‘పెళ్లిసందడి’లో హీరో ఇతడే! - Meet our hero Roshan in PelliSandaD
close
Published : 27/10/2020 10:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పెళ్లిసందడి’లో హీరో ఇతడే!

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘పెళ్లి సందడి’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే పేరుతో మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఇటీవల రాఘవేంద్రరావు వెల్లడించారు. తాజాగా ఈ చిత్రంలోని కథానాయకుడిని పరిచయం చేస్తూ ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. రోషన్‌ ఇందులో కథానాయకుడిగా నటించనున్నాడు. నటుడు శ్రీకాంత్‌-ఊహాల తనయుడే రోషన్‌. గతంలో ‘నిర్మలా కాన్వెంట్‌’ చిత్రంలో నటించి మెప్పించాడు. ఇప్పుడు తండ్రి నటించిన ‘పెళ్లి సందడి’ టైటిల్‌తో వస్తున్న చిత్రంలో నటిస్తూ కథానాయకుడిగా వెండితెరకు పరిచయం కాబోతున్నాడు.

ఆర్కా మీడియా నిర్మాణంలో ఈ సీక్వెల్‌ రాబోతోంది. గౌరీ రోనంకి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. శివశక్తి దత్త, చంద్రబోస్‌ సాహిత్యం అందిస్తున్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేయనున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని