close

ప్రధానాంశాలు

గాయంపై గబ్బర్‌ ‘ట్వీటు’ దాడి!

ముంబయి: ఐసీసీ టోర్నీ అంటే చాలు టీమిండియా ఓపెనర్‌ శిఖర్ ధావన్‌ చిచ్చర పిడుగులా చెలరేగిపోతాడు. అర్ధశతకాలు, శతకాలు బాదేస్తాడు. జట్టు విజయాల్లో కీలకంగా నిలుస్తాడు. ప్రస్తుత ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లోనూ అంతే. ఆస్ట్రేలియాపై అద్భుత శతకం సాధించాడు. వేలు నొప్పిని సహిస్తూ అతడు పరుగులు చేశాడని తెలిసిన తర్వాత అభిమానులు మరింత ఫిదా అయ్యారు. వేలు లోపల చీలిక వచ్చినట్టు స్కానింగ్‌లో తేలడంతో గబ్బర్‌కు మూడు వారాల కనీస విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో అతడు న్యూజిలాండ్‌, పాక్‌, అఫ్గాన్‌ మ్యాచుల్లో ఆడే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ధావన్‌ చేసిన ఓ ట్వీట్‌ ఆకట్టుకుంటోంది. డాక్టర్‌ రహత్‌ ఇందోరీ రాసిన  ఓ పద్యాన్ని పోస్టు చేసి తన ఉద్దేశమేంటో పరోక్షంగా వెల్లడించాడు.

‘రెక్కలతో ఎగరడం లేదు..
మా గుండె లోతుల్లోని నమ్మకం,

ఆత్మవిశ్వాసంతో ఎగురుతున్నాం’ అనే అర్థం వచ్చేలా ఆ పద్యం ఉంది. దీనిని బట్టి అతడు గాయం నుంచి కోలుకొని వచ్చాక పరుగుల వరద పారించడం ఖాయమే అనిపిస్తోంది. ఇలాంటి చిన్నచిన్న గాయాలు తన నమ్మకాన్ని సడలించలేవని చెప్పకనే చెప్తున్నాడు. గబ్బర్‌ పట్టుదల గురించి అందరికీ తెలిసిందే. గాయపడ్డ అతడి స్థానంలో యువ ఆటగాడు రిషభ్‌పంత్‌ ఇంగ్లాండ్‌కు వెళ్తాడని సమాచారం. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. గురువారం టీమిండియా న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది.



మరిన్ని

నేటి మ్యాచులు

ఆస్ట్రేలియా

VS

బంగ్లాదేశ్

సమయం : మ 03:00 గం

వేదిక : ట్రెంట్‌ బ్రిడ్జ్‌

దేవతార్చన

రుచులు

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net