Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా షికాగోలో ఎన్ఆర్ఐల నిరసన
ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)ను అరెస్ట్ చేసిన విధానాన్ని ఖండిస్తూ షికాగోలో ఎన్ఆర్ఐ తెదేపా అధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అభిమానులు WeStandWithCBN నినాదాలతో చంద్రబాబుకు మద్దతు తెలిపారు. జగన్ నిరంకుశ విధానాలను ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక తెదేపా సీనియర్ నాయకులు హేమ కానూరు, అధ్యక్షుడు రవి కాకర, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ పెదమల్లు, హను చెరుకూరి, చిరంజీవి గల్లా, హరీష్ జమ్ముల, శ్రీనివాస్ అట్లూరి తదితరులు పాల్గొన్నారు.