ట్విటర్లో పోస్టుచేయడంతో అవి వైరల్‌గా మారి ఎంతోమంది అమ్మాయిల్లో స్ఫూర్తిని నింపుతున్నాయి. ఈ సందర్భంగా ఆమెతో ‘వసుంధర‘ మాట్లాడింది..తరువాయి

శ్యామల కూతురు... అలా పిలిస్తేనే ఇష్టం!
ఇడ్లీ సాంబార్, కొమ్ముసెనగల కూర... ఆమెకిష్టమైన వంటకాలు పనైతే కొబ్బరికాయ కొట్టడం ఆమెలోని ఆధ్యాత్మిక కోణం... ‘నాయకత్వం ఒకరిస్తే తీసుకునేది కాదు.. దానికి అనుమతులు అవసరం లేదు’.. ఇది ఆమె నైజం. ఇవన్నీ ఎవరి గురించి అనుకుంటున్నారా? అమెరికా ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలిగా విజయపతాకాన్ని ఎగరేసిన కమలాదేవిహ్యారిస్ గురించే....తరువాయి

తినలేని మిఠాయిలు కాల్చలేని టపాసులు!
దీపావళి అంటే టపాకాయలు.. స్వీట్లే గుర్తుకొస్తాయి కదా! శ్వేతభట్టాడ్ కూడా టపాకాయలు, స్వీట్లు తయారుచేసి దేశమంతా అందిస్తోంది. కాకపోతే ఆమె చేసే మిఠాయిలని తినలేం... టపాకాయలని కాల్చలేం. పెరుగుతున్న పర్యావరణ సమస్యలని దృష్టిలో పెట్టుకుని శ్వేత చేసిన ఆ టపాకాయల గురించి మీకూ తెలుసుకోవాలని ఉందా...తరువాయి

పల్లె బాలికల కోసం... పట్నం మిత్రులు!
వాళ్లంతా తమ చిట్టిచిట్టి చేతులతో కేకులు చేశారు, బొమ్మలు గీశారు. అంతేకాదు, మారథాన్లలో పాల్గొని పరుగులూ తీశారు. ఇవన్నీ చేసి కొంత డబ్బు పోగేశారు. అయితే, ఆ డబ్బు వాళ్లకోసం కాదు! పల్లెల్లో సదుపాయాల్లేక ఇబ్బంది పడుతున్న తమలాంటి బాలికలకోసం. చంద్రిక కనుమూరి ప్రారంభించిన ‘బాలమిత్ర’ సంస్థ ఇందుకు వేదికగా నిలుస్తోంది.తరువాయి

అతివలు మెచ్చే ఆరణి!
సందెపొద్దు అందాలున్న ఆరణి పట్టు చీరను మీరు కట్టుకుంటే.. ‘ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే’ అని ఎవరైనా ఆనందంగా పాడాల్సిందే. ఇక చీరలపైపరుచుకున్న వర్ణాలు.. ‘సొగసు చూడతరమా’అనిపించక మానవు.లేత గోధుమ రంగు ఆరణి పట్టు చీరపై ప్రకాశవంతమైన వర్ణాల్లో పెద్ద పెద్ద గళ్లు... టెంపుల్ బార్డర్... పసిడి కొంగు, అంచూ భలే ఉన్నాయి.తరువాయి

విడాకులు తీసుకున్నా... ఆర్థిక సాయం పొందొచ్చా?
నాకు పన్నెండేళ్ల కిందట పెళ్లైంది. మంచి సంబంధమని పద్దెనిమిదేళ్లకే పెళ్లి చేశారు. అత్తింటివారు పెట్టే హింసలు భరించలేక పుట్టింటికి వచ్చేశాను. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు. పెద్దల సమక్షంలో పరస్పర అంగీకారంతో విడిపోయాం. చిన్న ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్నాను.తరువాయి

ఔషధ మొక్కలపై వైద్యులకే పాఠాలు చెబుతోంది!
అడవిలో అడుగుపెడితే.. ఏ మొక్క గొప్పతనం ఏంటో పొల్లుపోకుండా చెప్పేంత నేర్పరి! వంశపారంపర్యంగా అందిన ఔషధమొక్కల రహస్యాలను, ప్రకృతి వైద్యవిద్యను తోటిమహిళలకు నేర్పిస్తూ దేశవ్యాప్తంగా వేలాది మహిళలను ఉపాధి బాటపట్టిస్తోంది. అరోవిలే సంస్థలో హెర్బలిస్ట్‌గా పనిచేస్తూ వేలాదిమందికి ఔషధమొక్కలపై అవగాహన కలిగిస్తోంది పార్వతీ నాగరాజ్...తరువాయి

