Salman-Antim: సల్మాన్‌ ‘అంతిమ్‌’ ట్రైలర్‌.. గూండాకా బాప్‌ పోలీస్‌ వాలా! - salman khan antim the final truth official trailer
close
Published : 26/10/2021 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Salman-Antim: సల్మాన్‌ ‘అంతిమ్‌’ ట్రైలర్‌.. గూండాకా బాప్‌ పోలీస్‌ వాలా!

ముంబయి: బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అంతిమ్: ది ఫైనల్‌ ట్రూత్‌’. ఆయుష్‌ శర్మ కీలకపాత్ర పోషించాడు. మహేశ్‌ వి.మంజ్రేకర్‌ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో సల్మాన్‌ సిక్కు పోలీసు అధికారిగా కనిపించారు. గ్యాంగ్‌స్టర్స్‌కు, పోలీసులకు మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఈ కథ సాగుతుందని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.

‘మహా భారతంలో హీరో ఎవరో తెలుసా’ అని షాయాజీషిండేను సల్మాన్‌ అడగ్గా, ‘అర్జున్‌’ అని అంటాడు. ‘కాదు కృష్ణుడు’ అంటూ సల్మాన్‌ చెప్పే సంభాషణలు అలరిస్తున్నాయి. ‘నిన్ను గూండా అని పిలవను. కానీ, గూండాకా బాప్‌ ఈ పోలీస్‌వాలా’, ‘నీకు తెలుసా?నేను పుణెకు భాయ్‌ని‌’ అని ఆయుష్‌ శర్మ అంటే, ‘నువ్వు పుణెకు కొత్తగా భాయ్‌వి అయి ఉండవచ్చు. నేను ఎప్పటి నుంచో హిందుస్థాన్‌ మొత్తానికి భాయ్‌ని’ అంటూ సల్మాన్‌ చెప్పే డైలాగ్స్‌ విజిల్స్‌ వేయించేలా ఉన్నాయి. నవంబరు 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

జీ5లో వచ్చిన మరాఠీ క్రైమ్‌ డ్రామా ‘ముల్షీ’కి కొనసాగింపుగా సల్మాన్‌ఖాన్‌ సొంత బ్యానర్‌ ఎస్‌కేఎఫ్‌లో తాజా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నటుడు, దర్శకుడు మహేష్‌ మంజ్రేకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ కేవలం  60 రోజుల్లోనే పూర్తి చేసేశారు. సల్మాన్‌ కేవలం 30 నుంచి 35 రోజుల మాత్రమే షూటింగ్‌లో పాల్గొనడం మరో విశేషం. గత పదేళ్లలో సల్మాన్‌ సినిమా ఇంత వేగంగా తెరకెక్కడం ఇదే మొదటిసారి. హితేశ్‌ మోదక్‌, రవి బసూర్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సల్మాన్‌ఖాన్‌ నిర్మిస్తున్నారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని