హాకీ, రేసింగ్‌, గిటార్‌.. జెమీ ఆల్‌రౌండర్‌

జెమీమా.. ఇప్పుడు ఏ క్రికెట్‌ ప్రేమికుల నోట విన్నా ఇదే మాట. మహిళల వన్డే ప్రపంచకప్‌లో ‘కంగారూ’లకు ఎదురునిలిచి టీమ్‌ఇండియాను ఫైనల్‌కు చేర్చిన జెమీ కోసం నెట్టింట తెగ వెతికేస్తున్నారు. మరి ఆమె ఇష్టాయిష్టాలు, ఆసక్తులేంటో తెలుసా?

జెమీమా 2000 సంవత్సరంలో ముంబయిలో జన్మించింది. నాలుగేళ్ల వయసు నుంచే క్రికెట్‌పై ఇష్టం పెంచుకుంది. స్కూల్లో చదువుకునేటప్పుడు తన తండ్రి జూనియర్‌ కోచ్‌గా పనిచేశారు.

టీనేజ్‌లో తనకి కోచింగ్‌ ఇచ్చింది కూడా తండ్రే.. ‘ఆయన చెప్పిన ఎన్నో ట్రిక్‌లు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. నా మొదటి హీరో మా నాన్నే’ అని తరచూ చెబుతుంటుంది.

క్రికెట్‌తో పాటు జెమీమాకు హాకీ అంటే కూడా ఇష్టం. మహారాష్ట్ర నుంచి అండర్‌ 17, అండర్‌ 19 జట్లకు ప్రాతినిధ్యం వహించింది. బాస్కెట్‌ బాల్‌, ఫుట్‌బాల్‌ కూడా ఆడుతుంది.

వంట చేయడం నచ్చుతుంది. ఖాళీ సమయాల్లో ఇంట్లో నచ్చిన రెసిపీలను చేసుకొని ఆస్వాదిస్తుంది.

ముంబయి వీధుల్లోని స్ట్రీట్‌ ఫుడ్ చూస్తే నోటికి పనిచెప్పాల్సిందే. అన్నింటికంటే ‘పావ్‌బాజీ ఎక్కువగా తింటా’ అని చెబుతోంది.

రేసింగ్‌ అంటే రయ్‌ రయ్‌ అంటూ పరుగెడుతుంది. వీలుకుదిరినప్పుడల్లా.. ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌, ఫ్యామిలీతో కలిసి రేసింగ్‌కు వెళ్తుంది.

‘జీవితం అంటే సాదాసీదాగా బతకడం కాదు.. ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తూ మనకు నచ్చినట్లుగా ఉండటమే’ అనేది జెమీమా పాలసీ.

ప్రయాణాలతో రిఫ్రెష్‌ అవుతుంది. లండన్‌ వీధుల్లో తిరగడం ఈమెకు బాగా ఇష్టం. అయితే, ప్రకృతికే మొదటి ఓటు అంటుంది. ట్రెక్కింగ్‌కి వెళ్తుంది. బీచ్‌లో సన్‌రైజ్‌, సన్‌సెట్‌ను ఆస్వాదిస్తుంది.

ఫ్యామిలీ ఫంక్షన్లు, పెళ్లిళ్లు, గెట్‌ టుగెదర్‌ వంటివి అస్సలు మిస్‌ కాదు. నలుగురితో కలిసి ఆనందాన్ని పంచుకోవాలంటుంది.

పుస్తకాలు ఎక్కువగా చదువుతుంది. ‘ఓ మంచి పుస్తకంతో పాటు ఓ కప్పు కాఫీ ఉంటే మూడ్‌ చిల్‌ అవుతుంది’ అని చెప్పింది.

ఒత్తిడిని తగ్గించుకునేందుకు తరచూ స్నేహితులతో రీల్స్‌, డ్యాన్స్‌ చేస్తుంది. వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంది.

క్రికెటర్‌ రోహిత్‌ శర్మ ఫేవరెట్‌. సచిన్‌ ఇన్‌స్పిరేషన్‌ అని చెబుతుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ ప్రాక్టీస్‌ వీడియోలు, ఫ్రెండ్స్‌తో చేసిన అల్లరి, ట్రిప్పుల ఫొటోలు పంచుకుంటూ ఉంటుంది. ఈమె ఇన్‌స్టా ఖాతాని 19 లక్షల మంది ఫాలో అవుతున్నారు.

స్మృతి మంధాన, జెమీమా మంచి స్నేహితులు.. ‘నిజానికి తను నా ఫ్రెండ్‌ అనడం కంటే సోదరి అని చెప్పొచ్చు’ అని క్యాప్షన్‌ జోడించి సోషల్‌ మీడియాలో ఆమెతో దిగిన ఫొటోలు షేర్‌ చేస్తుంది.

ఈమెకి షాపింగ్‌ చేయడం చాలా నచ్చుతుంది. మాల్స్‌లో రకరకాల దుస్తులను ట్రై చేసి ఫొటోలకు పోజులిస్తూ ఉంటుంది.

పెంపుడు జంతువులంటే చాలా ప్రేమ. ఇంట్లో ఉంటే ఎక్కువ సమయం వాటితోనే ఆడుకుంటుంది. శునకాలకు పుట్టినరోజు వేడుకలు చేసి ఆనందిస్తుంది.

ఫిట్‌గా ఉండేందుకు జిమ్‌లో కఠినంగా శ్రమిస్తుంది. జిమ్‌ మేట్స్‌తో ఫన్నీగా ఆడుతూ పాడుతూ వ్యాయామం ముగిస్తుంది.

జెమీమా బ్యాట్‌ పట్టుకొని గ్రౌండ్‌లో రన్స్‌ చేయడమే కాదు.. గిటార్‌ని వాయిస్తూ పాటలు కూడా పాడుతుంది.

Web Stories Home