కాంతలు మెచ్చే కంచిపట్టు
‘నీలిరంగు చీరలోన.. సందమామ నీవే జానా..’ అనేలా మెరిసిపోవాలనుకుంటున్నారా... ‘ప్రకృతికాంతకు ఎన్నెన్ని హొయలో...’ అన్నట్టుగా పచ్చందాన్ని ఒంటినిండా పరచుకుని కనువిందు చేయాలనుకుంటున్నారా... అయితే ఇంకెందుకాలస్యం.. దసరా సరదాను రెట్టింపు చేసే ఈ కంచిపట్టు చీరలను అందంగా కట్టేసుకోండి మరి.తరువాయి

నాలాల చుట్టూ ఏడాది తిరిగా!
‘ఈ నగరానికి ఏమైంది..?’ ప్రస్తుతం మనముందున్న ప్రశ్న. ఇప్పుడు కాదు... ఆరేళ్ల కిందటే వరదలు వస్తే ‘భాగ్యనగరానికి ఏమవుతుంది’ అని ఆలోచించారామె. అప్పట్నుంచీ పర్యావరణ మార్పుల కారణంగా నగరాలని ముంచెత్తనున్న అధిక వర్షాలు, వరద నిర్వహణవంటి అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు స్వాతి వేముల. ఏడాది క్రితమే ఈ వరద విపత్తుని అంచనా వేసిన స్వాతి... భవిష్యత్తులో జడివానల ప్రభావం నుంచి నగరాన్ని కాపాడుకునేందుకు సూచనలూ చేస్తున్నారు.తరువాయి

‘సకినాల సావిత్రమ్మ’ అంటారంతా!
సకినాలు చేసినా... సర్వపిండి వండినా వాటిల్లో ఉప్పూ, కారంతో పాటూ కాస్తంత ఆప్యాయతను కూడా కలుపుతారేమో ఆమె. అందుకే ఆ పిండివంటలని తిన్నవాళ్లంతా ఆమెని ‘సకినాల సావిత్రమ్మ’ అంటారు ఇష్టంగా! ఆమె దగ్గర పనిచేసేవాళ్లైతే ‘పెద్దమ్మ’ అని ఆప్యాయంగా పిలుస్తారు... హైదరాబాద్‌కు చెందిన డెబ్భై ఆరేళ్ల వంగపల్లి సావిత్రమ్మ చేసే పిండి వంటకాలకు సామాన్యుల నుంచి వీఐపీల వరకూ ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే...తరువాయి

గింత ఫేమస్ అయితననుకోలేదు
గంగవ్వ.. ఇప్పుడీ పేరు మారుమోగుతోంది. మనింట్లో అవ్వ లెక్కనో.. లేదా బాగా తెలిసిన మనిషిలెక్కనో అందరి మనసుల్ని చూరగొంటోంది. మాటల్లో చెప్పలేని అభిమానాన్ని అందుకుంటోంది. ఆరు పదుల వయసులోనూ తన నటనతో ఆకట్టుకుంటోంది. మారుమూల పల్లె నుంచి జాతీయస్థాయి వరకు యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు పొందింది. ఇటీవలే బిగ్‌బాస్ షో నుంచి బయటకొచ్చిన గంగవ్వ అంతరంగం ఆమె మాటల్లోనే.....తరువాయి

పుస్తకాలే పూల కుండీలు!
చెట్ల నుంచి కాగితం తయారుచేస్తారు. ఆ కాగితాలతో పుస్తకాలను తయారుచేస్తారని తెలుసు. అయితే పుస్తకాల్లో మొలిచిన మొక్కలని ఎప్పుడైనా చూశారా? నిజంగానే ఇప్పుడు పుస్తకాల్లోనూ మొక్కలు మొలకెత్తుతున్నాయి. మీ ఇంట్లో పెద్ద పరిమాణంలో ఉండి చాలా ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న పుస్తకాలను తీసుకోండి.తరువాయి

అంతా నాకు పొగరనుకుంటున్నారు!
నేనో కార్పొరేట్ సంస్థలో కొన్నేళ్లుగా పనిచేస్తున్నా. నా బాధ్యతల్ని వందశాతం పక్కాగా పూర్తిచేస్తా. కానీ, కొన్నిసార్లు చిన్న విషయాలకు కూడా అసహనానికి గురవుతున్నా. దీంతో నా బాస్, సహోద్యోగులు నా భవిష్యత్తు బాగుండాలంటే ఆ లక్షణాలతో పాటు నా అహంకారాన్నీ పక్కన పెట్టమని సూచిస్తున్నారు. ఇప్పటి వరకు ఇదంతా నా సహజ స్వభావంగా భావించా. నిజానికి నేను ఎవరికీి శత్రువు కాదు. నేను నా వైఖరిని ఎలా మార్చుకోవాలో తెలుపగలరు.తరువాయి

