close

ప్రధానాంశాలు

ధోనీ రనౌట్‌పై గప్తిల్‌ ఏమన్నాడంటే?

ఐసీసీ విడుదల చేసిన వీడియోలో..

మాంచెస్టర్‌: ప్రపంచకప్‌ తొలి నాకౌట్‌లో టీమిండియా వికెట్‌కీపర్‌, బ్యాట్స్‌మన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ(50; 72 బంతుల్లో  1x4, 1x6)ని మార్టిన్‌ గప్తిల్‌ రనౌట్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై  గప్తిల్‌ స్పందిస్తూ.. ధోనీని డైరెక్ట్‌ హిట్‌గా రనౌట్‌ చెయ్యడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నాడు. ఐసీసీ విడుదల చేసిన ఓ వీడియోలో అతను మాట్లాడుతూ ‘ఎంత అదృష్టం ఉంటే ధోనీని కీలక సమయంలో డైరెక్ట్‌ హిట్‌ చేశాను’ అని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో ధోనీ ఔటవ్వడం వల్లే టీమిండియా ఓడిపోయింది. 

మంగళవారం ప్రారంభమైన మ్యాచ్‌లో తొలుత న్యూజిలాండ్‌ 46.1 ఓవర్లకు 211/5తో నిలిచిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా మ్యాచ్‌ బుధవారం కొనసాగించారు. నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి కివీస్‌ 239 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో టీమిండియా టాప్‌ ఆర్డర్‌ కుదేలైన వేళ రవీంద్రజడేజా(77; 59 బంతుల్లో 4x4, 6x4), ధోనీ సమయోచితంగా ఆడి విజయంపై ఆశలు రేపారు. అయితే కీలక సమయంలో వీరిద్దరూ ఔటవ్వడంతో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.



మరిన్ని

నేటి మ్యాచులు

దేవతార్చన

రుచులు

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net