-
నేను బంగారంలో మదుపు చేయాలనుకుంటున్నాను. నెలకు కనీసం రూ.5,000 దీనికోసం కేటాయించాలని ఆలోచన. గోల్డ్ ఫండ్లలో లేదా గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఏవి మంచివి? కనీసం 10 ఏళ్ల తర్వాత ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాను. ప్రత్యామ్నాయంగా ఏ పెట్టుబడులను ఎంచుకోవచ్చు?
మీరు భవిష్యత్తులో బంగారం కొనే ఆలోచనతో ఉంటేనే.. మీరు చెప్పిన పెట్టుబడి పథకాలను ఎంచుకోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లో మదుపు చేయాలంటే మీకు డీమ్యాట్ ఖాతా ఉండాలి. సాధారణంగా ఇందులో ఒక యూనిట్ ధర ఒక గ్రాము బంగారంతో సమానంగా ఉంటుంది. మున్ముందు బంగారం ధర పెరిగితే.. ఆ మేరకు మీ పెట్టుబడి మొత్తమూ పెరగాలి. దీనికన్నా గోల్డ్ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయడం మంచిది. పసిడి కొనడం కాకుండా.. కేవలం పెట్టుబడి మాత్రమే మీ లక్ష్యం అయితే.. ప్రత్యామ్నాయంగా హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేసేందుకు ప్రయత్నించండి. -
మా అమ్మాయి పేరుమీద ఇప్పటికే సుకన్య సమృద్ధి యోజనలో నెలకు రూ.5వేల చొప్పున జమ చేస్తున్నాను. ఇప్పుడు మరో రూ.3వేల వరకూ ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్)లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. ఇది మంచి ఆలోచనేనా?
మీరు ఇప్పటికే సురక్షితమైన, పన్ను వర్తించని ఆదాయం ఇచ్చే సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెడుతున్నారు. పీపీఎఫ్ కూడా ఇలాంటి పథకమే. కాబట్టి, మీరు కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తాన్ని కాస్త అధిక రాబడినిచ్చే పథకానికి మళ్లించండి. వీటిల్లో కాస్త నష్టభయం ఉన్నా.. దీర్ఘకాలంలో మంచి రాబడికి అవకాశం ఉంటుంది. రూ.3వేలను డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్లలో సిప్ చేయండి. వీటిల్లో 10-12 ఏళ్లపాటు మదుపు చేస్తే.. మీకు 12-13శాతం వరకూ రాబడి వచ్చే వీలుంది.
- TRENDING TOPICS
- IND vs ENG
- Maharashtra Crisis
- Agnipath
- Presidential Election
- Ukraine Crisis
తాజా వార్తలు
వీడియోలు
-
National: ఖైదీలకు శుభవార్త .. క్రిమినల్ కేసులు లేకుంటే విడుదల!
-
Spicejet: స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం.. పాక్‌లో అత్యవసర ల్యాండింగ్
-
Asthma: చిన్నారుల్లో అస్తమా.. వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
-
Italy: ఇటలీలో నీటి కరవు..అత్యవసర పరిస్థితి విధింపు
-
Sabitha: కబ్జా ఆరోపణలా.. కృష్ణన్నతో మాట్లాడతా: సబిత
-
crime News: దోష నివారణ పూజలు చేస్తామంటూ రూ.37 లక్షలు స్వాహా
ఫొటోలు


ఇవి చూశారా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- China’s real estate crisis: పుచ్చకాయలకు ఇళ్లు.. సంక్షోభంలో చైనా రియల్ ఎస్టేట్ ..!
- Double BedRooms: అమ్మకానికి.. రెండు పడక గదుల ఇళ్లు!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- IND vs ENG : టెస్టు క్రికెట్ చరిత్రలో టాప్-4 భారీ లక్ష్య ఛేదనలు ఇవే..!
- Anveshi Jain: ‘సీసా’ తో షేక్ చేస్తున్న అన్వేషి జైన్.. హుషారు వెనక విషాదం ఇదీ!
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!