-
నేను బంగారంలో మదుపు చేయాలనుకుంటున్నాను. నెలకు కనీసం రూ.5,000 దీనికోసం కేటాయించాలని ఆలోచన. గోల్డ్ ఫండ్లలో లేదా గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఏవి మంచివి? కనీసం 10 ఏళ్ల తర్వాత ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాను. ప్రత్యామ్నాయంగా ఏ పెట్టుబడులను ఎంచుకోవచ్చు?
మీరు భవిష్యత్తులో బంగారం కొనే ఆలోచనతో ఉంటేనే.. మీరు చెప్పిన పెట్టుబడి పథకాలను ఎంచుకోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లో మదుపు చేయాలంటే మీకు డీమ్యాట్ ఖాతా ఉండాలి. సాధారణంగా ఇందులో ఒక యూనిట్ ధర ఒక గ్రాము బంగారంతో సమానంగా ఉంటుంది. మున్ముందు బంగారం ధర పెరిగితే.. ఆ మేరకు మీ పెట్టుబడి మొత్తమూ పెరగాలి. దీనికన్నా గోల్డ్ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయడం మంచిది. పసిడి కొనడం కాకుండా.. కేవలం పెట్టుబడి మాత్రమే మీ లక్ష్యం అయితే.. ప్రత్యామ్నాయంగా హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేసేందుకు ప్రయత్నించండి. -
మా అమ్మాయి పేరుమీద ఇప్పటికే సుకన్య సమృద్ధి యోజనలో నెలకు రూ.5వేల చొప్పున జమ చేస్తున్నాను. ఇప్పుడు మరో రూ.3వేల వరకూ ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్)లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. ఇది మంచి ఆలోచనేనా?
మీరు ఇప్పటికే సురక్షితమైన, పన్ను వర్తించని ఆదాయం ఇచ్చే సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెడుతున్నారు. పీపీఎఫ్ కూడా ఇలాంటి పథకమే. కాబట్టి, మీరు కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తాన్ని కాస్త అధిక రాబడినిచ్చే పథకానికి మళ్లించండి. వీటిల్లో కాస్త నష్టభయం ఉన్నా.. దీర్ఘకాలంలో మంచి రాబడికి అవకాశం ఉంటుంది. రూ.3వేలను డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్లలో సిప్ చేయండి. వీటిల్లో 10-12 ఏళ్లపాటు మదుపు చేస్తే.. మీకు 12-13శాతం వరకూ రాబడి వచ్చే వీలుంది.
- TRENDING TOPICS
- IND vs ENG
- Maharashtra Crisis
- Agnipath
- Presidential Election
- Ukraine Crisis
ఫొటోలు


ఇవి చూశారా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
- Gas Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- Online Food delivery: ఆన్లైన్ Vs ఆఫ్‌లైన్: ఫుడ్ డెలివరీ దోపిడీని బయటపెట్టిన యూజర్.. పోస్ట్ వైరల్!
- ప్రముఖ వాస్తు నిపుణుడి దారుణ హత్య.. శరీరంపై 39 కత్తిపోట్లు
- Health : పొంచి ఉన్న ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు!
- Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య