close

ప్రధానాంశాలు

మహీ.. రిటైర్‌ అవ్వొద్దు ప్లీజ్‌!

ముంబయి: ధోని రిటైర్మెంట్‌పై ఊహాగానాలు నడుస్తున్న నేపథ్యంలో.. అతడు ఇప్పుడే రిటైర్మెంట్‌ నిర్ణయం తీసుకోవద్దని కోరుతూ అతడి అభిమానులు సామాజిక మాధ్యమాలను ముంచెత్తుతున్నారు. సెమీస్‌లో జట్టును గెలిపించకపోయినా మహి గొప్పదనం తగ్గిపోదని, అతడి మీద తమ ప్రేమ అలాగే ఉంటుందని పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించారు. దిగ్గజ గాయని లతా మంగేష్కర్‌ ఇలాగే స్పందించడం విశేషం. రిటైర్‌ కావొద్దంటూ ధోనీకి ఆమె విజ్ఞప్తి చేస్తూ ట్వీట్‌ చేసింది. ‘‘ధోనీజీ.. మీరు రిటైరవ్వాలనుకుంటున్నట్లు ఈ రోజు ఉదయం నుంచి వార్తలు వింటున్నా. అలా ఆలోచించకండి ప్లీజ్‌. మీ ఆట దేశానికి ఇంకా అవసరం. రిటైర్మెంట్‌ ఆలోచనే చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా’’ అని లత ట్విటర్లో పేర్కొంది. తనలో ఇంకా చాలా క్రికెట్‌ మిగిలుందనే విషయాన్ని ప్రపంచకప్‌లో ధోని రుజువు చేశాడని బీసీసీఐ పాలకుల కమిటీ సభ్యురాలు డయానా ఎడుల్జీ పేర్కొంది.

అభిమాని గుండె ఆగింది
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ధోని రనౌట్‌ను చూసిన పశ్చిమ బంగాకు చెందిన శ్రీకాంత్‌ (33) గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే అతణ్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు ఒడిషాకు చెందిన సంబరు భోయ్‌ భారత్‌ ఓటమి తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.



Tags :

మరిన్ని

నేటి మ్యాచులు

దేవతార్చన

రుచులు

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net