టెక్ మహీంద్రా లాభం రూ.1297 కోట్లు
[02:35]
డిసెంబరు త్రైమాసికంలో టెక్ మహీంద్రా ఏకీకృత నికర లాభం 5.3 శాతం తగ్గి రూ.1,297 కోట్లకు పరిమితమైంది. 2021-22 ఇదే కాల లాభం రూ.1,378.20 కోట్లు కావడం గమనార్హం ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.11,451 కోట్ల నుంచి 20 శాతం పెరిగి రూ.13,734.60 కోట్లకు చేరింది.