టీనేజీలో బాధలా?
టీనేజీ వయసు అనగానే...అందరికీ సరదాలూ, సంతోషాలే కనిపిస్తాయి. కానీ ఈ వయసులో అమ్మాయిలకు బోలెడు ఒత్తిళ్లూ ఉంటాయంటారు మానసిక నిపుణులు. అవి చదువూ, కుటుంబం, ఆర్థిక పరిస్థితులూ, అందం, ప్రేమ...ఇలా చాలానే ఉంటాయి. దాన్నుంచి త్వరగా బయటపడలేకపోతే క్రమంగా కుంగుబాటుకీ గురవ్వొచ్ఛు మరి దీని బారిన పడకూడదంటే...తరువాయి

నింగి, నేల, నీటిపైన... పోరాటానికి సై!
కదనరంగంలోకి దూకాలంటే... ధైర్యమొక్కటే సరిపోదు యుద్ధతంత్రంకూడా తెలిసుండాలి, శత్రువు ఆనుపానులూ తెలియాలి. ఇప్పుడదే పనిలో శిక్షణ పొందారు కుముదినీ త్యాగీ, రితీ సింగ్. శత్రుదేశ జలాంతర్గాములని అంతమొందించేందుకు మల్టీరోల్ హెలీకాప్టర్లలోవ్యూహకర్తలుగా శిక్షణ తీసుకున్న తొలి మహిళలుగా చరిత్ర సృష్టించారు.తరువాయి

ఈ ఊరు పట్టు పట్టింది
ఏ ఊర్లోనైనా రైతులంటే మగవాళ్లే గుర్తుకు వస్తారు... అక్కడ మాత్రం సింగులు పైకి చెక్కుకుని శ్రమించే మహిళలే మదిలో మెదులుతారు... వరి, మిరప, పత్తి.. ఎక్కడైనా ఈ పంటలే బతుకుదెరువు! ఆ పల్లెలో పట్టుపరిశ్రమే వారి జీవితాలను సాకుతోంది... మగవారు సైతం ఆ మహిళా రైతులతో పోటీ పడాలంటే భయపడతారుతరువాయి

వారు కోట్లు సంపాదించారు నేను కోట కడుతున్నాను!
ఆడపిల్లయినా అమ్మ,నాన్న బాగా చదివించారు... ఆ చదువునే ఆయుధంగా చేసుకున్న ఆమె ఇప్పుడు దేశ ఆయుధ రంగానికి చుక్కానిగా నిలుస్తోంది. రక్షణ శాఖలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఆయుధ భూషణ్’ అవార్డును దక్కించుకొని స్త్రీలు ఏ రంగంలోనైనా ప్రగతి సాధించగలరని నిరూపించిన సుజాత విజయ గాథ ఆమె.. మాటల్లోనే...!తరువాయి

సబలా సాహో
వారు గెలిచారు... అంతులేని శ్రమతో... తరగని చిత్తశుద్ధితో... వారు నిలిచారు తమ రంగంలో మేటిగా... అందరికీ స్ఫూర్తిగా... కలం పట్టినా, హలం పట్టినా, సేవ చేసినా ఉద్యోగం చేసినా, వాణిజ్యంలో రాణించినా, పరిశ్రమలు స్థాపించినా, వారికి వారేసాటి... ఇది ‘ఈనాడు- వసుంధర’ విజేతల ప్రస్థానం. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు... ఆహ్లాదకరమైన సంగీత విభావరి... శాంత స్వరూపులైన అమ్మలు.. దుష్టశిక్షణలో శక్తి స్వరూపిణులుగా మారి.. దుర్మార్గులు, అసురులను అంతమొందించిన పురాణ ప్రదర్శనలు...సాధారణ వ్యక్తుల్లా జీవన ప్రయాణాన్ని ప్రారంభించి అసాధారణ విజయాలను సాధించి స్ఫూర్తిగా నిలుస్తున్న లబ్ధప్రతిష్టులు......తరువాయి

వీరు బొమ్మలకు అమ్మలు!
అందమైన బొమ్మలు.. ఆకట్టుకునే టెడ్డీబేర్లు... ఎనభై దేశాలకు ఎగుమతి అవుతున్నాయి... వందల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి... చూపరులను మురిపిస్తూ.. చిన్నారులకు నేస్తాలవుతున్న అలాంటి బొమ్మలు మన కాకినాడలోనూ తయారవుతున్నాయి... వాటికి రూపం ఇచ్చే దగ్గర్నుంచి, ప్యాకింగ్‌కి ముస్తాబు చేసేదాకా ఈ అందమైన బొమ్మలకు ప్రాణం పోస్తోంది అంతా అతివలే.తరువాయి

ఇద్దరూ ఇద్దరే... మరి సర్దరే?
అక్క నా చాక్లెట్ మొత్తం తినేసింది చూడమ్మా... అని ఓ చెల్లెలు ఫిర్యాదు చేస్తే... మరి నాన్న తెచ్చిన కేక్ మొత్తం నువ్వు ఒక్కదానివే తిన్నప్పుడో... వెంటనే దీర్ఘాలు తీస్తుంది అక్క. అన్నయ్య నా పెన్సిల్ విరగొట్డాడని తమ్ముడు అంటే, తమ్ముడే తన నోట్‌బుక్ చింపేశాడని అన్నయ్య వాదిస్తాడు...తరువాయి

ఆ గోడ.. మీ గోడు వింటుంది!
నెలసరి బాధల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! ఆ సమయంలో కొందరు పొత్తికడుపులో సూదులు గుచ్చినట్టుగా ఉండే నొప్పితో మెలికలు తిరిగిపోతారు. విపరీతమైన నడుంనొప్పి, ఆపైన కాళ్లు గుంజేయడంతో పనులు చేసే శక్తిలేక నీరసంతో కూలబడిపోతుంటారు మరికొందరు. నిజానికి ఈ నొప్పులతో కొందరు ప్రతినెలాతరువాయి

అలాంటి వ్యక్తిని ప్రేమించకండి!
ఒక్కోసారి ప్రేమావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాంతం చేదు అనుభవాలనే మిగులుస్తాయి అంటూ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన మనసులోని మాటను వెల్లడించింది బాలీవుడ్ నటి నీనాగుప్తా. ‘పెళ్లైనవారితో ప్రేమలో పడకండి. అలాచేసి నేనెంతో బాధపడ్డాను. పెళ్లైన వ్యక్తిని ప్రేమించి, ఆ తర్వాత భార్యకు విడాకులు ఇవ్వమంటేతరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- వధువులూ.. ఈ పొరపాట్లు చేయకండి!
- జుట్టు రాలిపోతోందా? ఇవి ట్రై చేయండి..!
- వ్యర్థాలతో అందానికి అనర్థం...
- చీరలపై.. 64 గళ్ల సందడి
- పెళ్లి వేళ.. పాదాలూ మెరవాలంటే..!
ఆరోగ్యమస్తు
- నెల తప్పాక బ్లీడింగ్.. ఎందుకిలా?
- రోగనిరోధకత పెంచేద్దాం!
- ఆరోగ్యం కోసం.. ఈ మార్నింగ్ స్మూతీ!
- తెల్లజుట్టును స్వీకరిద్దామిలా..
- Weight Issues: ఉన్నట్లుండి బరువు పెరగడానికి, తగ్గడానికి కారణాలేంటి?
అనుబంధం
- బంధంలోనూ కొత్త కావాలి!
- Kajol: ‘అమ్మా నిన్ను మిస్సవుతున్నాం..’ అని ఎప్పుడూ అనలేదు!
- దాన్నీ.. చూడముచ్చటగా!
- చదువుపై అనాసక్తి...
- పరిపూర్ణతకి ప్రయత్నిస్తున్నారా?
యూత్ కార్నర్
- ఆమె లక్ష్యం అంతరిక్షం
- ఆ అమ్మాయి శ్రమకు లక్షల వీక్షణలు
- Raksha Bandhan: అదే ఈ తోబుట్టువుల ప్రత్యేకత!
- పట్టుపట్టారు... ఇలా సాధించారు!
- Raksha Bandhan: ‘రాఖీ’ రూపు మారుతోంది!
'స్వీట్' హోం
- వర్షాకాలంలో వెండి ఆభరణాలు పదిలమిలా..!
- స్టడీ టేబుల్ కోసం...
- ప్రేమ.. పర్యావరణహితంగా..
- శ్రావణ పౌర్ణమి.. అందుకే ఎంతో పవిత్రం!
- బనారసీ దుస్తుల్ని ఎలా భద్రపరుస్తున్నారు?
వర్క్ & లైఫ్
- సమస్యేదైనా సరే.. ‘ఆత్మహత్యే’ పరిష్కారం కాదు..!
- NASA: కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత.. తనేనా?
- Raksha Bandhan: ‘లుంబా రాఖీ’.. దీనిని ఎవరికి కడతారో తెలుసా?
- Harnaaz Sandhu: ఆడవాళ్ల బరువు విషయంలో మీకెందుకంత ఆసక్తి?!
- అసూయను తరిమేద్దాం...