close

ప్రధానాంశాలు

ఆమిర్‌ అదుర్స్‌: ఆస్ట్రేలియా 307 ఆలౌట్‌

టాంటన్‌: పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అంటే ఇంతే మరి! ఎప్పుడు ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేం. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ సైతం అందుకు మినహాయింపేమీ కాదు. పేలవ ఫీల్డింగ్‌, నేలు పాలు చేసిన క్యాచులు, చెత్త బౌలింగ్‌తో ఆస్ట్రేలియాకు మొదట ఉదారంగా పరుగులు ఇచ్చింది. 34 ఓవర్లకు 223/2తో నిలిపింది. ఇక ఆసీస్‌ 370కి పైగా స్కోరు చేయడం ఖాయమే అనిపించిన వేళ అద్భుతం చేసింది. కేవలం 84 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు తీసింది. మరో ఓవర్‌ ఉండగానే కంగారూలను 307కు ఆలౌట్‌ చేసింది. మహ్మద్‌ ఆమిర్‌ (10-2-30-5) అంతర్జాతీయ కెరీర్‌లో తొలిసారి 5 వికెట్ల ఘనత సాధించాడు. తొలి మూడు ఓవర్లలో రెండు మెయిడిన్‌ చేసి 1 పరుగే ఇచ్చిన అతడు మ్యాచ్‌ను పాక్‌ వైపు మలుపు తిప్పాడు.

ఆసీస్‌లో ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (107; 111 బంతుల్లో 11×4, 1×6) శతక బాదాడు. అతడికి తోడుగా మరో ఓపెనర్‌ ఆరోన్‌ ఫించ్‌(82; 84 బంతుల్లో 6×4, 4×6) విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 146 పరుగులు జోడించారు.  స్మిత్‌ (10)తో కలిసి వార్నర్‌ రెండో వికెట్‌కు 43 పరుగుల భాగస్వామ్యం అందించాడు. వారి ఆట చూసి స్కోరు ఎక్కడికో వెళ్తుందని భావించారు. అయితే మాక్స్‌వెల్‌ (20; 10 బంతుల్లో 2×4, 1×6), షాన్‌మార్ష్‌ (23; 26 బంతుల్లో 2×4), ఉస్మాన్‌ ఖవాజా (18; 16 బంతుల్లో 3×4), అలెక్స్‌ కారె (20; 21 బంతుల్లో 2×4) ఆశించిన రీతిలో భారీ స్కోరు సాధించలేదు. వెంటవెంటనే ఔటయ్యారు. షాహిన్‌ అఫ్రిది 2 వికెట్లు తీశాడు. హసన్‌ అలీ, వాహబ్‌ రియాజ్‌, మహ్మద్‌ హఫీజ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.



మరిన్ని

నేటి మ్యాచులు

ఆస్ట్రేలియా

VS

బంగ్లాదేశ్

సమయం : మ 03:00 గం

వేదిక : ట్రెంట్‌ బ్రిడ్జ్‌

దేవతార్చన

రుచులు

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net